Skill Scam Case: స్కిల్ స్కాం కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ, డిజైన్ టెక్ డిపాజిట్లు జప్తు
Skill Scam Case: చంద్రబాబు హయాంలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది.
Skill Scam Case: గత ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు డిజైన్ టెక్ కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్ డ్ డిపాజిట్లను శుక్రవారం జప్తు చేసింది. ఇదే కేసులో మార్చి నెల 10 వ తేదీన నలుగురిని అరెస్ట్ చేసింది. విశాఖ స్పెషల్ కోర్టులో నలుగురినీ హాజరుపర్చిన ఈడీ... కోర్టు ఆదేశాలతో జ్యుడిషియల్ రిమాండ్‌ను తరలించింది. ఈ కేసులో సిమెన్స్ మాజీ ఎండీ శేఖర్ బోస్ సహా నలుగురు అరెస్ట్ అయ్యారు. డీజీ టెక్ ఎండీ వికాస్ వినాయక్, పీపీఎస్‌పీ ఐటీ స్కిల్స్ ప్రాజెక్ట్ సీవోవో ముకుల్‌చంద్ర అగర్వాల్, ఎస్‌ఎస్‌ఆర్ అసోసియేట్స్ సురేష్ గోయల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
స్పీడ్ పెంచిన సీఐడీ
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో సీఐడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. కేసు విచారణలో భాగంగా సీమెన్స్ ఇండస్ట్రీయల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ ను ఏపీ సీఐడీ పోలీసులు యూపీలోని నోయిడాలో ఇటీవల అరెస్ట్ చేశారు. బుధవారం ఏపీ సీఐడీ నోయిడాలోని ఆయన నివాసానికి వెళ్లి భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా.. విజయవాడలోని కోర్టులో హాజరు పరిచేందుకుగానూ 36 గంటల సమయం ట్రాన్సిట్ రిమాండ్ విధించారు.
ప్రాజెక్ట్ అంచనాలు తారుమారు
అవగాహన ఒప్పందం ప్రకారం తారుమారు
సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టెక్నాలజీ అందిస్తున్న పార్ట్ నర్ ఈ ప్రాజెక్ట్ ఖర్చులో 90 శాతం వాటాను అందించాలని భావించారు. కానీ భాస్కర్, మరికొందరు నిందితులు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో కలిసి, అవగాహన ఒప్పందాన్ని తారుమారు చేయడానికి కుట్ర చేసినట్లు సీఐడీ ఆరోపిస్తోంది. మరోవైపు ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకున్నా, ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారని సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. సిమెన్స్ + డిజైన్‌టెక్ షెల్ కంపెనీలకు రూ.371 కోట్ల పనులు అప్పగించినట్లు ఒప్పందం జరిగింది. అయితే టెక్ సపోర్ట్ అందించే కంపెనీలు ప్రాజెక్టులో 90 శాతం మేర వాటాను భరించాలని సైతం నిర్ణయించారు. అనంతరం ఈ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. తాజాగా డిజైన్ టెక్ కు చెందిన డిపాజిట్లను ఈడీ జప్తు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.