News
News
X

Railway Record: తగ్గేదేలే - సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డ్

2018-19 ఆర్థిక సంవత్సరం రెండో విడతలో సాధించిన 122.498 మిలియన్ టన్నుల లోడింగ్ ను అధిగమించి 8 మార్చి 2023 నాటికి 122.628  మిలియన్ టన్నుల రవాణాను దక్షిణ మధ్య రైల్వే ద్వారా చేశారు.

FOLLOW US: 
Share:

సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డ్ ను నెలకొల్పింది. 2019 రికార్డులను అధిగమిస్తూ రికార్డు స్దాయి ఆదాయాన్ని దక్కించుకుంది.
రికార్డు స్థాయి ఆదాయం 
2018-19 ఆర్థిక సంవత్సరం రెండో విడతలో సాధించిన 122.498 మిలియన్ టన్నుల లోడింగ్ ను అధిగమించి 8 మార్చి 2023 నాటికి 122.628  మిలియన్ టన్నుల అత్యుత్తమ సరుకు రవాణాను దక్షిణ మధ్య రైల్వే ద్వారా సాగించినట్లుగా అధికారులు వెల్లడించారు. జోన్ ప్రారంభమైనప్పటి నుంచి సరకు రవాణాలో  అత్యుత్తమ సేవలను అందించి రూ. 12 ,016 కోట్లు ఆర్జించింది. దక్షిణ మధ్య రైల్వే  సరుకు రవాణా లో తన మెరుగైన  పనితీరు వల్ల  వృద్ధి పథం వైపు పురోగమిస్తోందని రైల్వే శాఖ ప్రకటించింది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో జోన్  సాధించిన అత్యుత్తమ సరుకు రవాణా లోడింగ్‌ను 8 మార్చి 2023 నాటికి  అధిగమించిందని అధికారులు వెల్లడించారు. 2018-19  ఆర్థిక సంవత్సరం మొత్తంలో నమోదైన 122.498 మిలియన్ టన్నులను సరకు రవాణాను అధిగమించి 122.628 మిలియన్ టన్నుల సరుకు రవాణాను సాధించడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే ఒక  నూతన  శిఖరాన్ని అధిరోహించిట్లుగా రైల్వే అధికారులు చెబుతున్నారు. జోన్ ప్రారంభమైనప్పటి నుండి సరకు రవాణా ఆదాయంలో అత్యుత్తమ పనితీరు నమోదు చేస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో  8 మార్చి 2023 నాటికి రూ. 12 ,016 కోట్ల రాబడి  ఆర్జించిందని తెలిపారు.
సరుకు రవాణాకు అత్యధిక ప్రాధాన్యత....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, సరకు రవాణాలో వినూత్న ( టారీఫ్ మరియు నాన్ టారిఫ్ పరంగా ) చర్యల ద్వారా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పని చేస్తున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. సరుకు రవాణాను సులభంగా, వేగవంతంగా.. మరింత  సులభతరం చేయడానికి  సరకు రవాణా టెర్మినల్స్‌ పై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. దీనితో పాటు సరకు రవాణా సజావుగా సాగేందుకు ముఖ్యమైన గూడ్స్ షెడ్‌ల వద్ద మెరుగైన స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని అన్నారు. గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెరిగిన సరుకు రవాణాతో పోల్చితే అన్ని రైల్వే  జోన్లలో దక్షిణ మధ్య రైల్వే రెండవ స్థానాన్ని చేరుకోవటం మరో విశేషంగా చెబుతున్నారు.
12 శాతం అధికం...
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం సరుకు రవాణా 12% అధికంగా ఉందని వస్తువుల రవాణా పరంగా, బొగ్గు మొత్తం లోడింగ్‌కు 62.195 మిలియన్ టన్నులు అందించడం ద్వారా అతిపెద్ద విభాగంగా కొనసాగుతోందన్నారు. అంతే కాదు 31.883మిలియన్ టన్నుల  సిమెంట్‌ లోడ్‌ అవుతోందని, ఇతర ప్రధాన వస్తువులు, ఆహార ధాన్యాలు,ఇనుప ఖనిజం, కంటైనర్లు, పెట్రోలియం ఉత్పత్తులు.. ఇతర వస్తువుల లోడింగ్ కలిపి 8 .672 మెట్రిక్ టన్నుల లోడింగ్ జరిగినట్లు ప్రకటించారు. 
సిబ్బందికి ప్రశంశలు..
దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణా విభాగంలో - లోడింగ్ మరియు రాబడి రెండింటి పరంగా అత్యుత్తమ పనితీరును సాధించినందుకు  సిబ్బంది చేసిన కృషిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. ఈ అత్యుత్తమ మైలురాయిని సాధించినందుకు ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఆర్. ధనంజేయులు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జి. జాన్ ప్రసాద్, అధికారులు, సిబ్బందితో కూడిన బృందాన్ని ఆయన ప్రశంసించారు. రైల్వేల వైపు కొత్త సరకు రవాణాను ఆకర్షించేందుకు ఇదే పంథాను కొనసాగించాలని సూచించారు.

Published at : 09 Mar 2023 09:40 PM (IST) Tags: AP News Indian Railways South Central Railway Railways Transport

సంబంధిత కథనాలు

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

Ugadi Wishes: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచన

Ugadi Wishes: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచన

రైల్వే అధికారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశం - చర్చించిన అంశాలివే

రైల్వే అధికారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశం - చర్చించిన అంశాలివే

Tirupati News: శ్రీసిటీని సందర్శించిన సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్

Tirupati News: శ్రీసిటీని సందర్శించిన సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్