News
News
X

Ayyanna Bail : అయ్యన్న కేసు డైరీ సమర్పించండి - సీఐడీకి ఏపీ హైకోర్టు ఆదేశం !

అయ్యన్న పాత్రుడు కేసు డైరీ సమర్పించాలని సీఐడీని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అది పరిశీలించిన తర్వాత బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు.

FOLLOW US: 

Ayyanna Bail :  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తెల్లవారుజామున సీఐడీ అధికారులు ఆయనను ఇంట్లో అరెస్ట్ చేశారు. అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు చింతకాయల రాజేష్‌ను కూడా అరెస్ట్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేశారని.. నిబంధనలు పాటించలేదని అయ్యన్న తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణకు హైకోర్టు అంగీకరించింది.  అయ్యన్నపాత్రుడుని ఉద్దేసపూర్వకంగా జైల్లో పెట్టాలని అరెస్ట్ చేసినందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని యాయన తరపు న్యాయవాదులు కోరారు. అయితే కేసు డైరీని చూసి నిర్ణయం తీసుకుంటామని.. కేసు డైరీని సమర్పించాలని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఉదయం పదిన్నరకల్లా కేసు డైరీ సమర్పించాలని న్యాయమూర్తి సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు. 

అయ్యన్న ఆయన కుమారులపై ఫోర్జరీ కేసు !

ఎన్‌వోసీ ఫోర్జరీ చేశారనే అభియోగాలతో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును అరెస్ట్‌ చేసినట్లు సీఐడీ  ప్రకటించింది.  తమది కాని 2 సెంట్ల భూమిని అయ్యన్నపాత్రుడు ఆక్రమించారని తెలిపారు. ఈ కేసులో అయ్యన్నను A1 గా, ఆయన కుమారులు విజయ్‌ A2, రాజేశ్‌ A3 గా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని తెలిపింది. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్నారు. ఫోర్జరీ చేయడం మామూలు విషయం కాదన్నారు.  ఐపీసీ 464, 467, 471, 474, రెడ్‌ విత్‌ 120-B, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు  ప్రకటించారు. అయ్యన్న పాత్రుడుకు రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి ఆధారాలు  తారుమారు చేస్తారు అని ... తెల్లవారు జామున 4 గంటలకు అరెస్ట్ చేశామని సీఐడీ తెలిపింది.  అయ్యన్నపాత్రుడు పై ఫిర్యాదు చేసిన వ్యక్తి మాములు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సీఐడీకి ఫిర్యాదు చేశాడు కాబట్టి మేం అరెస్ట్ చేశామని తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు

News Reels

అయ్యన్న అరెస్ట్‌తో టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.  డీజీపీ కార్యాలయం వద్ద భద్రత పెంచారు. అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌ నేపథ్యంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీస్‌కు వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వస్తారనే అనుమానంతో డీజీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.అయ్యన్న అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయ్యన్న ఫ్యామిలీని టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఆయన కుటుంబాన్ని కొంతకాలం నుంచి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. దౌర్జన్యంగా అర్ధరాత్రి సమయంలో ఇంటి గోడ దూకి అరెస్టు చేశారని దుయ్యబట్టారు. ఆయ్యన్నపై ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారని ఆరోపించారు. 

వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరు పరచనున్న సీఐడీ 

ఏలూరు కోర్టులో హాజరు పరుస్తామని సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ మేరకు విశాఖలోని సింహాచలం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రికి ఆయనను సీఐడీ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. బెయిల్ ఇవ్వనందున.. కోర్టు రిమాండ్‌కు పంపిస్తే.. ఆయనను జైలుకు తరలిస్తారు.,  ఇప్పుడు సీఐడీ కోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 

Published at : 03 Nov 2022 05:16 PM (IST) Tags: Ayyanna character arrested Ayyanna case Ayyanna case diary AP CID arrests

సంబంధిత కథనాలు

బైక్‌పై వేగంగా వెళ్లాడని వ్యక్తి దారుణహత్య, 12 ఏళ్ల తరువాత 7 మందికి యావజ్జీవ కారాగార శిక్ష

బైక్‌పై వేగంగా వెళ్లాడని వ్యక్తి దారుణహత్య, 12 ఏళ్ల తరువాత 7 మందికి యావజ్జీవ కారాగార శిక్ష

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

Breaking News Live Telugu Updates: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో కల్వకుంట్ల కవిత పేరు

Breaking News Live Telugu Updates: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో కల్వకుంట్ల కవిత పేరు

Tirupati: తగ్గేదేలే, ఛేజ్ చేసి ఎర్రచందనం కూలీలను పట్టుకున్న పోలీసులు - సినిమా సీన్ తరహాలో !

Tirupati: తగ్గేదేలే, ఛేజ్ చేసి ఎర్రచందనం కూలీలను పట్టుకున్న పోలీసులు - సినిమా సీన్ తరహాలో !

టాప్ స్టోరీస్

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

అదిరిపోయే సాంగ్‌తో మురిపిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ బ్యూటీ మౌని రాయ్

అదిరిపోయే సాంగ్‌తో మురిపిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ బ్యూటీ మౌని రాయ్