Supreme Court Amaravati : అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు - ఏపీ సర్కార్‌కు కొంచెం ఇష్టం - కొంచెం కష్టం ! ఇక విశాఖకు వెళ్తారా?
అమరావతి నిర్మాణాలను కాలపరిమితిలోపు పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదన్న అంశంపై మాత్రం స్టే ఇవ్వలేదు.
Supreme Court Amaravati : రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఆరు నెలల్లోనేగా రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాణాలు పూర్తి చేయాలన్న అంశంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఆరు నెలల్లో హైకోర్టును కూడా నిర్మించలేరని.. నిర్మాణాలను ఎలా పూర్తి చేస్తారని ధర్మానసం ప్రశ్నించింది. అయితే అసలు మూడు రాజధానులపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదని ఇచ్చిన హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న మూడు నుంచి ఏడు అంశాలు పూర్తిగా అమరావతి అభివృద్ధికి కాలపరిమితి నిర్దేశించి ఇచ్చినవి. వాటిపై జనవరి 31వ తేదీ వరకూ సుప్రీంకోర్టు స్టే విధించింది.
J. Joseph: Direction 5 is completely unacceptable, that you develop the capital city in 6 months. What do you mean by capital city?
— Live Law (@LiveLawIndia) November 28, 2022
Bench: Direction 3-7 stayed till the next date of hearing.
సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని పిటిషన్లపై చురుగ్గా వాదనలు సాగాయి. కేంద్ర ప్రభుత్వం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్.. ఏపీ హైకోర్టు ఇచ్చిన రిట్ ఆఫ్ మాండమస్‌పై స్టే ఇవ్వాలని కోరారు. రాజధానిని నిర్ణయించుకునే చట్టం చేసే అధికారం ప్రభుత్వానికి చెప్పడం సరి కాదన్నారు. అయితే రైతులతో చేసుకున్న ఒప్పందం గురించి ఏం చెబుతారని జస్టిస్ జోసెఫ్ ప్రస్తావించారు. అయితే అమరావతిగా రాజధానిని తరలించడం లేదని.. అమరావతిలో లేజిస్లేటివ్ రాజధాని ఉంటుందని..రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్టం ప్రకారం ఇప్పటికీ అమరావతినే రాజధానిగా ఉందన్నారు. రాజధాని విషయంలో చట్టం చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. ఓ దశలో మరో సీనియర్ న్యాయవాది నారిమన్.. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం ప్రత్యామ్నాయాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. అయితే జస్టిస్ జోసెఫ్ దీనిపై స్పందిస్తూ రాజధాని నిర్ణయం అనేది రాష్ట్రాల అధికారమని.. ఒక చోట పెట్టాలి .. అభివృద్ధి చేయాలని తాము చెప్పలేమని వ్యాఖ్యానించారు.
రైతుల తరపున సీనియర్ లాయర్ సీనియర్ లాయర్ శ్యామ్ దివాన్ వాదించారు. 29 వేల మందిరైతులు తమ బతుకు దెరువు అయిన భూమిని రాజధానికి ఇచ్చారన్నారు. ఇలా ఇవ్వడం వల్ల రాష్ట్రానికే.. కాదని.. వారికి కూడా లాభం ఉంటుందన్నారు. కానీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ఉల్లంగిస్తున్నారని.. 2019 నుంచి ఎలాంటి నిర్మాణాలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ధర్మాసనానికి చూపించారు.
అమరావతిలో హైకోర్టు నిర్మాణానికి ఎంత వెచ్చించారని జస్టిస్ జోసెఫ్ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. రూ. 150 కోట్లు కేటాయించారని.. ఇప్పటి వరకూ 116 కోట్లు ఖర్చు చేశారన్నారు. అయితే అది టెంపరరీ హైకోర్టు అని వాదించారు. వాదనలు జరుగుతున్న సమయంలో బెంచ్‌లో ఉన్న జస్టిస్ నాగరత్న ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని.. హైకోర్టు ఎలా చెబుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు సిటీ ప్లానర్‌గా మారుతుందా అని ప్రశ్నించారు. అయితే ఈ అంశంపై ప్రభుత్వం మళ్లీ హైకోర్టుకు వెళ్లి టైమ్ లైన్ విషయంలో సవరణలు కోరవచ్చని .. శ్యామ్ దివాన్ సూచించారు. తదుపరి విచారణలో రైతుల వాదన పూర్తి స్థాయిలో వింటామని ధర్మానసం తెలిపింది. నిర్మాణాలపై కాలపరిమితి విధిస్తూ ఇచ్చిన అంశాలపై స్టే ఇచ్చింది.