Tirumala News : ఇక రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం, వర్చువల్ క్యూ లైన్ పై టీటీడీ ఆలోచన!

Tirumala News : తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు గంటలకొద్ది క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ సమస్య పరిష్కారానికి టీటీడీ ఓ ఆలోచన చేస్తుంది.

FOLLOW US: 

Tirumala News : తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం లక్షల్లో భక్తులు వస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా శ్రీ వెంకటేశ్వరస్వామని దర్శించుకోవాలని భక్తులు భావిస్తుంటారు. రెండేళ్ల కరోనా నిబంధనలు ఎత్తివేయడంతో ఏడుకొండలకు భక్తులు క్యూ కట్టారు. భక్తుల రద్దీ ఇటీవల బాగా పెరిగింది. దీంతో టీటీడీ(TTD)  సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సామాన్య భక్తుల కోసం శ్రీవారి నిత్య సేవలను లక్కీ డిప్ విధానంలో, ఆర్జిత సేవల టోకెన్ల విధానాన్ని అమలు చేస్తుంది. అలాగే వయో వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుచేసింది. ఉచిత దర్శనం కోసం ప్రత్యేకంగా క్యూ కాంప్లెక్స్ లను టీటీడీ ఇప్పటికే ఏర్పాటు చేసింది.

వర్చువల్ క్యూ విధానం 

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. గంటల తరబడి క్యూలైన్ లో పిల్లలు, వయో వృద్ధులు, మహిళలు వేచి ఉండి ఇబ్బంది పడుతుంటారు. శ్రీవారి దర్శనానికి(Srivari Darshan) ఒక్కోసారి 48 గంటలకు పైనే సమయం పడుతుంటుంది. క్యూ కాంప్లెక్స్ లలో టీటీడీ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ వేచి ఉండే సమయాన్ని తగ్గించే పరిస్థితి కనిపించడంలేదు. దీనిపై ఆలోచన చేసిన టీటీడీ వర్చువల్ క్యూ విధానాన్ని(Virtual Queue line) ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. భక్తులు ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్ క్యూ విధానంలో శ్రీవారిని దర్శించుకునేందుకు చర్యలు చేపడుతోంది. 

టైం స్లాట్ ప్రకారం వస్తే 

టైం స్లాట్ కు ప్రకారం భక్తులు తిరుమలకు చేరుకుంటే కేవలం 2 గంటలలోపే శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు చేపడుతోంది. దీంతో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. నిర్ణీత టైం ప్రకారం వచ్చిన భక్తులకు తక్కువ సమయంలో దర్శనం కల్పించవచ్చనేది టీటీడీ ఆలోచన

తిరుమల పవిత్రోత్సవాలు

కోవిడ్ ప్రభావంతో రెండేళ్ల పాటు శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించిన పవిత్రోత్సవాలను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 8 నుంచి 10 వరకూ మూడు రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలకు ఆగస్టు 7వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో జరిగే పలు ఆర్జిత సేవలను టీటీడీ మూడు రోజుల పాటు రద్దు చేసింది. 

పవిత్రోత్సవాలు అంటే?  

వైష్ణవ సంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతశౌచం వంటి సమయాల్లో తెలిసో తెలియకో భక్తులు, సిబ్బంది వల్ల కలిగే దోషాల వల్ల ఆలయం పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకే మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవం పవిత్రోత్సవం. ఈ పవిత్రోత్సవాలను 15వ శతాబ్దంలో 5 రోజుల పాటు నిర్వహించేవారని పురాణ ప్రతీతి. ముఖ్యంగా క్రీ.శ 1464లో ఒక తమిళ శాసనంలో ఈ పవిత్రోత్సవాల ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో శ్రావణ మాసంలో నిర్వహిస్తున్నట్లు సాళువ మల్లయ్యదేవ మహారాజు రాయించిన శాసనంతో ఈ విషయం స్పష్టమవుతుంది. అయితే శాసనాల ఆధారం ప్రకారం పవిత్రోత్సవాలను క్రీ.శ.1562 వరకు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఆ తరువాత కొంత కాలం పాటు పవిత్రోత్సవాలను నిర్వహించలేదు.  1962 నుంచి టీటీడీ పవిత్రోత్సవాల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. 

Published at : 24 Jul 2022 04:46 PM (IST) Tags: ttd AP News Tirumala news Tirupati News Srivari Darshan Virtual queue line

సంబంధిత కథనాలు

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

Balineni Srinivas Reddy : పవన్ చేనేత ఛాలెంజ్ స్వీకరించిన బాలినేని, ట్వీట్ తో రిప్లై

Balineni Srinivas Reddy : పవన్ చేనేత ఛాలెంజ్ స్వీకరించిన బాలినేని, ట్వీట్ తో రిప్లై

National Handloom Day : చేనేత కళాకారులకు ఎప్పుడూ అండగా నిలుస్తాం - సీఎం జగన్

National Handloom Day : చేనేత కళాకారులకు ఎప్పుడూ అండగా నిలుస్తాం - సీఎం జగన్

EX MLC Annam Satish: రూపాయి పెట్టి వంద దోచుకుంటున్నారు, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిపై అన్నెం సతీష్ ఫైర్

EX MLC Annam Satish:  రూపాయి పెట్టి వంద దోచుకుంటున్నారు, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిపై అన్నెం సతీష్ ఫైర్

Kurnool News : 'ఫ్రెండ్ షిప్ డే' నాడు విషాదం, వాగులో కొట్టుకుపోయిన నలుగురు మిత్రులు

Kurnool News : 'ఫ్రెండ్ షిప్ డే' నాడు విషాదం, వాగులో కొట్టుకుపోయిన నలుగురు మిత్రులు

టాప్ స్టోరీస్

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!