Chandrababu Naidu Arrest : మోత మోగించిన టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన !
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో ఉంచారని ఐదు నిమిషాల పాటు మోతమోగించారు టీడీపీ క్యాడర్. టీడీపీ ముఖ్య నేతలంతా ఎక్కడిక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Chandrababu Naidu Arrest : చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేశారని సీఎం జగన్ ను వినిపించేలా ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకూ మోత మోగిద్దాం అనే కార్యక్రమాన్ని టీడీపీ క్యాడర్ విస్తృతంగా నిర్వహించింది. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో టీడీపీ అభిమానులు తమకు నచ్చిన పద్దతిలో మోత మోగించారు. ఢిల్లీలో నారాలోకేష్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.
రాజమహేంద్రవరంలో నారా బ్రాహ్మణి, హైదరాబాద్ భువనేశ్వరి విజిల్ మోగించి, డ్రమ్ మోగించి తమ నిరనస తెలిపారు.
ఐదు నిమిషాల పాటు ప్రజలు అంతా తమకు ఇష్టమైన పద్దతిలో శబ్దం చేసి నిరసన చేపట్టాలని.. మోత మోగిద్దాం పేరుతో ప్రచార కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఒక్క రోజు ముందే ఈ కార్యక్రమం ప్రకటించినప్పటికీ ఒక్క రోజులోనే విస్తృత ప్రచారం చేసి.. దాదాపుగా అన్ని చోట్లా మంచి స్పందన వచ్చేలా చూసుకున్నారు. టీడీపీ నేతలు .. టీడీపీ అభిమానులు.. చంద్రబాబుకు మద్దతుగా ఉండేవారు ఎక్కడిక్కడ తమకు అనుకూలమైన పద్దతిలో నిరసనలు చేపట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
#ChaloMothaMogiddham Never in my life have I felt as though listening to blaring sounds could resemble a symphony, but when a government becomes tyrannical and arrests peaceful protesters on false charges, this is how people react: by standing their ground against tyranny. pic.twitter.com/Lf9JmMpEAb
— nikhil kumar (@msgNikhilkumar) September 30, 2023
తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులతో పాటు చంద్రబాబు అరెస్టు అక్రమం అని భావిస్తున్న వారు పలు చోట్ల రోడ్ల మీదకు వచ్చి శబ్దంచేశారు.
TDP organised ‘Motha Mogidham’ protest against the arrest of party chief #ChandrababuNaiduArrest. Across the state Yellow Party leaders and cadres participated in five minutes long ‘noisy protest’ using drums, whistles, utensils, vehicle horns. #AndhraPradesh #AndhraElection… pic.twitter.com/uzyZhsQlKM
— Ashish (@KP_Aashish) September 30, 2023
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతిష్ఠాత్మకంగా మోత మోగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసారు.
వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం అమర్తలూరు గ్రామంలో తెలుగు మహిళ ల ఆధ్వర్యంలో మోత మోగిద్దాం @ncbn @naralokesh @NakkaAnandababu @JaiTDP pic.twitter.com/Stt5yM9m4S
— మోహన్ (MOHAN) (@mohan459) September 30, 2023
సోషల్ మీడియాలో మోత మోగిద్దాం అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది.
KPHB massssss ❤️🔥 🔥 #CBNWillBeBackWithABang #ChaloMothaMogidham pic.twitter.com/WGoxYeHjDc
— Bhavya🦩 (@unexpected5678) September 30, 2023
Bikers joined 🔊🔊#ChandrababuNaidu #ChaloMothaMogiddham pic.twitter.com/0MzybMX6F4
— EPIC (@Koduri_526) September 30, 2023