Vangalapudi Anitha: "అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి రాష్ట్రంగా మార్చింది జగన్: అనిత
Vangalapudi Anitha: టీడీపీ పాలనలో రాష్ట్రం అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉండగా.. వైసీపీ పాలనలో గంజాయి ఏపీగా మారిందంటూ వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు.
Vangalapudi Anitha: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రి అని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. సోమవారం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణగా పిలిచేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు గంజాయి ఆంధ్రప్రదేశ్ గా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ సీట్ లో కూర్చున్నప్పటి నుంచి ఏపీని గంజాయి, హత్య, అత్యాచార రాష్ట్రంగా చెప్పుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. 2019కు ముందు గంజాయి అక్రమంగా తరలించిన నిందితులను మీడియా ముందు చూపించేవారని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అలాగే ఆర్ధిక సంవత్సరంలో 2. 6 లక్షల కేజీల పట్టుకున్నరంటే... గంజాయి ఎంత విచ్చల విడిగా రవాణా జరుగుతుందో అర్థం అవుతుందన్నారు. గంజాయి సాగును వైసీపీ రాష్ట్ర పంటగా ప్రకటించారని అనుమానం వస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారు..!
స్కూల్, కాలేజ్ చదువుతున్న అమ్మాయిల చేతుల్లో గంజాయి దొరుకుతుందని చెప్పారు. చివరికి పవిత్రమైన తిరుమలలో కూడా గంజాయి దొరుకుతున్న దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఉందని ఆమె ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకుల మద్దతుతో వచ్చిన టీటీడీ ఉద్యోగులు మద్యం తాగుతూ దొరికారన్నారు. రాష్ట్రాన్ని మద్యంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి సీఎం జగన్ ఒక్క ఛాన్స్ అడిగారా అంటూ కామెంట్లు చేశారు. క్రిమినల్ రికార్డుల్లో నేరాల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా ఉందన్నారు. పవిత్రమైన తిరుపతిలో కూడా గంజాయి, మద్యం దొరుకుతుందనే జగన్ ను ఏం చేయాలో మీరే చెప్పండంటూ ఫైర్ అయ్యారు. గంజాయి మత్తులో యువత హత్యలకు పాల్పడుతున్నారని చెప్తుంటే.. కనీసం రివ్యూ కూడా నిర్వహించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. మద్యం షాపు ఎల్లో ఇంటర్, డిగ్రీ చదువుకున్నవారు యువత ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. జాబ్ క్యాలెండర్ లో యువతకు ఉద్యోగాలు అని చెప్తుంటే సిగ్గు వేయడం లేదా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
జోకర్ మంత్రి ఉండవల్లి శ్రీదేవి, ఊసరవెల్లి శ్రీదేవి అంటున్నారు..!
మధ్య నిషేదం అని చెప్పి ఇప్పుడు మద్యం నుంచి వచ్చిన సొమ్ములతోనే ప్రభుత్వం నడుపుతున్నామని చెప్పడానికి సిగ్గు లేదా అన్నారు. ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడితే.. తమపై పేటిఎం కుక్కలను పంపిస్తారని వంగలపూడి అనిత అని ఆరోపించారు. తమ దగ్గర నుంచి నలుగురు ఎమ్మెల్యేలను లాక్కున్నారని.. ఇప్పుడు అదే వైసీపీ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలతో ఒక ఎమ్మెల్సీని గెలిచామన్నారు. ఇది దేవుని స్క్రిప్టు అని అన్నారు. ఉండవల్లి శ్రీదేవి... ఊసరవెల్లి శ్రీదేవి అని జోకర్ మంత్రి అంటున్నారని ఫైర్ అయ్యారు. మీకన్నా పెద్ద నటులు ఎవరు లేరని అన్నారు. పేకాట క్లబ్బులు నడిపిన రాపాక 10 కోట్ల కోసం మాట్లాడుతున్నారని.. నీకు 10 వేలు ఇస్తే చాలని చెప్పుకొచ్చారు. జబర్దస్త్ మేడం.. ఇటివల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో పులివెందుల నియోజక వర్గంలో టీడీపీ, వైసీపీకి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో చూస్కో అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన వైసీపీ... రఘురామరాజును ఎందుకు సస్పెండ్ చెయ్యలేదని అడిగారు. మీరు చేసిన పనుల వలన ప్రజావ్యతిరేకత వచ్చిందని అనిత అన్నారు.