అన్వేషించండి

MLA Koneti Adimulam: నారా లోకేష్‌తో సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే భేటీ - జగన్ ఎంపీ టిక్కెట్ ఇచ్చినా టీడీపీ వైపు మొగ్గు !

YSRCP : తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కోనేటి ఆదిమూలం నారా లోకేష్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆయన సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నారు.


MLA Koneti Adimulam: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన  సత్యవేడు ఎమ్మెల్యే, తిరుపతి నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో సమావేశం అయ్యారు.  తిరుపతి జిల్లా సత్యవేడు (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన అధికార వైసీపీకి చెందిన శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం.. ఈ మధ్యే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారు.  మంత్రి పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి దళితులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, వారికి ఇష్టానుసారంగా షరతులు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

టీడీపీలో చేరేందుకు కోనేటి ఆదిమూలం రెడీ                                   

ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సిద్ధమయ్యారు. నారా లోకేష్‌తో కోనేటి ఆదిమూలం, ఆయన తనయుడు సమావేశం అయ్యారు. మరో రెండు, మూడు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని అనుచరులు చెబుతున్నారు. ఇ సీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే సీటు కాకుండా ఎంపీ స్థానాన్ని ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న ఆదిమూలం.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. పార్టీలో కనీస గౌరవం ఇవ్వలేదని.. జిల్లా రెడ్లుదే రాజ్యం అంటూ విమర్శలు గుప్పించారు. సత్యవేడు టిక్కెట్‌ను  తిరుపతి ఎంపీ గురుమూర్తికి కేటాయించారు. 

మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారశైలిపై రిజర్వుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల అసహనం                   

 సీఎం వైఎస్‌ జగన్‌, మంత్రి రామచంద్రారెడ్డి   పట్టించుకోకుండా తిరుపతి (ఎస్సీ) లోక్‌సభ స్థానానికి మార్చి తనను మోసం చేశారనేది కోనేటి ఆదిమూలం ప్రధాన ఆరోపణ.  రోజా, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అన్యాయం చేయగలరా? అని ప్రశ్నింారు.   తనపై జగన్ మోహన్ రెడ్డికి ప్రతికూల నివేదికను రామచంద్రారెడ్డి అనుచరులు సిద్ధం చేశారని ఆరోపించారు.   

ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు                                                       

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు రిజర్వుడు స్థానాల్లో గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అయితే మూడు స్థానాల్లోనూ ఈ సారి అభ్యర్థుల్ని మార్చారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని కూడా చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్న రెడ్డప్పకు ఆయన స్థానం కేటాయించారు. గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల్ని మార్చారు. ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు టిక్కెట్ నిరాకరించడంతో ఆయన కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  దళితులంటే వైసీపీకి చిన్న చూపని మండిపడ్డారు. 

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. సెప్టెంబర్‌లోనే పోలింగ్? క్షేత్రస్థాయిలో కూటమి స్పీడ్!
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. సెప్టెంబర్‌లోనే పోలింగ్? క్షేత్రస్థాయిలో కూటమి స్పీడ్!
Breaking News: పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
Jagan 2.0 Super App Launched: వైసీపీ కార్యకర్తల కోసం సూపర్ యాప్ - ఆవిష్కరించిన జగన్ - ఇది ఎందుకంటే ?
వైసీపీ కార్యకర్తల కోసం సూపర్ యాప్ - ఆవిష్కరించిన జగన్ - ఇది ఎందుకంటే ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget