అన్వేషించండి

Chandrababu: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు, రాత్రికి అమిత్ షాతో భేటీ!

Delhi Tour: ఎన్నికల వేళ ఏపీలో పొత్తుల అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో చంద్రబాబు ఢిల్లీ టూర్‌కు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Andhra Pradesh News: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి సాయంత్రం ప్రత్యేక విమానంలో హస్తినకు బయల్దేరిన చంద్రబాబు.. కొద్దిసేపటి కోసం గమ్యస్థానానికి చేరుకున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. రాత్రికి ఇరువురు ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ రాత్రి బీజేపీ పెద్దలతో చంద్రబాబు, పవన్ భేటీ కానున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశం కానున్నారని సమాచారం. ఏపీలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారని తెలుస్తోంది. పొత్తుపై క్లారిటీ వస్తే  చంద్రబాబు, పవన్, జేపీ నడ్డా కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీతో పొత్తుపై ప్రకటన చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

శుక్రవారం సాయంత్రంలోపు క్లారిటీ

శుక్రవారం సాయంత్రంలోపు టీడీపీ,జనసేన, బీజేపీ పార్టీల పొత్తుపై స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళ్లడంతో దాదాపు బీజేపీతో పొత్తు ఖారారు అవుతుందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జనసేన ఎన్డీయేలో ఉండగా.. ఈ నెల 9వ తేదీన టీడీపీ తిరిగి ఎన్టీయే గూటికి చేరుతుందని అంటున్నారు. చంద్రబాబు, పవన్ ఢిల్లీ పర్యటనతో పొత్తులపై ఏదోక క్లారిటీ రానుంది. టీడీపీ, జనసేనతో పొత్తుపై రాష్ట్ర బీజేపీ నేతలు కూడా సానుకూలంగా ఉన్నారు. ఇటీవల ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన బీజేపీ పెద్దలు.. పొత్తుపై రాష్ట్ర నేతల అభిప్రాయాలను సేకరించారు. అనంతరం అధిష్టానానికి నివేదిక అందించారు. ఈ క్రమంలో బాబు, పవన్‌కు బీజేపీ పెద్దల నుంచి పిలుపురావడంతో హస్తినకు వెళ్లారు.

బీజేపీకి ఎన్ని సీట్లు?

పొత్తులో బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారనేది హాట్‌టాపిక్‌గా మారింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా.. జనసేన సీట్లు  ఆశించకుండా మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 13 అసెంబ్లీ సీట్లను టీడీపీ కేటాయించగా.. కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. వారిలో ఇద్దరికి చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కింది. అయితే ఈ సారి  కూడా 13 అసెంబ్లీ సీట్లతో పాటు ఏకంగా  ఐదు ఎంపీ సీట్లను బీజేపీ ఆశిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే టీడీపీ మాత్రం అన్ని సీట్లను ఇచ్చేందుకు నిరాకరిస్తుంది. బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపై పార్టీ నేతల అభిప్రాయాలను కూడా చంద్రబాబు తీసుకున్నారు. బీజేపీకి మూడు అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు ఇస్తే సరిపోతుందని చంద్రబాబుకు టీడీపీ ముఖ్యనేతలు సూచించారు.

ఆ స్థానాలు కోరుతున్న కాషాయదళం

పొత్తులో భాగంగా నర్సాపురం, అరకు, ఏలూరు, తిరుపతి, రాజంపేట, రాజమండ్రి సీట్లను బీజేపీ కోరుతుంది. అయితే బీజేపీ ఆశించే స్థానాలపై ఇటీవల టీడీపీ కూడా ఒక సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఆ సర్వేలో కొన్నిచోట్ల ఫలితాలు ప్రతికూలంగా వచ్చినట్లు చెబుతున్నారు. రాజంపేట లాంటి స్థానాల్లో ముస్లింల ఓటు బ్యాంక్  ఎక్కువగా ఉంది. అలాంటి చోట్ల బీజేపీకి టికెట్ ఇస్తే నష్టం జరుగుతుందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. అలాగే ఆ నియోజకవర్గంలో పోటీ చేసే కూటమి అభ్యర్థులకు కూడా దీని వల్ల నష్టం చేకూరే అవకావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget