X

Fact Check: శ్రీకాకుళంలో నీలమణి అమ్మవారి దేవాలయం కూల్చివేత... టీడీపీ, జనసేన ట్వీట్... వాస్తవం ఏమిటంటే...?

శ్రీకాకుళం జిల్లాలో నీలమణి అమ్మవారి దేవాలయాన్ని కూల్చివేస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఇది అవాస్తవమని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది.

FOLLOW US: 

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని  శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి దేవాలయాన్ని కూలగొడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి. టీడీపీ, జనసేన పార్టీలు కూడా ఈ పోస్టులను తమ ఖాతాల్లో పోస్టు చేశాయి. ఈ పోస్టులపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం అవుతున్నారని స్పష్టం చేసింది. అలాగే నీలమణి దుర్గ అమ్మవారి దేవాలయ అధికారులు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. 
Fact Check: శ్రీకాకుళంలో నీలమణి అమ్మవారి దేవాలయం కూల్చివేత... టీడీపీ, జనసేన ట్వీట్... వాస్తవం ఏమిటంటే...?

నష్టపరిహారం చెల్లింపు

రైల్వే ఫ్లైఓవర్‌ పనుల్లో భాగంగా దేవాలయం ప్రహరీ గోడ, దేవాలయం ముందుభాగంలో గల ఆర్చ్‌ను తొలిగించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.  స్థానిక తహసీల్దార్‌, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌, ఆర్‌ అండ్‌ బీ, డీఈఈలతో పాటు పోలీసుల సమక్షంలో దేవాలయానికి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నట్లు ఓ ప్రకటన జారీ చేశారు. దీనికి గాను ఒక కోటి నలభై లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల నాలుగు రూపాయలను దేవాలయానికి నష్టపరిహారం మంజూరు అయినట్లు తెలిపారు. 

పత్రికా ప్రకటన జారీ చేసిన అధికారులు

ఫ్లైఓవర్ పనులు పూర్తైన తర్వాత ఫ్లై ఓవర్‌ కాంట్రాక్టర్‌తో ఆలయ నిర్మాణాలు చేయిస్తామని అధికారులు తెలిపారు. నీలమణి అమ్మవారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అక్టోబరు 23న పత్రికా ప్రకటన కూడా జారీ చేశారు. కానీ సామాజిక మాధ్యమాల్లో అమ్మవారి ఆలయాన్ని కూల్చివేస్తున్నారని వీడియో వైరల్ అయ్యాయి. వీటిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వాస్తవాలను వివరించింది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించింది. 

Also Read: మీ కలల్ని మించిన ధనవంతులు అవ్వండి.. అందుకు నిజంగా ఏం చేయొద్దు, పూర్తి వివరాలివీ..
Fact Check: శ్రీకాకుళంలో నీలమణి అమ్మవారి దేవాలయం కూల్చివేత... టీడీపీ, జనసేన ట్వీట్... వాస్తవం ఏమిటంటే...?

Also Read: అగ్గిపెట్టెల ధర పెంపు.. 14 ఏళ్ల తర్వాత రెట్టింపైన రేటు, కారణం ఏంటంటే.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: tdp janasena Viral Videos srikakulam news sri neelamani temple busted ap fact check

సంబంధిత కథనాలు

GST: జీఎస్టీ పరిహారం కింద ఏపీకి రూ.534 కోట్లు... ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం

GST: జీఎస్టీ పరిహారం కింద ఏపీకి రూ.534 కోట్లు... ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం

AP Bank Loans : ఏపీ సర్కార్ బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పు రూ.57,479 కోట్లు.. రాజ్యసభలో కేంద్రం ప్రకటన !

AP Bank Loans :  ఏపీ సర్కార్ బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పు రూ.57,479 కోట్లు.. రాజ్యసభలో కేంద్రం ప్రకటన !

Breaking News: నక్కలవాగులో విద్యార్థి గల్లంతు

Breaking News: నక్కలవాగులో విద్యార్థి గల్లంతు

Kadapa: ఇసుక లారీలను అడ్డుకున్న నందలూరు గ్రామస్తులు... ఇసుక మాఫియా కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెట్టారని ఆరోపణ

Kadapa: ఇసుక లారీలను అడ్డుకున్న నందలూరు గ్రామస్తులు... ఇసుక మాఫియా కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెట్టారని ఆరోపణ

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత... సీక్రెట్ పాకెట్ లో స్మగ్లింగ్...

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత... సీక్రెట్ పాకెట్ లో స్మగ్లింగ్...
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Tesla Car in Space: అంతరిక్షంలో వదిలిన ఎలన్ మస్క్ టెస్లా కారు ఇప్పుడు ఎక్కడుంది? భూమి వైపు దూసుకొస్తుందా?

Tesla Car in Space: అంతరిక్షంలో వదిలిన ఎలన్ మస్క్ టెస్లా కారు ఇప్పుడు ఎక్కడుంది? భూమి వైపు దూసుకొస్తుందా?

Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?

Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?

Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!

Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!

Akhanda: ప్రతీ తెలుగువాడు చూడాల్సిన సినిమా.. బాలయ్య సినిమాకి కూతురు రివ్యూ.. 

Akhanda: ప్రతీ తెలుగువాడు చూడాల్సిన సినిమా.. బాలయ్య సినిమాకి కూతురు రివ్యూ..