అన్వేషించండి

Jagan Cases : జగన్‌కు భారీ షాక్ - కేసుల రోజువారీ విచారణకు హైకోర్టు ఆదేశం

Jagan : జగన్ కేసులను రోజువారీ విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హరిరామ జోగయ్య వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ నిర్ణయం ప్రకటించింది.

Jagan Cases Hearng :  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయనపై నమోదైన సీబీఐ, ఈడీ కేసుల విచారణలను రోజువారీగా చెపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను రోజువారీ విచారణ చేపట్టి తేల్చేసేలా హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలంటూ హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిల్ దాఖలు చేశారు.. సీబీఐ, ఈడీ కేసులు లేని నేతను ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని.. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసుల్లో నిందితుడైన జగన్‌ వరుస పిటిషన్లు వేసి విచారణలో జాప్యం చేస్తున్నారన్నారు. ఈ పిటిషన్ ను ఎన్నికలకు  ముందే దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. జగన్ కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. 

సుప్రీంకోర్టులో రఘురామ కూడా మరో పిటిషన్           

జగన్ కేసుల విచారణ వేగంగా సాగడం లేదని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో   విచారణ జరిగింది. ఎందుకు ఆలస్యమవుతోందని సుప్రీంకోర్టు సీబీఐని ప్రశ్నించింది. నిందితులు  వరుసగా వివిధ రకాల పిటిషన్లు వేయడం వల్లనే ఆలస్యం అవుతుందని సీబీఐ తెలిపింది. లోయర్ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని సీబీఐ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.  ఇంతకాలం నుంచి ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అన్నా పరిష్కరించారా అని  సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పట్లో ప్రశ్నించింది. 

అక్రమాస్తుల కేసుల్లో మొత్తం ఈడీ, సీబీఐ ఇరవై చార్జిషీట్‌లు దాఖలు         

 జగన్‌ క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఈడీలు మొత్తం 20 చార్జిషీట్‌లు దాఖలు చేశాయి. ఈ కేసులపై సీబీఐ కోర్టులో గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఆయా చార్జిషీట్ల నుంచి తమను తప్పించాలని కోరుతూ జగన్‌, విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులు దాఖలు చేసిన 130 డిశ్చార్జి పిటిషన్‌లపై తీర్పు వెల్లడి కాలేదు. తీర్పు చెప్పాల్సిన రోజున జడ్జి బదిలీ అయ్యారు.  ఈ కారణంగా మళ్లీ మొదటి నుంచి కేసులను తాజా సీబీఐ కోర్టు జడ్జి వింటున్నారు. 

మళ్లీ మొదటి నుంచి డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వింటున్న కొత్త జడ్జి                    

తీర్పు వెలువరించాల్సిన సమయంలో బదిలీ కావడంతో ఆయన కేసులను తిరిగి ప్రారంభిస్తున్నట్టు  ప్రకటించారు. కొత్త జడ్జి మళ్లీ ఈ కేసులను మొదటి నుంచి వినాల్సిన అవసరం ఏర్పడింది. కేవలం డిశ్చారి పిటిషన్‌లకే దశాబ్దకాలం పడితే.. ప్రధాన కేసులు ఎప్పుడు విచారణకు వస్తాయి? ఎప్పుడు శిక్షలు పడతాయి? అన్న  అనుమానాలు పిటిషనర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించడంతో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ వేగంగా సాగే అవకాశం ఉంది. ఆ తర్వాత చార్జిషీట్లపై ట్రయల్ ప్రారంభమవుతుందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Deepam 2 Scheme: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
Pawan Kalyan Names New Plant: తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి - క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్‌గా పేరు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి - క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్‌గా పేరు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
TDP SC Cell Leader Wife Assault Complaint:ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget