News
News
X

Somireddy: ఏపీలో ఆ శాఖ మూసుకుపోయింది, తెలంగాణ ఎంతో మేలు.. సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వ్యవసాయ శాఖ అధికారుల జీతాలు, రైతు భరోసాకి ఇచ్చే నిధులు తప్ప ఏపీలో వ్యవసాయ శాఖ ఇంకేమీ చేయడంలేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.

FOLLOW US: 

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవసాయ శాఖ అధికారుల జీతాలు, రైతు భరోసాకి ఇచ్చే నిధులు తప్ప ఏపీలో వ్యవసాయ శాఖ ఇంకేమీ చేయడంలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మూతపడిందని ఎద్దేవా చేశారు. కానీ, ప్రస్తుతం నేరుగా రైతులకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఆక్వా రైతులకు టీడీపీ హయాంలో యూనిట్ రూ.2 కరెంటు అందిస్తే, వైసీపీ హయాంలో రూ.3 చేశారని చెప్పారు. రైతులకు మేలు చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరు బాగుందని సోమిరెడ్డి కితాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఎకరాకి రూ.10 వేల రైతు బంధు ఇస్తోందని, అక్కడ ధాన్యం సేకరణ బాగుందని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ పథకాలన్నీ మూలనపడేసిందని ఆరోపించారు. వాటన్నిటినీ తిరిగి అమలు చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

వ్యవసాయ రంగం, రైతులకు సంబంధించిన ఏ పథకంలోనైనా జగన్ ప్రభుత్వం దేశంలో ముందంజలో ఉందా? అని నిలదీశారు. గత టీడీపీ ప్రభుత్వ హాయాంలో వ్యవసాయ అనుబంధరంగాల్లో 11 శాతం వృద్ధిరేటు నమోదైతే.. ఈ ప్రభుత్వ హయాంలో ఎంత నమోదైందో చెప్పగలదా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ‘‘ఈ రెండున్నర ఏళ్లలో జగన్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందనే ప్రశ్నకు సమాధానం లేదు. ధాన్యం కొనుగోళ్లలో అంతా దళారుల రాజ్యమైపోయి చివరకు రైతుల నోట్లో మట్టికొడుతున్నారు. వ్యవసాయమంటే  తెలియని కన్నబాబుకి వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ పదానికి అర్థం తెలియని అనిల్ కుమార్‌కు నీటిపారుదలశాఖ అప్పగించారు’’ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

‘‘టీడీపీ ప్రభుత్వం ప్రతి రైతుకి రూ.9 వేలు ఇస్తే, జగన్ రైతు భరోసా కింద దాన్ని రూ.7,500 లకే పరిమితం చేశాడు. భూసార పరీక్షలు, బిందు, తుంపర సేద్యం పరికరాల పంపిణీ, రైతులకు అందించే సూక్ష్మ పోషకాల పంపిణీని జగన్ ప్రభుత్వం మర్చిపోయింది. కేంద్ర ప్రభుత్వమే బిందు తుంపర సేద్యానికి 60 శాతం సబ్సిడీ ఇస్తుంటే కేవలం మిగతా 40 శాతం సబ్సిడీని భరించలేక సీఎం జగన్ ఆ పథకాన్ని నిలిపేశాడు’’ అని సోమిరెడ్డి ఆరోపించారు.

ఆ ధైర్యం ప్రభుత్వానికి ఉందా?
2014-15లో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.6,200లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపులను 2018-19లో రూ.18,500 కోట్లకు టీడీపీ ప్రభుత్వం పెంచింది. 2019-20లో బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.7 వేల కోట్లే ఖర్చు చేసింది. అందులోనూ సగం వ్యవసాయశాఖ ఉద్యోగుల జీతాలకే కేటాయించింది. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు టీడీపీ ప్రభుత్వం రూ.1700 కోట్లు ఖర్చుచేస్తే, జగన్ ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చుచేయలేదు. ఈ రెండున్నరేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రైతులకు జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో సమాధానం చెప్పాలి. ఆ ధైర్యం ప్రభుత్వానికి, వ్యవసాయ మంత్రికి ఉందా?’’ అని సోమిరెడ్డి సవాలు విసిరారు.

News Reels

Published at : 12 Sep 2021 08:42 PM (IST) Tags: ap govt AP News Somireddy chandramohan reddy AP aggriculture dept Telangana State

సంబంధిత కథనాలు

Gold-Silver Price 29 November 2022:  53వేల రూపాయల కంటే దిగువకు బంగారం- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

Gold-Silver Price 29 November 2022: 53వేల రూపాయల కంటే దిగువకు బంగారం- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

AP Capital Issue : ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా జగన్ పాలన ! నైతికమేనా ? సమర్థించుకోగలరా ?

AP Capital Issue : ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా జగన్ పాలన ! నైతికమేనా ? సమర్థించుకోగలరా ?

Temple for Daughter: చనిపోయిన కూతురిపై తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే ! గుడి కట్టి పూజలు

Temple for Daughter: చనిపోయిన కూతురిపై తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే ! గుడి కట్టి పూజలు

AP Police Constable Notification: ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!

AP Police Constable Notification: ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Men Suicide: పాపం మగ మహారాజులు - కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఏడ్వనివ్వండి !

Men Suicide: పాపం మగ మహారాజులు - కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఏడ్వనివ్వండి !