By: ABP Desam | Updated at : 09 Dec 2022 09:54 AM (IST)
Edited By: jyothi
తిరుమలలో విపరీతమైన అవినీతి అంటూ రమణదీక్షితులు ట్వీట్!
Tirumala News: ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమలలో ప్రస్తుతం విపరీతమైన అవినీతి మాత్రమే ఉందంటూ శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు ఏవీ రమణదీక్షితులు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సంచలనంగా మారింది. అయితే శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 కుటుంబాలు వంశపారంపర్యంగా సేవలు అందించేవి. యాదవులు, కుమ్మరి, బుట్టలు అల్లేవారు, తోటమాలీలు, వాహన బేరర్లు, వడ్రంగులు, నేత కార్మికులు వంటి ఉండేవారు. అయితే 30/87 యాక్టుతో ఆ వ్యవస్థలు తుడిచి పెట్టుకుపోయాయి. ప్రస్తుతం విపరీతమైన అవినీతి మాత్రమే ఉంది" అంటూ రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
అయితే ఈ విషయంపై నెటిజెన్లలో చర్చ జరుగుతుండగా.. కొద్ది గంటల్లోనే రమణ దీక్షితులు ఆ ట్వీట్ ను తొలగించారు. తాను కేవలం తిరుమలలో రద్దు చేసిన వారసత్వ వ్యవస్థలు గురించి మాత్రమే మాట్లాడినట్లు తెలిపారు. యాక్ట్ ద్వారా వాటిని తొలగించారు కానీ అవినీతిని నిర్మూలించలేకపోయారని మాత్రమే చెప్పానని అన్నారు. అయితే ఈ విషయాన్ని కూడా ట్వీట్ ద్వారానే వెల్లడించారు. కానీ ఆ తర్వాత మరికొన్ని గంటలకు దీన్ని కూడా డిలీట్ చేసేశారు.
కాసేపటి క్రితం అవినీతి బంధుప్రీతిపై వేరేవాళ్లు చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేశారు రమణ దీక్షితులు. భారతదేశంలోని వంశపారంపర్య పూజారులు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం... రాజకీయ బంధుప్రీతి. అవినీతి ప్రభావాన్ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తారని సైంటిస్ట్ ప్రీస్ట్ అనే వ్యక్తి చేసిన ట్వీట్‌ను రమణదీక్షితులు షేర్ చేశారు. అవును. ఇది నిజమేనని.. కానీ పాత రాక్షసుడి లాంటి స్వార్థపూరిత వ్యక్తులు మాత్రం జీర్ణించుకోలేనిదంటూ సెటైర్లు వేశారు.
Yes. This is the fact but not digestible to the selfish self centered lot like our old asuras. https://t.co/BKRqBDsGZe
— Ramana Dikshitulu (@DrDikshitulu) December 9, 2022
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..!
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం అంటే డిసెంబర్ 8వ తేదీ రోజ 54 వేల 609 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 26 వేల 718 మంది తలనీలాలు సమర్పించగా, 3.39 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడంతో బయట ఎంబసీ వరకూ క్యూలైన్సులో వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వ దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.
శుక్రవారం స్పెషల్ పూజలివే..!
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారము తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అటుతరువాత తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో "బెల్లం పూర్ణం బోండాలు, పోలీల" శుక్రవారం ప్రత్యేకంగా నివేదిస్తారు. ఇక వీటితో పాటుగా అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవ మూర్తులు అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయం వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అనంతరం ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంకాలం సహస్ర దీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం జరుపుతారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా అర్చకులు ఏకాంత సేవను నిర్వహిస్తారు.
All India Couple Tour : ఆల్ ఇండియా కపుల్ టూర్, సైకిల్ పై రాష్ట్రాలు దాటుతున్న పశ్చిమ బెంగాల్ జంట
JC Prabhakar Reddy : రేయ్ పోలీస్ మీపై నమ్మకం పోయింది, జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Breaking News Live Telugu Updates: గవర్నర్ వివాదంపై వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కారు
రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ వ్యాఖ్యలు, అచ్చెన్నాయుడూ నోరు అదుపులో పెట్టుకో: డిప్యూటీ స్పీకర్
Fish Tunnel Exhibition : విశాఖలో ఆకట్టుకుంటున్న ఫిష్ టన్నెల్, ప్రదర్శనకు అరుదైన చేపలు
Kavali MLA : మేం సత్యవంతులం కాదు - కానీ టీడీపీ హయాం కంటే తక్కువ అవినీతి చేస్తున్నామన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే !
Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?
Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి
Murali Vijay Retirement: అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన భారత సీనియర్ బ్యాటర్