Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలలో భక్తుల రద్దీ అనుహ్యంగా పెరిగిపోయింది. భక్తుల దర్శనానికి రెండు రోజుల పట్టే అవకాశం ఉంది. కాబట్టి తిరుమల వచ్చే వారు దర్శనాలను వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరింది.

FOLLOW US: 

Tirumala News : వేసవి సెలవులు, వారాంతాలు కావడంతో తిరుమలలో రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూలైన్స్ పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. విశేష సంఖ్యలో వచ్చిన భక్తులతో సప్తగిరులు గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి.  శ్రీవారి దర్శనార్ధం నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తిరుమలకు చేరుకుంటారు. ఇలా చేరుకున్న భక్తులు క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటలు, రోజులు తరబడి వేచి ఉండి మరి స్వామి వారి ఆశీస్సులు పొందుతుంటారు. కోవిడ్ పూర్తి స్థాయిలో అదుపులోకి రావడంతో టీటీడీ సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ టిక్కెట్లు లేకుండానే భక్తులను కొండకు అనుమతిస్తుంది. ఈ క్రమంలో గత కొద్ది నెలలుగా భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులతో తిరుమలగిరులు నిండి పోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1,2 లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండి పోవడంతో సర్వదర్శనం క్యూలైన్ లేపాక్షి సర్కిల్ దాటుకుని షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా కొత్త అన్నదాన సత్రం వరకూ చేరింది. 

మరికొద్ది రోజుల పాటు రద్దీ 

భక్తుల రద్దీ పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూలైన్స్ వద్ద అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే‌కాకుండా భక్తుల అనూహ్య రద్దీపై వివిధ విభాగాధిపతులతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా క్యూలైన్స్ వేచి ఉన్న సామాన్య భక్తుల కోసం అన్నప్రసాదం, తాగునీరు, పాలు వంటి సౌఖర్యాలు ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. మరికొద్ది రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో సామాన్య భక్తులకు అవసరం అయ్యే ఏర్పాట్లపై అధికారులు నిమగ్నం అయ్యారు. భక్తుల సంఖ్య పెరగడంతో భక్తుల రద్దీ ప్రదేశాలైన అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అతిథి గృహాలు, వసతి భవనాలు, పీఏసీ-1,2,3,4,5 వద్ద పోలీసులు భద్రత ఏర్పాట్లు కట్టిదిట్టం చేశారు.  

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు 

తిరుమలలో అధిక భక్తుల రద్దీ దృష్ట్యా ఆదివారం వి.ఐ.పి బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా ఉందని, వైకుంఠ ఏకాదశి నాడు కంటే అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారని, గంటకు 4500 మంది భక్తులకి మాత్రమే దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఉందన్నారు. శ్రీవారి దర్శనానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని, ఔట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండింతలు అధికంగా ఉందన్నారు. అధిక రద్దీ దృష్టిలో ఉంచుకొని భక్తులకు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. పోలీసు, విజిలెన్స్, టీటీడీ స్టాఫ్ భక్తుల సౌకర్యం కల్పించడం కోసం శ్రమిస్తున్నట్లు వెల్లడించారు. 

Published at : 28 May 2022 10:22 PM (IST) Tags: AP News Tirumala news tirupati Tirumala Srivari Darshan

సంబంధిత కథనాలు

Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్

Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్

No Admissions In Govt School: సీఎం రికమండేషనైనా చెల్లదు- ఆ ప్రభుత్వ బడిలో చేరాలంటే ఎంట్రన్స్ రాయాల్సిందే!

No Admissions In Govt School: సీఎం రికమండేషనైనా చెల్లదు- ఆ ప్రభుత్వ బడిలో చేరాలంటే ఎంట్రన్స్ రాయాల్సిందే!

Breaking News Live Telugu Updates: పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి మాతృవియోగం

Breaking News Live Telugu Updates: పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి మాతృవియోగం

MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు

MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు

President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భార‌త‌ ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు

Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భార‌త‌ ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?

Balkampet Yellamma Photos: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, పాల్గొన్న మంత్రులు - ఫోటోలు చూడండి

Balkampet Yellamma Photos: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, పాల్గొన్న మంత్రులు - ఫోటోలు చూడండి

Narayana Murthy: పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృవియోగం

Narayana Murthy: పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృవియోగం