అన్వేషించండి

TDP Election Campaign : టీడీపీ 100 రోజుల ప్రచార ప్రణాళిక - ముఖ్యనేతలంతా ప్రజల్లోనే ! ఇదే షెడ్యూల్

TDP : తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. వచ్చే వంద రోజు పాటు టీడీపీలోని అన్ని విభాగాలు ప్రచారంలో పాల్గొంటాయి.

Telugu Desam Party has started its election campaign :  తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది.  "రా... కదలిరా’ పిలుపుతో 5 నుంచి జనంలోకి చంద్రబాబు వెళ్లనున్నారు. 5 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22 పార్లమెంట్ల పరిధిలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.   టీడీపీ-జనసేన సంయక్తంగా నిర్వహించే ఈ సభలకు చంద్రబాబుతో పాటు  జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరవుతారు. టీడీపీ జనవరి నెల ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.  బుధవారం 3వ తేదీన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం సమీపంలోని కన్వెన్సన్ సెంటర్లో రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం సమావేశం నిర్వహించబోతున్నారు.   4వ తేదీన పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు చేతులమీదుగా ‘జయహో బీసీ’ ప్రారంభం అవుతుంది.  బీసీల్ని ఈ ప్రభుత్వం, జగన్ రెడ్డి ఎంత దారుణంగా వంచించారో, ఎంతగా వారిపై దమనకాండ సాగిస్తున్నారో ప్రతి బీసీ కుటుంబానికి తెలియచేసి బలహీనవర్గాల్లో చైతన్యమే లక్ష్యంగా టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తోంది.  టీ.ఎన్.టీ.యూ.సీ విభాగం ఆధ్వర్యంలోకార్మికుల్లో చైతన్యం తీసుకురావడమే ధ్యేయంగా త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేయనున్నారు.   

పంచాయతీ రాజ్ వర్క్ షాప్
 
56 నెలల నుంచీ విధ్వంసకర పాలన సాగిస్తున్న జగన్ రెడ్డి అవినీతిపరు లు, అసమర్థులు, నేరస్తుల్ని పెంచి పోషిస్తున్నాడని, వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా విధ్వంసాలు, విద్వేషాలు, వైఫల్యాలు తప్ప, భూతద్దంలో వెతికినా కూడా ఎక్కడా ఒక మంచిపని కానీ, విజయం కానీ కనిపించవని,  భస్మాసురుడి లా జగన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్నే విధ్వంసం చేశాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజ రాపు అచ్చెన్నాయుడు  ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రజా చైతన్యమే లక్ష్యంగా రాబోయే 100 రోజుల్లో నిర్విరామంగా టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తారు.  100రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి. చివరిదశకు చేరిన జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు ముగింపు పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 100రోజుల్లో ఈ ప్రభుత్వం, జగన్ రెడ్డి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకురావడానికి  టీడీపీ నిర్విరామంగా కార్యక్రమాలు చేపట్టనుంది.  టీడీపీ చేపట్టబోయే కార్యక్రమాల్లో ముందుగా  మంగళగిరి లోని  పార్టీ జాతీయ కార్యాలయం సమీపంలోని కన్వెన్షన్ సెంటర్లో పంచాయతీ రాజ్ వర్క్ షాపు నిర్వహించబోతున్నా. రాష్ట్రంలోని అన్ని గ్రామాల పంచాయతీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఆహ్వానం పంపించాం. వారందరి సమక్షంలో ఈ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను ఏవిధంగా నిర్వీర్యం చేసిందో, జగన్ రెడ్డి ఏ విధంగా పల్లెల్ని నాశనంచేస్తాడో తెలియచేస్తాం. తాము చెప్పే అంశాలను స్థానిక ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజలకు తెలియచే స్తే, ఈ ప్రభుత్వానికి కాలం చెల్లినట్టే. అలానే టీడీపీ ప్రభుత్వ రాగానే పంచాయతీల బలోపేతానికి, పునర్వైభవానికి ఎలాంటి చర్యలు తీసుకుంటామో, ఏ విధమైన కార్యాచరణ అమలుచేస్తామో  కూడా ఈ వర్క్ షాపులో తెలియచేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. 

 జయహో బీసీ వర్క్ షాప్

 జగన్ రెడ్డి  తన పాలనలో బీసీ లను దారుణంగా వంచించాడని అచ్చెన్నాయుడు ఆరోపించారు.  వారిపై తప్పుడు కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేయించాడు. తన దుర్మార్గాలు ప్రశ్నించిన బీసీలను దారుణంగా చంపించా డు. 4 సంవత్సరాల 7 నెలలుగా ఈ ముఖ్యమంత్రి బీసీలపై దమనకాండ సాగిస్తున్నాడు. బీసీలుగా పుట్టడమే తప్పు అన్నట్టు వారిపై తన పైశాచికత్వం ప్రదర్శిస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు 10శాతం కోత పెట్టాడు. 16వేలకు పైగా పదవుల్ని బీసీలకు దక్కకుండా చేశాడు. ఉత్తుత్తి కార్పొ రేషన్లు పెట్టి బీసీలను ఉద్ధరిస్తున్నట్టు కల్లబొల్లి మాటలు చెబుతున్నాడని మండిపడ్డారు.  బీసీ మంత్రుల్ని ఉత్సవవిగ్రహాల కంటే దారుణంగా తయారుచేశాడు.  ఇవన్నీ అందరికీ అర్థమయ్యేలా తెలియచేయడానికి టీడీపీ ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని 4వ తేదీన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రారంభించబోతున్నారు. 4వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో కార్యక్రమం జరుగుతుంది. అలానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి బీసీ ఇంటి తలుపు తట్టేలా ‘జయహో బీసీ’ దిగ్విజయంగా కొనసాగు తుందని తెలిపారు. 

5వ తేదీ నుంచి ప్రజల్లోకి చంద్రబాబు  

5వ తేదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా ఆయన పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. దానిలో భాగంగా 5వ తేదీన ‘రా..కదలిరా’ పేరుతో కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనున్నా రు. 5వ తేదీన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి సభ జరగనుంది.  5వ తేదీ నుంచి 29వ తేదీవరకు 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం. రోజుకి 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ప్రతిసభకు లక్షలాది ప్రజలు తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఏపీ ఒక నూతన నవోదయం చూసేందుకు టీడీపీ-జనసేన పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి. రెండుపార్టీల కలయి కను, అవి నిర్వహించే కార్యక్రమాలను ప్రజలు అమితంగా ఆదరిస్తున్నారని అచ్చెన్నాయుడు తెలిాపుర. 
 
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభల వివరాలు... 

 5వ తేదీన : ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో..
 6వ తేదీన : విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఆచంట.
 9వ తేదీన : తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆళ్లగడ్డ.
  10వ తేదీన : విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో, కాకినాడ పార్లమెంట్ పరిధిలోని తుని. 
 18వ తేదీన : తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వర్థంతిని మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గుడివాడ లో భారీస్థాయిలో సభ నిర్వహించనున్నాం
   19వ తేదీన : చిత్తూరు పార్లెమంట్ పరిధిలోని జీడీ నెల్లూరు,  కడప పార్లమెంట్ పరిధిలోని కమలాపురం
  20వ తేదీన : అరకు పార్లమెంట్ పరిధిలోని అరకులో,  అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మండపేట.
 24న : రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఉవరకొండ.
25న : నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కొవ్వూరు, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని పత్తికొండ అసెంబ్లీలో.
27న : రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని గోపాలపురం, గుంటూరు పార్లమెంట్ లోని పొన్నూరు అసెంబ్లీలో.
28న : అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని మాడుగుల, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని టెక్కలిలో..
29 వ తేదీన : ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఉంగుటూరు, బాపట్ల పార్లమెంట్ చీరాల నియోజకవర్గంలో  భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం. టీడీపీ – జనసేన కలిసే సభల్ని నిర్వహిస్తున్నాయి. చంద్రబాబుతో పాటు, పవన్ కల్యాణ్ కూడా కొన్ని సభలకు హాజరవుతారు.  

టీడీపీలో చేరికలకు సంబంధించి రెండు కమిటీలు 

తెలుగుదేశంలో  చేరడానికి చాలామంది అధికారపార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు. కానీ తామే ఆచితూచి వ్యవహరిస్తున్నాం. పార్టీలో చేరికలకు సంబంధించి రెండు కమిటీలు వేశాం. కమిటీల అభిప్రాయాలు, అధినాయకుడి నిర్ణయమే అంతిమం. పార్టీ నేతలతో సంప్రదించాకే కొత్తవారి చేరికపై స్పష్టమైన నిర్ణయానికి వస్తాం. ఒక వారంలో తెలుగుదేశంలో చేరేఇతర పార్టీలనేతలపై ఒక స్పష్టత వస్తుంది.   సొంత పార్టీ నాయకులకే ఈ ముఖ్య మంత్రిపై విశ్వాసం లేదు. ఈ రోజో, రేపో తనపార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నానన్నాడు.. మరలా పిల్లిలా వెనకడుగు వేశాడని ఎద్దేవా చేశారు. 

టీ.ఎన్.టీ.యూ.సీ  బస్సుయాత్ర 

టీ.ఎన్.టీ.యూ.సీ విభాగం తర్వలోనే బస్సుయాత్ర చేపట్టనుంది. దానికి సంబంధించిన పోస్టర్ ను ఇప్పుడు ఆవిష్కరిస్తున్నాం. టీ.ఎన్.టీ.యూ.సీ నేతలు అన్నిరంగాల కార్మికులతో మాట్లాడి, టీడీపీ ప్రభుత్వంలో కార్మికులకు జరిగిన మేలు..ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చేసిన మోసాల్ని వివరిస్తారు.” అని అచ్చెన్నాయుడు తెలిపారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget