అన్వేషించండి

Ram Mandir Inauguration: ఎస్వీబీసీలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం

SVBC airs Ayodhya Ram Mandir Event: అయోధ్య శ్రీరామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎస్వీబీసీ భక్తి ఛానళ్లలో ప్రత్యక్షప్రసారం చేయనుంది.

Ayodhya Ram Mandir Pran Pratishtha: తిరుపతి: ఎన్నో శతాబ్ధాల కల మరో రెండు రోజుల్లో నెరవేరనుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్య శ్రీరామమందిరం (Ram Mandir)లో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం జ‌న‌వ‌రి 22వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనుంది. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛాన‌ల్ (SVBC) తమిళం, కన్నడ, హిందీ ఛాన‌ళ్లలో ప్రత్యక్షప్రసారం చేయనుంది. అదే విధంగా ఎస్వీబీసీ తెలుగు యూట్యూబ్ ఛాన‌ల్‌ ద్వారా అయోధ్యలో జరిగే వైదిక, ఆధ్యాత్మిక క్రతువులను నిరంతరాయంగా ప్రత్యక్షప్రసారం చేయనుంది.

భక్తులు ఈ విషయాలను గమనించి ఎంతో వైభవంగా, ఆగమోక్తంగా జరిగే అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలను ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఛాన‌ళ్లలో వీక్షించి తరించాలని భక్తలోకానికి టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఎస్వీబీసీ తెలుగు ఛాన‌ల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు అయోధ్య కార్యక్రమాలు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. అనంతరం 12 గంటల నుండి తిరుమల శ్రీవారి కల్యాణం యధావిధిగా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఆ తరువాత అయోధ్యలో మధాహ్నం 12 గంటల నుండి జ‌రిగే కార్యక్రమాలను శ్రీ‌వారి క‌ల్యాణం అనంత‌రం తిరిగి ప్ర‌సారం చేస్తారు. టీటీడీ అధికారి ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

పెద్ద స్క్రీన్లపై లైవ్‌లో చూసే అవకాశం
అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్టను ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది అయోధ్యకు చేరుకుంటున్నారు. కోట్లాది ప్రజలు టీవీల్లో చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న టీవీ ఛానెళ్లు లైవ్ ఈ మహత్తర కార్యక్రమాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు ప్రముఖ మల్టీప్లెక్స్‌ సంస్థలు పీవీఆర్‌(PVR), ఐనాక్స్‌(INOX)లు అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకలను పెద్ద స్క్రీన్లపై చూసే అవకాశం కల్పిస్తున్నాయి. రూ.100 టికెట్‌తోనే థియేటర్లలో కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. 

121 మందితో ప్రాణ ప్రతిష్ట
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. వీరిలో కొద్ది మందిని మాత్రమే గర్భాలయంలోకి అనుమతిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది. గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ ఆధ్వర్యంలో 121 మంది ఆచార్యులు ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారని కమిటీ వెళ్లడించింది. ఈ కార్యక్రమాలకు కాశీకి చెందిన లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ ప్రధాన ఆచార్యుడిగా వ్యవహరించబోతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఎప్పుడు ఎన్నికలొచ్చినా కూటమిదే విజయం, సర్వేలన్నీ మనకే అనుకూలం: చంద్రబాబు
ఎప్పుడు ఎన్నికలొచ్చినా కూటమిదే విజయం, సర్వేలన్నీ మనకే అనుకూలం: చంద్రబాబు
Vijayasai Reddy Political Party: కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Vangaveeti Radha: నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
Vijayasai Reddy Political Party: కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
Man Burnt Alive In Car: దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Crime Thriller OTT : కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Ranabaali Teaser Date : విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
Embed widget