Sankranti Special Trains: రైల్వే ప్రయాణికులుకు శుభవార్త- సంక్రాంతికి మరో 6 ప్రత్యేక రైళ్లు వేసిన SCR
SCR to run Sankranti Special Trains: సంక్రాంతి పండుగకి ప్రయాణికుల రద్దీ, డిమాండ్ దృష్టిలో ఉంచుకుని తాజాగా మరో 6 రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయిచింది.
Sankranti Special Trains News in Telugu: సంక్రాంతి పండుగకి ఊరెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇదివరకే ప్రత్యేక రైళ్లను SCR ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ దృష్టిలో ఉంచుకుని తాజాగా మరో 6 రైళ్లను నడపాలని నిర్ణయిచింది. ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, తిరుపతి, కాకినాడల మధ్య సంక్రాంతి పండుగ సమయంలో జనవరి 10 నుంచి 15 తేదీల్లో సేవలు అందిస్తాయి.
తాజాగా ప్రకటించిన 6 ప్రత్యేక రైళ్ల వివరాలివే..
- సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ రైలు (07056) జనవరి 11న రాత్రి 7గంటలకు బయల్దేరి 12న రోజు ఉదయాన 6.45 గంటలకు కాకినాడకు చేరుతుంది
- తిరుపతి - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07055) జనవరి 10న రాత్రి 8.25 గంటలకు బయల్దేరి 11న ఉదయం 9.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది.
- కాకినాడ - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07057) జనవరి 12వ తేదీ రాత్రి 9 గంటలకు కాకినాడ టౌన్లో బయలుతేరగా.. 13న ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ చేరనుంది.
- కాకినాడ టౌన్ - తిరుపతి ప్రత్యేక రైలు (07072) జవనరి 14న ఉదయం 10గంటలకు బయలుదేరితే.. అదే రోజు రాత్రి 8.20 గంటలకు తిరుపతి చేరాల్సి ఉంది
- సికింద్రాబాద్- కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07071) జనవరి 13న రాత్రి 9 గంటలకు బయలుదేరితే 14న ఉదయం 8.30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరనుంది.
- తిరుపతి -కాచిగూడ ప్రత్యేక రైలు (02707) జనవరి 15న తెల్లవారుజామున 5.30 గంటలకు తిరుపతిలో బయలుదేరగా.. అదేరోజు సాయంత్రం 5 గంటలకు కాచిగూడకు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
రైళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం https://www.irctc.co.in/nget/train-search క్లిక్ చేయండి.
- ట్రైన్ నెంబర్ 07089 సికింద్రాబాద్- బ్రహ్మపుర్ - జనవరి 7, 14 తేదీలు
- ట్రైన్ నెంబర్ 07090 బ్రహ్మపుర్ - వికారాబాద్ - జనవరి 8, 15 తేదీలు
- ట్రైన్ నెంబర్ 07091 వికారాబాద్- బ్రహ్మపుర్ - జనవరి 9, 16 తేదీలు
- ట్రైన్ నెంబర్ 07092 బ్రహ్మపుర్ - సికింద్రాబాద్ - జనవరి 10, 17 తేదీలు
- ట్రైన్ నెంబర్ 08541 విశాఖ - కర్నూలు సిటీ - జనవరి 10, 17, 24 తేదీలు
- ట్రైన్ నెంబర్ 08542 కర్నూలు సిటీ - విశాఖ - జనవరి 11, 18, 25 తేదీలు
- ట్రైన్ నెంబర్ 08547 శ్రీకాకుళం - వికారాబాద్ - జనవరి 12, 19, 26 తేదీలు
- ట్రైన్ నెంబర్ 08548 వికారాబాద్ - శ్రీకాకుళం - జనవరి 13, 20, 27 తేదీలు
- ట్రైన్ నెంబర్ 02764 సికింద్రాబాద్ - తిరుపతి - జనవరి 10, 17 తేదీలు
- ట్రైన్ నెంబర్ 02763 తిరుపతి - సికింద్రాబాద్ - జనవరి 11, 18 తేదీలు
- ట్రైన్ నెంబర్ 07271 సికింద్రాబాద్ - కాకినాడ - జనవరి 12 తేదీ
- ట్రైన్ నెంబర్ 07272 కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ - జనవరి 13 తేదీ
- ట్రైన్ నెంబర్ 07093 సికింద్రాబాద్ - బ్రహ్మపూర్ - జనవరి 8, 15 తేదీలు
- ట్రైన్ నెంబర్ 07094 బ్రహ్మపూర్ - సికింద్రాబాద్ - జనవరి 9, 16 తేదీలు
- ట్రైన్ నెంబర్ 07251 నర్సాపూర్ - సికింద్రాబాద్ - జనవరి 10 తేదీ
- ట్రైన్ నెంబర్ 07052 సికింద్రాబాద్ - నర్సాపూర్ - జనవరి 11 తేదీ