అన్వేషించండి

Mudragada: నాకు కేన్సర్ లేదు - నన్నెవరూ బంధించలేదు - కుమార్తెపై ముద్రగడ ఆగ్రహం

Mudragada Family: అనారోగ్యానికి చికిత్స చేయించడం లేదని కుమార్తె చేసిన ఆరోపణలను ముద్రగడ ఖండించారు. తన కుమారుడి వల్లనే ఆరోగ్యంగా ఉన్నానన్నారు.

Mudragada denies daughter allegations:  ముద్రగడ పద్మనాభం తన కుమార్తె కుటుంబంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ లేఖ విడుదల చేసిన ఆయన కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా   మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తోందని ఆరోపించారు. తన కుమార్తె  కుటుంబానికి, మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్దలు వచ్చాయని..  ఒక సంవత్సరము నుండి పూర్తిగా అన్ని రకాల రాకపోకలు బంధ్ అయ్యాయని ముద్రగడ తెలిపారు.  వారి జోలికి నేను వెళ్ళడం లేదు, అయినా మమ్ములను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.  కారణం మా చిన్నాబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగలిపోతున్నారని ఆరోపించారు. 

నాకు కేన్సర్ వచ్చిందని ఇంట్లో బందించి చిన్న కొడుకు, వారి మామగారు పట్టించుకోవడం లేదని బాధాకరమైన మాటలు అంటున్నారన్నారు.  ఈ రోజు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్నకొడుకే 100-1000 శాతం కారణం అని చెబుతున్నానని స్పష్టం చేశారు.  రోజు అన్ని సేవలు నాకు చేయకుండా గిరి బయటకు వెళ్లడన్నారు.  గతంలో నా భార్యకు తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు హైద్రాబాద్ హాస్పటల్లో ఆపరేషన్ చేయించుకుని సుమారు 15 రోజులు తరువాత హాస్పటల్ నుండి విశ్రాంతి కోసం మీ ఇంటికి వస్తే ఇంటి నుండి బయటికి పంపిన సంగతి మీ ఇరువురూ మరిచారా అని ముద్రగడ ప్రశ్నించారు. 

ఇప్పుడు మీ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.... నాకు వయస్సు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవన్నారు.  నేను పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నానని..  నిత్యం నా ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నానని తెలిపారు.  నన్ను బంధించి ఉంచడం కాని, మానసికంగా హింసించడం కాని ఎవ్వరి తరం కాదని తెలియజేస్తున్నానని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ జీ.వోలపై ఆ కుటుంబం వారు సలహా ఇచ్చామని అంటున్నారని  మీకు అంత దమ్ము ఉంటే కాపు రిజర్వేషన్ మరియు ముఖ్యమంత్రి గారు ఎన్నికలలో ఇచ్చిన హామీలను, సూపర్ సిక్స్ పధకాలును అమలు చేయించి మీ డబ్బా కొట్టుకోండని సలహా ఇచ్చారు.  నిజంగా అదే నిజమైతే రాష్ట్ర ముఖ్యమంత్రిని, లోకేష్ బాబుని, మరియు ఉప ముఖ్యమంత్రిని చూసి జాలి పడుతున్నానన్నారు. ఇకనైనా మీ అపాయింట్మెంట్లు, చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి బ్రతక్కండనిలేఖలో పేర్కొన్నారు.  

ఇటీవల ముద్రగడ పద్మనాభం కుమార్తె బర్లగడ్డ క్రాంతి  .. తన తండ్రి అనారోగ్యంతో  బాధపడుతున్నా సరిగ్గా చికిత్స చేయించడం లేదని ట్వీట్ పెట్టారు. ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తన తండ్రి వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా తన సోదరుడు గిరి.. ఆయన మామ అడ్డుకున్నారని ఆరోపించారు.   దీనికి ప్రతిస్పందనగా ముద్రగడ ఈ లేఖ రాశారు. 

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Tirumala Darshan Tickets: తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల షెడ్యూల్‌ ప్రకటించిన టీటీడీ
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల షెడ్యూల్‌ ప్రకటించిన టీటీడీ
Missing Fishermen Safe: క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ భూ సమీకరణపై కేసు దాఖలు.. అడ్డంకులపై రైతులు తీవ్ర ఆగ్రహం
అమరావతి రెండో దశ భూ సమీకరణపై కేసు దాఖలు.. అడ్డంకులపై రైతులు తీవ్ర ఆగ్రహం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Jagapathi Babu : వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Embed widget