By: ABP Desam | Updated at : 26 May 2023 06:13 AM (IST)
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
Avinash Case : వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు నేటికి(శుక్రవారానికి )వాయిదా వేసింది. ఉదయం నుంచి ఇతర కేసుల విచారణలో వేకెషన్ బెంచ్ బిజీగా ఉంది. అవినాష్ రెడ్డి పిటిషన్ 70 వ నెంబర్ తర్వాత రిజిస్టర్ కావడంతో.. సాయంత్రం వరకూ విచారణకు రాలేదు. విచారణకు వచ్చిన తర్వాత వాదనలకు ఎంత సమయం పడుతుందని ఇరు వర్గాల న్యాయవాదుల్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. తమకు గంట సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. దీంతో శుక్రవారం ఉదయం పదిన్నరకు వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. వాయిదా వేసింది.
హైకోర్టు వెకేషన్ బెంచ్ నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు
అవినాష్ రెడ్డి ముంందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ ధర్మాసనం విచారణ జరిపి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేయాలని రెండు రోజుల కిందట ఆదేశించింది. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవినాష్ రెడ్డి తన పిటిషన్‌లో ముందస్తు బెయిల్‌పై హైకోర్టు విచారణ జరిపే వరకు కస్టడీ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. లేదంటే, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపి పరిష్కరించే వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు.
వారం రోజులుగా నాటకీయ పరిణామాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లో వారం రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 19న విచారణకు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఎంపీ విచారణకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో ఎంపీ తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో హుటాహుటిన హైదరాబాద్ నుంచి పులివెందుల బయల్దేరి వెళ్లారు. అవినాష్ రెడ్డి తల్లిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేయగా.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రికి తరలించారు. అవినాష్ రెడ్డి కూడా అక్కడే ఉండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.. ఈ నెల 21న విచారణకు రావాలని పేర్కొంది. కానీ తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారని.. తాను బాగోగులన్నీ చూసుకోవాలని సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. తనకు మరో వారం పాటూ గడువు ఇవ్వాలని కోరారు. సీబీఐ ఈ లేఖపై ఎలాంటి సమధానం ఇవ్వలేదు. కానీ అవినాష్ రెడ్డి మాత్రం న్యాయపరంగా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.
అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి మెరుగైందన్న వైద్యులు
కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిలో పురోగతి ఉందని వైద్యులు తెలిపారు. వాంతులు తగ్గాయని .. ఐసీయూ నుంచి సాధారణ గదికి తరలించడానికి ప్లాన్ చేస్తున్నామని హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. ఆరు రోజుల నుంచి అవినాష్ రెడ్డి తల్లి విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు.
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా
Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!
Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బడకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి
CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!
లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!