By: ABP Desam | Updated at : 18 Dec 2022 04:20 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
పవన్ కల్యాణ్
Pawan Kalyan : వైసీపీపై మరోసారి విరుచుకుపడ్డారు జనసేనాని పవన్ కల్యాణ్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌతు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. అనంతరం మాట్లాడిన పవన్... వారాహితో ఏపీలో తిరుగుతా, దమ్ముంటే అడ్డుకునే ప్రయత్నం చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవట్లేదని, గెలవనివ్వమన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే మాటకు కట్టుబడి ఉన్నానని పవన్ స్పష్టం చేశారు. ఏపీలో ఏ జిల్లాలోనూ రైతులు సంతోషంగా లేరని పవన్ కల్యాణ్ ఆవేదన చెందారు. రైతు కంటతడి పెట్టిన నేల సుభిక్షంగా ఉండదన్నారు. అన్నదాతల కష్టాలను పట్టించుకునే నేతలు, అధికారులు లేరన్నారు. ప్రజలను బెదిరించటానికి, ప్రతిపక్షాల సభలను అడ్డుకోవటానికి మాత్రమే వైసీపీ నేతలు, అధికారులు వస్తారని మండిపడ్డారు.
వైసీపీ అధికారంలోకి రావటం లేదు.. జనసేన గెలుపు ఎవరు ఆపలేరు - JanaSena Chief Sri @PawanKalyan #JanaSenaRythuBharosaYatra pic.twitter.com/QMtHuGlXb6
— JanaSena Party (@JanaSenaParty) December 18, 2022
ఒక్కరోజు వస్తేనే తట్టుకోలేకపోతున్నారు
ఎన్నికలు దగ్గరికి వస్తుండడంతో వైసీపీ నేతలు అవినీతి హాలీడే ప్రకటించారని పవన్ కల్యాణ్ విమర్శించారు. తనను వీకెండ్ పొలిటీషయన్ అంటున్నారని, కాపు నాయకులతో పచ్చి బూతులు తిట్టిస్తున్నారన్నారు. ఏపీలో తానేలా పర్యటిస్తానో అంటూ వైసీపీ గాడిదలు ఓండ్ర పెడుతున్నాయని ఎద్దేవా చేశారు. వారానికి ఒక్కరోజు వస్తేనే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. తనకు తాతలు సంపాదించిన రూ.వేల కోట్లు లేవన్నారు. అక్రమాలు, దోపిడీలు చేసిన డబ్బు తన దగ్గర లేదన్నారు. తన కష్టార్జితంతో రైతులకు సాయం చేస్తున్నానని పవన్ తెలిపారు.
అంబటి కాపుల గుండెల్లో కుంపటి
సత్తెనపల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబుపై పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటి అంటూ విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలవనివ్వమన్నారు. వైసీపీ అధికారంలోకి రాకుండా చేసే బాధ్యత ప్రజలదన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే మాటకు నేటికీ కట్టుబడి ఉన్నానన్నాకుయ. బీజేపీ, టీడీపీకి అమ్ముడుపోయే ఖర్మ తనకులేదన్నారు. వైసీపీ నేతల్లా పింఛన్లు, బీమా సొమ్ములో కమీషన్లు కొట్టే రకం కాదన్నారు. అక్రమాలు చేసే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యతిరేక శక్తులను ఏకం చేస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
జనసేనలో చేరికలు
అంతకు ముందుకు మంగళగిరి జనసేన కార్యాలయంలో పలువురు వైసీపీ నేతలు జనసేనలో చేరారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. రాజోలు నియోజకవర్గానికి చెందిన బొంతు రాజేశ్వరరావు తన అనుచరులతో కలసి జనసేన కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. పి. గన్నవరం నియోజకవర్గం నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్మూరు కొండలరావు, విజయనగరం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త గురాన అయ్యల పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో జనసేన బలోపేతానికి నూతనంగా చేరిన నాయకులు కృషి చేయాలని పవన్ కోరారు.
విజయవాడలో గురువారం బుక్ ఫెస్టివల్ ప్రారంభం, 250 స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు
Manyam District: మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత - ఆగ్రహంతో ఎంఈవో, హెచ్ఎంల నిర్బంధం
Visakhapatnam Police: భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని కాలినడకన భర్త ప్రయాణం - సాయం చేసిన పోలీసులు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Breaking News Live Telugu Updates: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి