అన్వేషించండి

Nara Lokesh: చంద్రబాబును ముట్టుకుంటే మీకు షాక్! రిషాంత్ రెడ్డికి ఆపరేషన్ చేయిస్తా- లోకేష్ వార్నింగ్

Nara Lokesh: చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి కండువా వేసుకోని వైసీపీ కార్యకర్త అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పల్నాడు జిల్లాలో ఆయన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది.

Nara Lokesh: చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి కండువా వేసుకోని వైసీపీ కార్యకర్త అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పల్నాడు జిల్లాలో ఆయన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. సోమవారం కారంపూడిలో బహిరంగా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ వైఫల్యాలపై లోకేష్ నిప్పులు చెరిగారు.  

చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై వైసీపీ నేతల దాడులు ఎస్పీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిషాంత్ రెడ్డికి ఆపరేషన్ చేయించి అన్నీ కనిపించేలా చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి పని తక్కువ.. ప్రచారం ఎక్కువ అని విమర్శించారు. మహిళల కోసం దిశ చట్టం పేరుతో డమ్మీ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. గన్ కంటే ముందు జగన్ వస్తారని వైసీపీ మహిళా నేతలు అన్నారని, కానీ సీఎం పనితీరు చూస్తే ఊరు గొప్ప పేరు దిబ్బలా తయారైందన్నారు. మహిళల సంరక్షణకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పనికిరాని చట్టాలతో ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. 

వెల్దుర్తి మండలం బోదలవీడు గ్రామంలో వైసీపీ సానుభూతిపరుడు, ఉప సర్పంచ్ ముగ్గురు మహిళలపై దాడి చేస్తే చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. నడి రోడ్డుపై మహిళలను కొట్టి మళ్లీ వారిపైనే ఎదురు కేసు పెట్టారని ఆరోపించారు. పూటకో అత్యాచారం, రోజుకో హత్య రాష్ట్రంలో జరుగుతోందని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని మండిపడ్డారు. 

లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని, వెయ్యి రూపాయల విలువైన వాటర్ బాటిల్‌ నీరు తాగుతూ.. తాను పేదవాడినని జగన్‌ చెబుతున్నారని, నాలుగో చోట్ల రాజ భవనాలు ఉన్న జగన్.. పేదవారా? అంటూ లోకేస్ ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు నాలుగు సార్లు, ఆర్టీసీ ఛార్జీలు మూడుసార్లు పెంచి ప్రజలను బాదుతున్నారని అన్నారు. చెత్తపై పన్ను వేసే చెత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. ప్రతి చోటా ఫొటో వేసుకునే జగన్ కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లుపై ఎందుకు వేసుకోరని ప్రశ్నించారు. 

దేశ రాజకీయాలను శాసించిన చంద్రబాబు హై వోల్టేజ్ అని ఆయన్ను ముట్టుకుంటే షాక్ తప్పదని లోకేశ్‌ హెచ్చరించారు. అధికార పక్షం నేతలే బంద్‌కు పిలుపునిచ్చే వింత పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఎద్దేవా చేశారు. ఒక్క ప్రాజెక్టు కట్టడం చేతగాని జగన్.. చంద్రబాబుపై రాళ్ల దాడి చేయిస్తున్నారనని మండిపడ్డారు. 

అంతకు ముందు ఆయనకు కారంపూడిలో ఘన స్వాగతం పలికారు. పలువురు విద్యార్థులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కారంపూడి మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఇంటర్‌, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారని లోకేష్‌ మండిపడ్డారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గతంలో అమలు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దుచేశారని ఆరోపించారు.

టీడీపీ అధికారంలోకి రాగానే కారంపూడిలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంఖ్యను బట్టి డిగ్రీ కాలేజి అంశాన్ని పరిశీలిస్తామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు దూరప్రాంతాల్లో చదవాల్సి వచ్చినా... వారిపై ఎటువంటి భారంపడకుండా రీఎంబర్స్ మెంట్ పథకాన్ని అమలుచేస్తామని చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget