అన్వేషించండి

Chandrababu: 'ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం' - మహిళల ఆదాయం రెట్టింపు చేస్తామని చంద్రబాబు భరోసా

Ap Politics: టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపడతామని చంద్రబాబు తెలిపారు. కుప్పంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Chandrababu Comments in Kuppam: టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. సోమవారం కుప్పం (Kuppam) పర్యటనలో భాగంగా ఆయన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. వైసీపీ హయాంలో చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. 'డబ్బుకు కక్కుర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. టీడీపీ హయాంలో అక్రమార్కులు రాష్ట్రంలోకి రావడానికే భయపడ్డారు. అలాంటిది ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా.?' అంటూ నిలదీశారు.

అవసరమైతే ప్రత్యేక చట్టం

అవసరమైతే ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు. దేశంలో ఆడబిడ్డల గురించి మాట్లాడిన తొలి పార్టీ టీడీపీ అని.. వారికి ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. 'తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోతే పోరాడి మరీ కోర్టుకు వెళ్లి తెచ్చుకునే హక్కు కల్పించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో మహిళల్లో చైతన్యం తీసుకొచ్చాం. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇవ్వాలని ఆలోచన చేసిందే టీడీపీ. 2 కోట్ల మంది మహిళలకు హామీ ఇస్తున్నా. మహిళల ఆదాయం రెట్టింపు చేస్తాం. జగన్ లా రూ.10 ఇచ్చి రూ.100 లాగడం కాదు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతాం. అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 అకౌంట్ లో వేస్తాం' అని హామీ ఇచ్చారు. 

'అప్పుడు అవహేళన చేశారు'

మహిళలు ఆర్థికంగా పైకి రావాలంటే ఇంటికి 2 ఆవులు ఇవ్వాలనుకున్నామని.. అప్పుడు దీనిపై అవహేళన చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. కుప్పంలో వెయ్యి లీటర్లతో ప్రారంభమైన పాల సేకరణ.. ఇప్పుడు 4 లక్షల లీటర్లకు చేరుకుంది. ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం ఇంటింటికీ మరుగుదొడ్లు కట్టించామని అన్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతూ ఆడబిడ్డల మంగళసూత్రాలను వైసీపీ ప్రభుత్వం తెంచేస్తోందని విమర్శించారు. జగన్ పాలనలో రూ.60 మద్యం ధర రూ.200 అయ్యిందని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని అన్నారు. కుప్పంలో రాళ్లు, మట్టిని కూడా అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది కౌరవ సభ అని.. దానిని గౌరవ సభ చేశాకే మళ్లీ అక్కడ అడుగు పెడతామని అన్నారు. కుప్పంలో లక్ష మెజార్టీ సాధించేందుకు టీడీపీ కార్యకర్తలు కృషి చేయాలని.. అందరిదీ అదే లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీకీ ఓటు వేయాలని అడిగిన వారికి కర్రు కాల్చి వాత పెట్టాలని ధ్వజమెత్తారు. 75 శాతం ఓట్ల పడేలా కృషి చేయాలని సూచించారు. 

కుప్పంలో పర్యటన
Chandrababu: 'ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం' - మహిళల ఆదాయం రెట్టింపు చేస్తామని చంద్రబాబు భరోసా
Chandrababu: 'ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం' - మహిళల ఆదాయం రెట్టింపు చేస్తామని చంద్రబాబు భరోసా

చంద్రబాబు రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం కుప్పం చేరుకున్న ఆయనకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కొత్తపేటలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం, పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం అందించారు. మరోవైపు, పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన వాహనాన్ని పార్టీ శ్రేణులు చుట్టుముట్టాయి. పరిసరాల్లో అంతగా పోలీసులు లేకపోవడంతో మహిళలతో ముఖాముఖిలో పాల్గొనేందుకు చంద్రబాబు వాహనం దిగి వెళ్లగా ఇబ్బంది పడ్డారు. పరిసరాల్లో అంతగా పోలీసులు లేరని.. అతి సాధారణ భద్రత కల్పించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: YS Sharmila: వైసీపీకి మరో షాక్, షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గోకుల్ కృష్ణారెడ్డి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget