YS Sharmila: భారతిరెడ్డి, జగన్ క్షమాపణ చెప్పాలి - అమరావతి ఇష్యూలో షర్మిల డిమాండ్
Amaravati: అమరావతి మహిళల్ని కించపరిచిన వ్యవహారంలో జగన్, భారతి రెడ్డి క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. అలా చెప్పడంలో తప్పేం లేదన్నారు.

Sharmila demands apology from Jagan and Bharathi Reddy: అమరావతి వేశ్యల రాజధాని కామెంట్స్ మీద భారతి రెడ్డి, జగన్ బాధ్యత వహించాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తిరుపతిలో డిమాండ్ చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదని షర్మిల అన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి అని ..మన రాజధాని మీద ఇలాంటి కామెంట్స్ ఎవరు చేసినా క్షమించారని నేరమనని స్పష్టం చేశారు. వేశ్యల రాజధాని అనడం బేస్ లెస్ అండ్ సెన్స్ లెస్ అన్నారు.
గత 10 ఏళ్లుగా ఇప్పటి వరకు రాజధాని లేదని.. అమరావతి మన రాజధాని అని నిర్మించుకునే సమయంలో వ్యతిరేకంగా మాట్లాడటం క్షమించరానిదన్నారు. . వేశ్యల రాజధాని అనే వాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని ఇలాంటి మాటలని ఉపేక్షించలేమన్నారు. ఇలాంటి పొరపాటు జరిగినందుకు ఎవరైనా క్షమాపణ చెప్పాలన్నారు. YCP పార్టీకి చెందిన సాక్షి చానెల్ లో ప్రసారం చేసినందుకు సాక్షి క్షమాపణ చెప్పాల్సిందేన్నారు. సాక్షి మీడియాను నడుపున్న భారతి రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు.
భారతి రెడ్డి క్షమాపణ చెప్పడంలో తప్పు లేదని.. నామోషీ చెందాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. జగన్ కూడా క్షమాపణ చెప్పాలన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతీశారు.. మహిళల మనోభావాలు దెబ్బతీసి నందుకు క్షమాపణ చెప్పడంలో ఎందుకు జగన్ వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి నీచపు కామెంట్స్ రాజధాని అమరావతి మీద ఎలాంటి ఎఫెక్ట్ పడవని ధీమా వ్యక్తం చేశారు.
వేశ్యల రాజధాని అంటూ అమరావతిపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం - వైఎస్ షర్మిల
— Telugu Stride (@TeluguStride) June 9, 2025
ఏపీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇప్పటివరకు వైసీపీ, సాక్షి మీడియా క్షమాపణ చెప్పలేదు. భారతీ రెడ్డి క్షమాపణ చెప్పడం ఆమె బాధ్యత. జగన్ క్షమాపణ చెప్పడంలో తప్పులేదు - షర్మిల.#APPCC… pic.twitter.com/Z2RBN3v3XJ
అమరావతి మహిళలపై వ్యాఖ్యల కేసు ఏమిటంటే ?
ఓ టీవీ ఛానెల్‌లో డిబేట్ సందర్భంగా అమరావతి వేశ్యల రాజధాని అని యాంకర్ గా ఉన్న కొమ్మినేని, వ్యాఖ్యతగా ఉన్న కృష్ణంరాజు అనే వ్యక్తి చర్చించారు. రాజధాని ప్రాంతంపై, అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దళిత మహిళలను అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద తాడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షి టీవీపై సైతం కేసు నమోదు అయింది. మహిళలపై అనుచిత వ్యాఖల చేసిన కేసులో కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్, సాక్షి యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. 79, 196(1), 353(2), 299, 356(2), 61(1)BNS, 67 ITA-2008, 3(1)(U), SC, ST POA Act సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయనను హైదరాబాద్‌లో ఇంటి వద్ద అరెస్టు చేసి తుళ్లూరు తరలించారు. ఏపీ వ్యాప్తంగా మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.





















