అన్వేషించండి

Tirumala : ఆగస్టులో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డ్ బ్రేక్, వరుసగా ఆరు నెలలు రూ.100 కోట్ల మార్క్!

Tirumala : తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. గత ఆరు నెలలుగా రూ.100 కోట్ల మార్కును దాటుతోంది. రెండేళ్ల వ్యవధి తర్వాత భక్తులు తిరుమల వస్తుండడంతో హుండీ ఆదాయం పెరిగింది.

Tirumala : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద మొక్కుల వాడైన శ్రీనివాసుడు కొలువైయున్న పుణ్యక్షేత్రం తిరుమల. కొర్కేలు తీర్చే కోనేటి రాయుడు కాబట్టి వేంకటేశ్వర స్వామి వారికి ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు భక్తులు. కోరిక నెరవేరిన వెంటనే నగదుతో పాటుగా బంగారు, వెండి ఆభరణాలతో పాటుగా, మణులు మణిక్యాలు పొదిగిన కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు భక్తి భావంతో సమర్పిస్తుంటారు భక్తులు.  అంతే‌కాకుండా స్వామి వారి పేరిట కోట్ల విలువ చేసే భూమి పత్రాలు కూడా  భక్తి శ్రద్దలతో సమర్పిస్తుంటారు. ఇలా దేశ నలువైపులా నుంచి తిరుమలకు విచ్చేసే భక్తులు వివిధ రూపాల్లో వారి వారి స్థోమత తగ్గట్టుగా కానుకలను సమర్పిస్తుంటారు. భక్తుల సమర్పించిన కానుకలను అత్యంత భధ్రత నడుమ వాటిని లెక్కించి భద్రంగా ఉంచుతారు టీటీడీ అధికారులు.  

భక్తుల రద్దీతో 

ప్రపంచ మానవాళి ఎప్పుడూ ఊహించని ఉపద్రవం రూపంలో కరోనా వ్యాప్తితో గడగడపోయారు. కరోనా వ్యాప్తి టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 83 రోజుల పాటు శ్రీనివాసుడి దర్శనానికి భక్తులకు అనుమతిని టీటీడీ రద్దు చేసింది. భక్తుల అనుమతి రద్దు చేసి ఏకాంతంగా స్వామి వారికి కైంకర్యాలను నిర్వహించింది. కరోనా వ్యాప్తి అదుపులోకి రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో పరిమిత సంఖ్యలోనే భక్తులను తిరుమలకు అనుమతిస్తూ వచ్చారు. దీంతో స్వామి వారి హుండీ ఆదాయం కూడా అంతంత మాత్రంగానే లభించింది. దీంతో ప్రతి ఏటా అంచనా వేసే టీటీడీ బడ్జెట్ సైతం అంచనా తప్పింది. ఇక కోవిడ్ ప్రభావం పూర్తిగా అదుపులోకి రావడంతో ఏప్రిల్ నుండి సర్వదర్శనం భక్తులను అనుమతించింది టీటీడీ. భక్తుల రద్దీతో స్వామి వారి హుండీ ఆదాయం క్రమేపి పెరుగుతూ వచ్చింది. 

వరుసగా ఆరో నెల రూ. 100 కోట్ల మార్క్ 

ఈ క్రమంలో టీటీడీ చరిత్రలో ఎన్నడూ రాని విధంగా ఆగస్టు నెలలో శ్రీవారికి అత్యధికంగా హుండీ ద్వారా కానుకలు వచ్చాయి. ఈ ఏడాది మార్చి నెలలో రూ.128 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ.127.5 కోట్లు, మే నెలలో రూ.130.5 కోట్లు, జూన్ నెలలో రూ.123.76 కోట్ల హుండీ ఆదాయం లభించింది.  జులై నెలలో హుండీ ద్వారా రూ.139.45 కోట్ల ఆదాయం లభించగా, ఆగస్టు మాసంలో ఆ రికార్డు బ్రేక్ చేస్తూ 140.7 కోట్ల రూపాయలు హుండీ ద్వారా కానుకలు వచ్చాయి. ఇక  మొత్తం నాలుగు నెలల్లో రూ.789.91 కోట్లు స్వామి వారికి కానుకలు అందాయి. వరుసగా ఆరో నెల రూ.100 కోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటగా, ఆగష్టు మాసంలో 22 లక్షల 80 వేల 84 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. పది లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది తలనీలాలు సమర్పించారు. 1954 జూన్ లో స్వామి వారికి రూ.5,35,703 హుండీ ఆదాయం రాగా, 2015-2016 సంవత్సరంలో ఏకంగా రూ.1010 కోట్లు ఆదాయం వచ్చింది. కరోనా వ్యాప్తికి గత రెండేళ్లుగా హుండీ ఆదాయం ఊహించని స్థాయిలో తగ్గింది. కరోనా సమయంలో స్వామి వారిని దర్శించలేని భక్తులు ఒక్కసారిగా తిరుమలకు అధిక సంఖ్యలో విచ్చేస్తుండడంతో క్రమేపి హుండీ ఆదాయం పెరుగుతుంది. 

Also Read : CM Jagan Review : ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టండి, అధికారులకు సీఎం జగన్ క్లాస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Embed widget