అన్వేషించండి

Chandrababu: ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది: చంద్రబాబు

AP Election Schedule: ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని.. ఇక మిగిలింది పోలింగే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

TDP Chief Chandrababu: అమరావతి: ఏపీ ఎన్నికల్లో సీఎం జగన్ కు దిమ్మతిరిగే ఫలితం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఉన్మాదుల నుంచి స్వాతంత్ర్యం వచ్చినంత ఆనందంగా ఏపీ ప్రజలు పండుగ చేసుకుంటున్నారని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ విడుదల అయిందని తెలయగానే, రాష్ట్ర ప్రజలు ఆనందంగా రోడ్లపైకి వస్తున్నారని చెప్పారు. 5 ఏళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమే అంటూ ఎన్నికల షెడ్యూల్ పై చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని.. ఇక మిగిలింది పోలింగే అన్నారు. ఒక్క చాన్స్ ప్రభుత్వానికి ఇక నో చాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చిందన్నారు. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుదాం.. ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే అని చంద్రబాబు పేర్కొన్నారు.

విజయవాడ లబ్బీపేటలొని ఎస్.ఎస్.కన్వెన్షన్ హాలులో టీడీపీ లీగస్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల సమ్మిట్ లో చంద్రబాబు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జూనియర్ న్యాయవాదులకు న్యాయమిత్ర పేరుతో నెలకు రూ.7 వేలు గౌరవ వేతనం ఇస్తామన్నారు. లా నేస్తం పేరుతో సీఎం జగన్ కేవలం 2,670 మందికే గౌరవ వేతనం ఇచ్చారని, తమ ప్రభుత్వంలో 3,500 మంది వరకు పెంచిన వేతనం ఇస్తామని భరోసా ఇచ్చారు. లాయర్లకు కార్పస్ ఫండ్ కింద రూ.100 కోట్లు కేటాయిస్తామన్నారు.

‘ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో లీగల్ సెల్ వర్క్ షాప్ లు పెట్టుకోవాల్సి వస్తోంది. నా నామినేషన్ ను కార్యకర్తలు, న్యాయవాదులే వేసేవారు. కేవలం డిక్లరేషన్ పత్రంపైనే నేను సంతకం చేసేవాడిని. కానీ నేడు నాపై ఎన్నికేసులు ఎన్నాయో ముందుగానే డీజీపీని, అధికారులను లేఖల ద్వారా అడిగే పరిస్థితులున్నాయి. మనం అడగకపోతే ఎప్పుడు దొంగ కేసులు పెట్టారో తెలియదు. నామినేషన్ వేయాలనుకునే ప్రతి అభ్యర్థి తనపై ఎన్ని కేసులు ఎన్నాయో చెప్పండి అని అడుక్కునే పరిస్థితి. శాసన, కార్యనిర్వహక, మీడియా గాడి తప్పితే మళ్లీ గాడిలో పెట్టేది న్యాయ వ్యవస్థే. న్యాయ వ్యవస్థ లేకుండా మనం ఇక్కడ ఉండేవాళ్లం కాదు. నాతో పాటు మా లాయర్లు కూడా నిద్రలేని రాత్రులు గడిపారు. ప్రతి శుక్రవారం రాష్ట్రంలో ప్రొక్లెయిన్లు వస్తాయి. ఇల్లీగల్ కస్టడీకి కూడా తీసుకున్నారు’ అని చంద్రబాబు తెలిపారు.

కేంద్రం, రాష్ట్రంలో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వాలే
‘లాయర్లపై దాడులు జరగడం గతంలో చూడలేదు. కానీ ఇప్పుడు చూశాను. వారే కోర్టుకు వెళ్లి దాడులు జరుగుతున్నాయని చెప్పుకునే పరిస్థితి. నామినేషన్లు వేయడానికి కూడా వీల్లేని పరిస్థితిని స్థానిక సంస్థల ఎన్నికల నుంచి చూస్తున్నాం. బెదిరింపులు, భయపెట్టడాలు, నామినేషన్ వేయడానికి అవసరమైన సర్టిఫికేట్లు కూడా ఇవ్వనీయరు. అన్నీ దాటుకుని నామినేషన్ వేస్తే స్క్రూటినీలో తొలగిస్తారు. దాన్ని దాటుకుని వెళ్తే ఫలితాలు వారికి అనుకూలంగా వేసుకుని గెలిచిన వాళ్లను ఓడగొడతారు. రక్షణ కోసం కేంద్ర సాయాన్ని కోరే పరిస్థితి ఏర్పడింది. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు ఇష్టానుసారంగా వేసుకున్నారు. 

ఆదివారం ప్రధానితో ప్రజాగళం సభను చిలకలూరిపేటలో నిర్వహిస్తున్నాం. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు రాబోతున్నయి. ఈ రోజు వరకు ఒక ఎత్తు... ఇప్పటి నుంచి ఒక ఎత్తు. రోడ్ల పైకి వచ్చిన వాళ్లకు పథకాలు కట్ చేయడం కాదు. ప్రజలే జగన్ కు ఇక పవర్ కట్ చేస్తారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తున్నాయి. కేంద్రంలో 400 లోక్ సభ సీట్లు పైచిలుకుతో కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో ఎప్పుడూ లేని మెజారిటీతో గెలువబోన్నాం. దేశం 2047 విజన్ తో దూసుకుపోతుంటే... రాష్ట్రాన్ని రాతియుగం వైపు తీసుకెళ్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడటం మా మూడు పార్టీల బాధ్యతే కాదు.. ప్రతి ఒక్కరి బాధ్యత. 

ఐదేళ్లు ఒక ఎత్తు... రాబోయే 57 రోజులు ఎక ఎత్తు. రాజకీయాలు, మతం, ప్రాంతం కాదు...పిల్లల భవిష్యత్ బాగుండాలంటే దుర్మార్గ పాలనను అంతం చేయాలి. లాయర్లకు కూడా ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. లాయర్లకు కూడా స్వయర్ణయుగం చూపించే పాలన తీసుకొస్తాం. మెడికల్ క్లెయిమ్, బీమాకు ప్రీమియం కట్టాలి...రూ.5 లక్షల దాకా మెడికల్ క్లెయిమ్, రూ.15 లక్షల ప్రమాద బీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించే బాధ్యత తీసుకుంటాం. న్యాయం కోసం పోరాడే మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కూడా ప్రయత్నిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తెచ్చారో నాకు అర్థం కావడం లేదు.  ఎన్నికల కోడ్ వచ్చింది... కాలర్ ఎగరేసుకుని ఇక బయటకు రండి. రాష్ట్రంలో ఇక ప్రకంపనలే కనబడతాయి. రాష్ట్రాన్ని కాపాడటానికి అడ్వకేట్ లు కూడా బాధ్యత తీసుకోవాలి.’ అని చంద్రబాబు అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
Embed widget