Court Summons To Jagan : 28న నాంపల్లి కోర్టుకు సీఎం జగన్ - ఏ కేసులో సమన్లు జారీ చేశారంటే?
నాంపల్లి కోర్టుకు హాజరు కావాలని సీఎం జగన్‌కు సమన్లు జారీ అయ్యాయి. 2014 హుజూర్ నగర్ ఎన్నికల ్రచారంలో నియమావళి ఉల్లంఘించారన్న కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణలో భాగంగా సమన్లు జారీ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ( CM Jagan ) నాంపల్లి ( Nampally ) ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అయితే ఇవి అక్రమాస్తుల కేసులో వచ్చిన సమన్లు కావు. 2014 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) అభ్యర్థి తరపున నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ ( Huzur Nagar ) అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేశారు ఆ సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లుగా అధికారులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా నిందితులకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
ఏపీ మండలిలో గందరగోళం, మళ్లీ చిడతలు, విజిల్స్ - 8 మంది టీడీపీ నేతల సస్పెండ్
ప్రజాప్రతినిధులపై ఉన్నకేసులను ఏడాదిలోపు తేల్చాలని గతంలో సుప్రీంకోర్టు (Supreme Court ) ఆదేశించడంతో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. నాంపల్లిలో ( Nampally Court ) ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కేసులను త్వరగా పరిష్కరిస్తోంది. ఇటీవలి కాలంలో పలువురు ప్రజాప్రతినిధులకు జరిమానాలు, శిక్షలు ఖరారు చేస్తోంది. మరికొన్ని కేసుల్లో చురుగ్గా విచారణ జరుగుతోంది. కొంత మంది ప్రజాప్రతినిధులు తమ కేసుల నుంచి బయట పడుతున్నారు. ఎక్కువగా ఎన్నికల నియమావళికి సంబంధించిన కేసులే పరిష్కారమవుతున్నాయి. ఇతర క్రిమినల్ కేసుల విచారణ చురుగ్గా సాగుతోంది.
తోపుదుర్తి, పరిటాల ఫ్యామిలీ మధ్య రంజుగా రా'జాకీ'యం
గతంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ప్రతి శుక్రవారం ( Friday ) నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత బిజీగా ఉండటం వల్ల హాజరు కావడం లేదు. ఎప్పటికప్పుడు మినహాయింపు పొందుతున్నారు. మినహాయింపు కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తులను కోర్టు అంగీకరించ లేదు. ప్రస్తుతం మినహాయింపు కోసం జగన్ పెట్టుకున్న పిటిషన్‌పై హైకోర్టులో ( TS High Court ) విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వులో ఉంది. త్వరలో తీర్పు వచ్చే అవకాశం ఉంది.
అయితే ఇప్పుడు సీఎం జగన్ ( Jagan ) ఎన్నికల నిబంధనల కేసులో సమన్లు జారీ కావడంతో ఆయన హాజరువుతారా లేదా అన్న సస్పెన్స్ నెలకొంది. ఖచ్చితంగా హాజరు కావాలని కోర్టు తీర్పు చెప్పినా...జగన్ లీగల్ టీం ఏదో విధంగా మినహాయింపు పొందుతారని భావిస్తున్నారు. సమన్లు జారీ చేసినా కోర్టుకు హాజయ్యే అవకాశం లేదంటున్నారు.