Visakha News: విశాఖలో వివాదాస్పద డివైడర్ తొలగించిన టీడీపీ, జనసేన నేతలు - అప్పటి ఎంపీ కోసం ఏర్పాటు చేశారని ఆరోపణ
Andhra Pradesh News: విశాఖలో వివాదాస్పద డివైడర్‌ను టీడీపీ, జనసేన నేతలు బుధవారం జేసీబీతో ధ్వంసం చేశారు. దీని వల్ల ప్రజలు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని.. అందుకే పునరుద్ధరించామన్నారు.
TDP And Janasena Leader Removes Tycoon Junction Divider: విశాఖలో గత ఏడాదిన్నరగా వివాదాస్పదంగా మారిన డివైడర్‌ను టీడీపీ, జనసేన నేతలు బుధవారం తొలగించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్‍గా మారాయి. వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోసం పోలీసులు ఈ టైకూన్ జంక్షన్‌ను మూసివేశారన్న ఆరోపణలున్నాయి. ఆయన భవనాలకు సంబంధించి వాస్తు దోషం పోవడానికి ఇలా చేస్తున్నారని అప్పట్లో టీడీపీ నేతలు విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆశిల్ మెట్ట వద్ద యూటర్న్ బ్లాక్‌ను.. పెందుర్తి టీడీపీ ఇంఛార్జీ గండి బాబ్జీ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ బుధవారం జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ డివైడర్ వల్ల విశాఖ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందుకే దీన్ని తొలగించామని అన్నారు. డివైడర్ వల్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని చెప్పారు. గతంలో వైసీపీ ఎంపీ కోసం ఈ డివైడర్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇక ఆ సమస్య ఉండదని స్పష్టం చేశారు.
Also Read: Pawan Kalyan: 'ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటా' - జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు