అన్వేషించండి

Breaking News Live Updates: డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాన్ని జప్తు చేయవద్దు : తెలంగాణ హైకోర్టు 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా నవంబరు 5న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

LIVE

Key Events
Breaking News Live Updates: డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాన్ని జప్తు చేయవద్దు : తెలంగాణ హైకోర్టు 

Background

హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున బాణాసంచా పేలుడు సంభవించింది. చత్రినాక సమీపంలోని కందికల్ గేటు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మరొక ఇద్దరికి గాయాలయ్యాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారు చేసే పరిశ్రమలో ఈ పేలుడు సంభవించింది. అందులో బాణా సంచాకు నిప్పు అంటుకోవడం వల్ల పెలుడు సంభవించి అగ్ని ప్రమాదానికి దారి తీసినట్లుగా భావిస్తున్నారు. చనిపోయిన వారిని పశ్చిమ బంగాల్‌కు చెందిన విష్ణు అనే 25 ఏళ్ల వ్యక్తి, జగన్నాథ్ అనే 30 ఏళ్ల వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరు గురించి ఆరా తీశారు. క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాణా సంచాకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీలో వాడే రసాయనాలు కలవడం వల్ల పేలుడు తీవ్రత మరింత పెరిగిందని పోలీసులు చెప్పారు.

మరోవైపు, దీపావళి సంబరాల సందర్భంగా టపాకాయలు కాల్చుతూ నగరంలో దాదాపు 20 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. గాయపడ్డ బాధితులు మెహదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రితో పాటు పలు ఆస్పత్రుల్లో చేరారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

ఎన్‌హెచ్-44పై ప్రమాదం
హైదరాబాద్ శివారులో బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు ఢీకొంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉన్నట్టుండి బ్రేక్ వేయడంతో శాంత్రో కారు బస్సును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న డాక్టర్‌కు తీవ్రగాయాలయ్యాయి. కాగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారంతా షాద్‌ నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

గోల్నాకలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌‌లో గోల్నాకలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఫలితంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్‌ సహయంతో మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: Nellore: నెల్లూరులో టపాసుల విక్రయాలు అంతంతమాత్రమే.. వ్యాపారులు లబోదిబో, కారణం ఏంటంటే..

Also Read: AP Corona Update: ఆంధ్రప్రదేశ్ లో 301 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

22:43 PM (IST)  •  05 Nov 2021

డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాన్ని జప్తు చేయవద్దు : తెలంగాణ హైకోర్టు 

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో వాహనాలు జప్తుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వాహనాలు జప్తు చేసే అధికారం పోలీసులకు లేదని తెలిపింది. మద్యం తాగిన వ్యక్తి బండి నడిపితే బంధువులను పిలిచి వాహనం అప్పగించాలని తెలిపింది. ఎవరు రాకపోతే పీఎస్ కు తరలించి తర్వాత అప్పగించాలని ఆదేశించింది. ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చిరించింది. 
 

22:04 PM (IST)  •  05 Nov 2021

వైద్యుల నిర్లక్ష్యం... నిండు ప్రాణం బలి...!

హనుమకొండలో వైద్యుల నిర్లక్ష్యానికి బాలుడు మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలుడు మృతి చెందాడు. నిన్న సాయంత్రం ఆడుకుంటూ కిందపడిపోయిన జునైద్ పాషా(8) శుక్రవారం చనిపోయాడు.  డాక్టర్ల నిర్లక్ష్యం వలనే బాబు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నామని డబ్బులు కట్టించుకొని, చివరికి మరణించాడని డాక్టర్లు చెప్తున్నారని కుటుంబసభ్యుల ఆవేదన చెందుతున్నారు. హాస్పిటల్ ముందు బాలుడి తల్లిదండ్రులు, బంధువులు  ఆందోళనకు దిగారు. 

21:22 PM (IST)  •  05 Nov 2021

దంతేవాడలో ఎన్ కౌంటర్.. నక్సలైట్ మృతి

చత్తీస్ గడ్ దంతేవాడలో పోలీసులు, ఇంద్రావతి ఏరియా కమిటీ నక్సలైట్ల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ లో ఒక నక్సలైట్ మృతి చెందాడు. గీదమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో DRG జవాన్లు, నక్సలైట్ల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన నక్సల్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన నక్సలైట్ రామ్సుగా గుర్తించారు. అతనిపై 5 లక్షల రివార్డ్  ఉన్నట్టు గుర్తించారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో 7.62 ఎంఎం పిస్టల్, 5 కిలోల ఐఈడీ, వైర్, రోజువారీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
 

