TDP Selfie Challenge: మీరు 11 లక్షల ఇళ్లు కడితే నేను రాష్ట్రం వదిలేసి వెళ్లిపోతాను - టీడీపీకి ఎంపీ భరత్ సవాల్
TDP Selfie Challenge: నిజంగా చంద్రబాబు.. టీడీపీ హయాంలో 11 లక్షల ఇళ్లు కడితే తాను రాష్ట్రం వదిలేసి వెళ్లిపోతానని ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు.
TDP Selfie Challenge: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పాలించి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలంటూ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కుమార్ అన్నారు. అలాగే మంత్రి, ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. సెల్ఫీ ఛాలెంజ్ చేయడం దారుణం అన్నారు. టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగి.. వాటిని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి ఛాలెంజ్ విసరడం ఏంటని ప్రశ్నించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని ఇళ్లు కట్టారో, తాను ఎన్ని కట్టానో చూసుకుందామంటూ మాట్లాడడం సరికాదన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు 11 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చిందని అన్నారు. నిజంగా వాళ్ల అన్ని లక్షల ఇళ్ల కడితే నేను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానంటూ ఎంపీ మార్గాని భరత్ రామ్ సవాల్ విసిరారు.
అయినా టిడ్కో ఇళ్లు అంటే.. లోన్ ఇచ్చి ఇళ్ల కట్టడం అని అది ప్రజలంతా గమనించాలని సూచించారు. కానీ సీఎం జగన్ ఇస్తున్న ఇళ్లు పూర్తిగా ఉచితం అని వివరించారు. జగనన్న కాలనీల ద్వారా 300 చదరపు అడుగుల స్థలంతో పూర్తిగా ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర గందరగోళం పాదయాత్ర అంటూ విమర్శించారు. సాక్ష్యాత్తు శ్రీ మహా విష్ణువు పేరు పెట్టకున్న జగన్ మోహన్ రెడ్డి... దొంగ మోహన్ రెడ్డి అని పిలుస్తూ... హిందువులను అవమానిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ఇలాంటి పిచ్చి చేష్టలు మానకోమని సూచించారు. అలాగే సెల్ఫీ ఛాలెంజ్ ను తాను స్వీకరిస్తానని.. తాను ఏం చేశానో అక్కడికి వెళ్లి సెల్ఫీ దిగి పెడతానని చెప్పారు. దమ్ముంటే తండ్రీకొడుకులిద్దరూ తాను ఉండే ప్రాంతంలో చేసిన అభివృద్ధిపై ఫొటోలు పెట్టాలని అన్నారు.