By: Harish | Updated at : 20 Feb 2023 09:38 PM (IST)
సీఎం జగన్ సమీక్ష
CM Jagan : పరిశ్రమల స్థాపన మెుదలుకొని, మార్కెటింగ్ వరకు పూర్తి బాధ్యతలను ప్రభుత్వం చూసుకునేలా అధికారులు చోరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. న్యూ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీపై అధికారులు ప్రత్యేక చోరవ తీసుకోవాలని ఆయన సూచించారు. నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖతో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమావేశం నిర్వహించారు. నూతన పారిశ్రామిక విధానంపై ప్రాథమిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
మార్కెటింగ్ వరకు అన్ని సదుపాయాలు
ఈ సమావేశంలో సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన మొదలు మార్కెటింగ్ వరకు పరిశ్రమలను చేయిపట్టుకుని నడిపించే విధంగా పాలసీ ఉండాలని జగన్ అభిప్రాయపడ్డారు. న్యూ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీలో మార్కెటింగ్ టై అప్ విధానంపై దృష్టి సారించాలని, అంతర్జాతీయంగా మార్కెటింగ్ టై అప్ చేయగలిగితే ఎంఎస్‌ఎంఈ రంగంలో మరింత మెరుగైన అభివృద్ధి సాధించగలుగుతామని జగన్ అభిప్రాయపడ్డారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుందని.. సరైన మార్కెటింగ్ చూపించగలిగితే ఈ రంగంలో పరిశ్రమలు మరింత రాణిస్తాయని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు.
హేండ్ హెల్డింగ్ అత్యంత కీలకం
కాన్సెప్ట్ నుంచి కమిషనింగ్ మొదలుకుని మార్కెటింగ్ వరకు హేండ్ హోల్డింగ్‌గా ఉండాలని జగన్ సూచించారు. అడ్వైజ్, అసిస్ట్ అండ్ సపోర్టివ్‌గా ఎంఎస్‌ఎంఈ పాలసీ ఉండాలని దీని వలన, ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహం ఉంటుందన్నారు. స్టార్టప్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకోవాలన్నారు. విశాఖపట్నంలో సుమారు 3 లక్షల చదరపు అడుగులుతో స్టార్టప్స్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. మంచి లొకేషన్‌లో భవనాన్ని నిర్మించాలన్న సీఎం, అదే భవనంలో పరిశ్రమలశాఖ కార్యాలయం కూడా ఉండేలా ప్లాన్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలన్న సీఎం, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు కోసం మౌలిక సదుపాయాలు కల్పనదిశగా దృష్టిసారించాలని ఆదేశించారు. ఈ అంశాల ప్రాతిపదికగా ఇండస్ట్రియల్ పాలసీలో ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు.
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్
Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!
Lokesh on Sand Mafia: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఇసుక దందా ఆరోపణలు, టిప్పర్ల ముందు లోకేష్ సెల్ఫీలు వైరల్
MP Nandigam Suresh : పథకం ప్రకారమే దాడి, ఆదినారాయణ రెడ్డి మనుషులే కవ్వించారు- ఎంపీ నందిగం సురేష్
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?