అన్వేషించండి

Chandrababu: 'రాష్ట్ర యువత ఆశలు చంపేశారు' - ఏపీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

Andhra News: ఏపీపీఎస్సీ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్రమాలు జరిగాయంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Chandrababu Comments on Appsc: ఏపీ ప్రభుత్వం రాష్ట్ర యువతను మోసం చేసి.. వారి ఆశలు చంపేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీలో (Appsc) అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ శుక్రవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ హయాంలో నిజాయతీ గల వ్యక్తులను ఛైర్మన్ గా నియమించామని.. ఇప్పుడు ఏపీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని మండిపడ్డారు. 'ప్రజా సేవ చేయాలని ఎంతో మంది యువత కలలు కంటారు. అందులో భాగంగానే గ్రూప్స్ పరీక్షలను ఎంచుకుంటారు. జగన్ సర్కారు ఏపీపీఎస్సీ ఉద్యోగాలను అమ్మకానికి పెట్టింది. రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టునే తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. నీతి నిజాయతీ ఉన్న వ్యక్తిని కమిషన్ ఛైర్మన్ గా నియమించాలి. ఆలిండియా సర్వీసులు ఎంత ముఖ్యమో స్టేట్ సర్వీసులూ అంతే ముఖ్యం. ఒకప్పుడు నమ్మకంగా ఉన్న ఏపీపీఎస్సీ ఇప్పుడు అపనమ్మకంగా మారింది. నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్ భాస్కర్ ను మెడపడ్డి బయటకు పంపారు. సీఎం జగన్ కు అనుకూలంగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను నియమించారు. ప్రస్తుతం కమిషన్ లో అనుభవం లేని వారు ఛైర్మన్ గా, సభ్యులుగా ఉన్నారు.' అంటూ చంద్రబాబు విమర్శించారు.

'ఇవిగో ఆధారాలు'

2018లో జరిగిన గ్రూప్ - 1 పరీక్షల వాల్యుయేషన్ లో అక్రమాలు జరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. 'గ్రూప్ - 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అవినీతి రాజ్యమేలింది. గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ ఛైర్మన్ అయ్యాక దురాలోచనకు తెరలేపారు. వాల్యుయేషన్ ను దాచిపెట్టి మళ్లీ రెండోసారి చేశారు. రెండో మూల్యాంకనం జరగలేదని కోర్టుకు చెప్పారు. అలా జరిగింది అనడానికి ఆధారాలు ఇస్తున్నాం. డిజిటల్ వాల్యూయేషన్, మాన్యువల్ వాల్యుయేషన్ అంటూ రకరకాలుగా చేశారు. ఓసారి మూల్యాంకనం అయ్యాక రెండోసారి ఎలా చేస్తారు.?. మాన్యువల్ వాల్యుయేషన్ కు వచ్చిన వారి కోసం రూ.20 లక్షలు ఖర్చు చేశారు. ఆవాస రిసార్డ్ కు ఈ మొత్తం చెల్లించినట్లుగా బిల్లులున్నాయి. స్ట్రాంగ్ రూం వద్ద భద్రతకు కర్నూలు నుంచి కానిస్టేబుళ్లను తీసుకొచ్చారు. ఎన్నో ఆశలతో పరీక్షలు రాసిన నిరుద్యోగ యువత పట్ల క్రూర మృగాల కంటే ఘోరంగా వ్యవహరించారు. మూల్యాంకనం ప్రక్రియలో బరితెగించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని చూశారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు కావాల్సిన అభ్యర్థుల కోసం అక్రమాలకు పాల్పడ్డారు. అందుకు తగ్గట్టుగా ఛైర్మన్ స్థాయిలో గౌతమ్ సవాంగ్ సహకరించారు. సలాంబాబు, సుధాకర్ రెడ్డి, సుధీర్ వంటి వారిని సభ్యులుగా నియమించారు. పిల్లల జీవితాలు, తల్లిదండ్రుల కలలను నాశనం చేశారు. గ్రూప్ - 1 అభ్యర్థులు చందాలు వేసుకుని న్యాయం కోసం పోరాడారు. ఐదేళ్ల తర్వాత వారికి న్యాయం జరిగింది.' అని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఇదీ జరిగింది

ఆంధ్రప్రదేశ్‌లో 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో (2018లో) జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను మాన్యువల్ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ.. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను పరిగణనలోకి తీసుకోకుండా.. రెండోసారి మూల్యాంకనం చేసి, నచ్చిన వారిని ఎంపిక చేసి ఏపీపీఎస్సీ ఫలితాలను వెల్లడించిందని వారు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు పరీక్షను రద్దుచేస్తూ.. మార్చి 13న తీర్పు వెల్లడించింది. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియను 6 వారాల్లోపు పూర్తిచేయాలని స్పష్టం చేసింది.

అయితే, దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఎంపికైన ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపింది. ఎలాగైనా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడి తీరతామని స్పష్టం చేసింది.

Also Read: Mudragada Padmanabham: వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం - కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద  
Embed widget