20:02 PM (IST)  •  05 Nov 2021

సదర్ ఉత్సవాల్లో అపశ్రుతి... జనాన్ని హడలెత్తించిన దున్నపోతు

హైదరాబాద్ సదర్ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ దున్నపోతు హల్‌చల్‌ చేసింది. రోడ్డు మీదకు వచ్చి కనిపించిన వారిపై దాడి చేసింది. ఖైరతాబాద్‌ చింతల్‌బస్తీలో రోడ్డు మీదకు వచ్చిన దున్నపోతు బీభత్సం సృష్టించింది. ఎదురుగా కనిపించిన వారి మీద దాడి చేసింది. దున్నపోతును కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. దున్నపోతు స్కూటీతో పాటు ఓ మహిళను ఈడ్చుకెళ్లింది. దున్నపోతు దాడిలో మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. చివరకు కొందరు యువకులు ఖైరతాబాద్‌ చౌరస్తాలో దున్నపోతును పట్టుకోగలిగారు. 

19:08 PM (IST)  •  05 Nov 2021

ఉద్యోగం దొరకడంలేదని యాసిడ్ తాగి యువకుడు ఆత్మహత్య.!

తెలంగాణ రంగారెడ్డి నార్సింగ్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. నార్సింగ్ పీఎస్ పరిధి పుప్పాల్ గూడలో యువకుడు యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం దొరకడంలేదన్న ఒత్తిడితో మహ్మద్ అజాజ్ అనే యువకుడు యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మహమ్మద్ అజాజ్ హుమాయూన్ నగర్ కు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

18:50 PM (IST)  •  05 Nov 2021

తిరుపతిలో బైక్ లపైకి దూసుకెళ్లిన కొత్త కారు 

 

తిరుపతి లీలామహల్‌ సర్కిల్‌లో కారు ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. పార్క్‌ చేసి ఉన్న బైక్ లను ఢీకొట్టింది. శుక్రవారం కొత్త కారు కొని షోరూం నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా టైరు పేలి ఈ ప్రమాదం జరిగింది. పార్క్‌ చేసి ఉన్న టూవీలర్స్‌పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. 
 

17:52 PM (IST)  •  05 Nov 2021

ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్... 14 మంది విద్యార్థులకు అస్వస్థత

అనంతపురం జిల్లా యాడికి మండలం తిప్పారెడ్డి పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి 14 మంది విద్యార్తులకు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురై విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఉపాధ్యాయులు తల్లితండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థులను తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. 7 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

17:26 PM (IST)  •  05 Nov 2021

డిగ్రీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో రేపట్నుంచి ఈనెల 20 వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 24న ప్రత్యేక విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరగనుంది. ఇప్పటివరకు మూడు విడతల్లో 1,97,722 డిగ్రీ సీట్ల భర్తీ చేశారు. మిగిలిన 2,19,693 సీట్ల భర్తీకి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. 
 

14:55 PM (IST)  •  05 Nov 2021

బట్టల షోరూంలో పోకిరీలు.. ట్రయల్ రూంలో వీడియో రికార్డు?

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని హెచ్ అండ్ ఎం షోరూంలో పోకిరీలో రెచ్చిపోయారు. ఏకంగా షోరూంలోని ట్రయల్స్ రూంలో కెమెరాలు పెట్టి ఇద్దరు యువకులు రికార్డు చేస్తున్న విషయాన్ని ఇద్దరు యువతులు గుర్తించారు. వారు వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆ ఇద్దరు యువకులు సహా షోరూం మేనేజర్‌ను అరెస్టు చేశారు.

10:00 AM (IST)  •  05 Nov 2021

శివనామస్మరణతో మార్మోగిన కొవ్వూరు గోష్పాద క్షేత్రం

కార్తీక మాసం మొదటి రోజు కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పవిత్ర గోష్పాద క్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి భక్తులు పోటేత్తుతున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Loksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABPVishakhapatnam TDP MP Candidate  Bharat Interview | బాలయ్య లేకపోతే భరత్ కు టికెట్ వచ్చేదా..? |Vivacious Varenya Life Story | 9 ఏళ్లకే ఇంగ్లీష్ లో అదరగొడుతున్న ఈ అమ్మాయి గురించి తెలుసా..!  | ABPHanuman Deeksha Incident in Mancherial |మిషనరీ స్కూల్ పై హిందూ సంఘాల ఆగ్రహం.. ఇలా చేయడం కరెక్టేనా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
Tata Curvv EV Launch: టాటా కర్వ్ ఈవీ లాంచ్ త్వరలో - కారు ఎలా ఉండవచ్చు?
టాటా కర్వ్ ఈవీ లాంచ్ త్వరలో - కారు ఎలా ఉండవచ్చు?
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Embed widget