AP Farmers : ఏపీ రైతులపైనే దేశంలోకెల్లా అత్యధిక రుణభారం - సీఎం జగన్ గాలికొదిలేశారని బీజేపీ ఆగ్రహం !
ఏపీలో రైతుల పరిస్థితి దిగజారిపోతూంటే జగన్ మాత్రం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ మండి పడింది.
AP Farmers : ఆంధ్రప్రదేశ్ రైతులు అప్పుల ఊబీలో ఉన్నారు. రాష్ట్ర రైతాంగంపై దేశంలోనే అత్యధిక రుణభారం ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం వెలువరించిన వ్యయసాయ కుటుంబాలు, భూమి స్థితి మదింపు నివేదిక 9 ప్రకారం.. దేశంలోనే అత్యధికంగా ఏపీలో ఒక్కో రైతు కుటుంబంపై సగటున రూ.2,45,554 రుణభారం ఉందని తెలిపింది. ఆ తర్వాత రూ.2,42,482 అప్పుతో కేరళ రెండో స్థానంలో ఉంది. రూ.2,03,249 అప్పుతో పంజాబ్ మూడో స్థానంలో ఉంది. తెలంగాణలో ఒక్కో రైతు కుటుంబంపై రూ.1,52,113 అప్పు ఉంది. రైతు కుటుంబాల అప్పుల్లో జాతీయ సగటు రూ.74,121గా ఉంది. ఈ వివరాలను పార్లమెంట్‌లో కేంద్రం తెలిపింది.
Andhra Pradesh is receiving highest GST collections and still the average amount of outstanding loan per agricultural household is so high!
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) February 14, 2023
The conditions of farmers have become pathetic & @AndhraPradeshCM is completely busy in appeasement politics & corruption.
Shameful! pic.twitter.com/ZkxBcaE0cG
ఏపీ రైతులకు ఈ దుస్థితి రావడానికి ఏపీ ప్రభుత్వమే కారణమని.. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అత్యధిక జీఎస్టీ వసూళ్లు సాధిస్తున్నప్పటికీ.. రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోవడానికి ఏపీ ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూంటే.. సీఎం జగన్ మాత్రం అవినీతి, ఓటు బ్యాంక్ రాజకీయాల్లో బీజీగా ఉన్నారురు.
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన 'సిచ్యుయేషన్ అసెస్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ హౌస్‌హోల్డ్స్ అండ్ ల్యాండ్ అండ్ లైవ్‌స్టాక్ హోల్డింగ్స్ ఆఫ్ హౌస్‌హోల్డ్స్ ఇన్ రూరల్ ఇండియా 2019' నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. హరియాణా, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడుల్లోని రైతు కుటుంబాలపై రూ.1లక్షకుపైగా రుణభారం ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని రైతులపై సగటు భారం రూ.లక్షలోపే నమోదైంది. ఇది దేశంలో ఒక్కో రైతు కుటుంబం మోస్తున్న రుణ భారంకంటే 231% అధికం.
కేంద్రం గణాంకాలపై ఏపీలో రాజకీయ దుమారం ప్రారంభమయింది. రైతు భరోసా పేరుతో పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేస్తున్నామని రైతులంతా సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ పరిస్థితి వేరుగా ఉందని.. ఇలాంటి నివేదికల ద్వారా వెల్లవుతున్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. ఓ వైపు కేంద్రం పూర్తి స్థాయిలో రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా ప్రయత్నాలు చేస్తూంటే.. రాష్ట్రంలో మాత్రం కేవలం ఓటు బ్యాంక్ పథకాలు మాత్రమే అమలు చేస్తూ రైతుల్ని గాలికి వదిలేశారని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాల కారణంగానే రైతులు ఇంత తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయారని అంటున్నారు.