AP Governament What Next : సిట్ విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ - ఏపీ ప్రభుత్వం ఇప్పుడేం చేయబోతోంది ?
గత ప్రభుత్వ వ్యవహారాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
AP Governament What Next : ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఇక పై సిట్ కీలకం కాబోతొంది..ప్రతి పక్షాన్నికంట్రోల్ చేసేందుకు అదికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి సిట్ అస్త్రాన్ని తెర మీదకు తెచ్చి,గత ప్రభుత్వ అవినీతిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన పాలన, నిధులు దుర్వినియోగం, రాజదాని వ్యవహరాలు పై సిట్ ను ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీని పై తెలుగు దేశం హై కోర్ట్ ను ఆశ్రయించటంతో, న్యాయస్దానం స్టే విధించింది.దీన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ సుప్రీ తలుపు తట్టింది.విచారణ అనంతరం సుప్రీం హై కోర్ట్ ఇచ్చిన స్టేను తొలగించింది. సిట్ తో విచారణ సమంజనమే అన్న అభిప్రాయాన్ని సుప్రీం వెలిబుచ్చింది.దీంతో వాట్ నెక్ట్స్ అనే అంశం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో చర్చకు తెర తీసింది.
సిట్ ఏర్పాటు పై రాజకీయం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత తొలి సారిగా జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ఐదు సంవత్సరాల పాలన లో రాజధాని అంశం కీలకంగా మారింది. రాజధాని నిర్మాణం కోసం భారీగా భూములను సేకరించారు. 33వేల ఎకారాల భూమిని తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో సేకరించారు.ఇది రికార్డ్ గా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది కూడా.అయితే భూముల సేకరణలో అవకతవకలు జరిగాయని, అవసరం లేకపోయినా భూములు సేకరించారంటూ, 2019 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది.ఈ వ్యవహరం పై నిజా నిజాలను వెలికి తీసేందుకు ప్రత్యేకంగా సిట్ టీం ను ఏర్పాటు చేయాలని భావించింది. దీని పై తెలుగు దేశం పార్టి అభ్యంతరం తెలిపింది. సిట్ ఏర్పాటు కక్ష సాధింపుచర్యల్లో భాగంగానే జరుగుతుందంటూ,హై కోర్ట్ ను ఆశ్రయిచింది. దీని పై తగ్గేదే లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడ హై కోర్ట్ తీర్పు ను సుప్రీంలో సవాల్ చేసింది.తాజాగా సుప్రీం విచారణ చేపట్టి ,సిట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వటంతో పాటుగా,హై కోర్ట్ విధించిన స్టేను ఎత్తి వేసింది.
సిట్ ఎందుకంటే..!
గత తెలుగు దేశ ప్రభుత్వ హయాంలో జరిగిన పాలనాపరమయిన అంశాలు, తీసుకున్ననిర్ణయాలు,చేసిన అభివృద్ధి పై విచారణ చేసి రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందించాలని ఆదేశిస్తూ,వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. దీని పై రాజకీయ దుమారం చెలరేగింది. తెలగు దేశం ప్రభుత్వ హయాంలో రాజాదాని భూమలు మెదలుగొని, ఐటీ పరిశ్రమల ఏర్పాటు, స్కిల్ డవలప్ మెంట్ స్కాం వంటి అంశాల పై సిట్ విచారణ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. పూర్తి స్దాయిలో విచారణ జరిపి, లోపాలు వెలుగు లోకి తీసుకువచ్చే బాధ్యతలను సిట్ కు అప్పగించాలని ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం భావించటంతో, తెలుగు దేశం హై కోర్ట్ లో పిటీషన్ ను దాఖలు చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లో కక్ష సాధింపులకు పాల్పడే చర్యలే ఎక్కువ ఉన్నాయని తెలుగు దేశం వాదించటంతో వ్యవహారం సుప్రీం వరకు వెళ్లింది.
వరుసగా కోర్ట్ వ్యవహారాలే..!
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వ్యవహారాలు కు సంబంధించి కోర్ట్ కేస్ లు ఉన్నాయి. రాజధాని అంశం....వివేకా హత్య కేసు, మార్గదర్శి ఇలా రకరకాలు గా సంచనాల కేసులు విచారణలో ఉన్నాయి.ఇలాంటి సమయంలో గత ప్రభుత్వ నిర్ణయాలపై హై కోర్ట్ స్టే ను , సుప్రీం కోర్ట్ ఎత్తివెయ్యడం తో ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది ఆసక్తి గా మారింది.