By: ABP Desam | Updated at : 09 Mar 2023 03:22 PM (IST)
టీడీపీ నేత అనితపై ఫేక్ పోస్టులు - అట్రాసిటీ కేసు పెడతానని వార్నింగ్ !
TDP Leader Anita Warns YSRCP : తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అనిత మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఓ వీడియోను మార్ఫింగ్ చేసిన కొంత మంది సోషల్ మీడియాలో పోస్టు చేయడం వివాదాస్పదం అవుతోంది. ఈ వీడియోను వైఎస్ఆర్‌సీపీ అనుబంధ మీడియాలోనూ ప్రసారం చేశారు. అదే సమయంలో ఈ వీడియో విషయంలో ఆమెను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరణ అడిగినట్లుగా ఓ లెటర్ ను కూడా సృష్టించారు. ఇది కూడా ఫేక్ కావడంతో మాజీ ఎమ్మెల్యే అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్‌సీపీ నేతలపై విరుచుకుపడ్డారు.
ఫేక్ ట్రోలింగ్‌కు జగన్ దిగజారారు : అనిత
జగన్ ఫేక్ సీఎం అన్నది అందరికీ తెల్సిందేనని.. మహిళా దినోత్సవం సందర్భంగా నా ఫేక్ ట్రోలింగ్ కి దిగజారాడని అనిత విశాఖలో నిర్వహించిన ప్రెస్మీట్‌లో తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేయడం దారుణమని... ఇలా చేసిన వాడిని కన్న తల్లి కూడా సిగ్గుపడుద్దని.. చేయించిన వాడు ఇంకా సిగ్గు పడాలన్నారు. జగన్ మళ్లీ సీఎం అవ్వడని తెలిసి ఇలా ఎడిట్ చేసి శునకానందం పొందుతున్నాడని మండిపడ్డారు. ఈ ఎడిట్ చేసింది ఇది చేసింది ప్రదీప్ అని తెలిసిందని.. అరేయ్ నీ కన్న తల్లిదండ్రులు ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితని మండపడ్డారు. సోషల్ మీడియా పనికిమాలిన వాళ్ళ సంగతి సరే.. మరి గొప్పగా చెప్పుకునే సాక్షి టీవీకి బుద్ధి ఏమయ్యిందని అనిత ప్రశ్నించారు. తనపై ట్రోలింగ్ చేసి.. మళ్లీ తనకే ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని అనిత మండిపడ్డారు.
అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్ లెటర్ : అనిత
తన వీడియోను ట్రోల్ చేయడమే కాకుండా.. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఓ ఫేక్ షోకాజ్ లెటర్ రిలీజ్ చేశారని.. జగన్ బ్యాచ్ రూ. 5 ఆశపడి ఫేక్ బ్రతుకులు బతుకుతున్నారని.. బురదలో బ్రతికే బ్రతుకులు వైసీపీ ఫేక్ బ్యాచ్ వన్నారు. టీడీపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఓ దళిత మహిళకు టీడీపీ ఇచ్చిన గౌరవం అన్నారు. సాక్షి పైనా, ఫేక్ బ్యాచ్ పైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని.. అట్రాసిటీ కేసు పెడతానని ప్రకటించారు. మిగతా వారి మాదిరిగా వదలననని.. మీ నాయకుడు నత్థి పకోడీ గాడిపై మీ టేలెంట్ చూపించాలని అనిత సవాల్ చేశారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసే వారి ఇళ్లకు వచ్చి చీపురుతో చితకబాదుతానని హెచ్చరించారు.
తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం పార్టీ !
తమ పార్టీ మహిళా నేత పై.. మహిళా దినోత్సవం రోజునే ఫేక్ చేసి ట్రోలింగ్ చేయడంపై టీడీపీ మండిపడింది. ఇదేం రాజకీయం అని ప్రశ్నించింది. జనంలో గెలవలేక ఐ ప్యాక్ మీడియాతో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయించుకుని రాజకీయం చేయడానికి సిగ్గు వేయడం లేదా అని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు.
బులుగు కుక్కల నీచత్వం ఇది.టీడీపీ మహిళా నేత, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారు యువగళం పాదయాత్రలో జగన్ రెడ్డికి ఫేవర్ గా మాట్లాడినట్టు, దానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు షో కాజ్ నోటీసు ఇచ్చినట్టు వైసీపీ మీడియా సృష్టించిన ఫోర్జరీ లేఖ ఇది.ఏం జగన్ రెడ్డి! ఇదేనా నీ రాజకీయం ? pic.twitter.com/bbM3HWRgPq
— Telugu Desam Party (@JaiTDP) March 9, 2023
Breaking News Live Telugu Updates: హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా వేసిన TSPSC
AP Elections: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సీపీఐ నారాయణ క్లారిటీ - కండీషన్స్ ఆప్లై అంటూ ట్విస్ట్!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం - ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ !
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Eesha Rebba: అందాలతో అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బ
UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్ 1 నుంచి ఫీజు!
Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?