అన్వేషించండి

Sajjala On Fake Votes : ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లు - చంద్రబాబు మాటలకు పురందేశ్వరి వత్తాసు పలుకుతున్నారని సజ్జల విమర్శలు !

ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వాటిని తొలగించాలా వద్దా అని ఆయన ప్రశ్నించారు.


Sajjala On Fake Votes :  ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్ల విషయంలో  తెలుగుదేశం పార్టీ నేతలు దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీలో తొలగించిన ప్రతి ఓటుపై నిశిత పరిశీలన జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది.  ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడారు. ఈసీ చంద్రబాబు కనుసన్నల్లో పని చేస్తుందా అని ప్రశ్నించారు.  ఓట్ల తొలగింపుపై టీడీపీది తప్పుడు ప్రచారమని ..   టీడీపీ అసలు స్వరూపం అందరికీ తెలిసిందేనన్నారు.

ఏపీలో ఇంకా లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు                            

ఏపీలో అరవై లక్షలకుపైగా దొంగ ఓట్లు ఉన్నాయన్నారు.  లక్షల దొంగ ఓట్లు ఇంకా ఉన్నాయని.. వీటన్నిటినీ ఎన్నికల కమిషన్ తొలగిస్తే ప్రజా తీర్పు కచ్చితంగా వస్తుందని మా నమ్మకమని ఆయన చెప్పుకొచ్చారు.  కుప్పం నియోజకవర్గంలో 30 వేల దొంగ ఓట్లు బయట పడ్డాయన్నారు.  దొంగ ఓట్ల వ్యవహారంలో చంద్రబాబుకు భయం పట్టుకుందని.. టీడీపీ అన్యాయంగా తీసేయించిన ఓట్లను మేము చేర్పించుకుంటామని ఆయన చెప్పారు.  గతంలో చంద్రబాబు ఒకే ఇంటి నెంబర్ మీద 770 ఓట్లను చేర్పించారని ఆరోపించారు.  ఉరవకొండలో ఓట్ల తొలగింపులో చేసిన ప్రొసీజర్ సరిగా లేనందునే  అధికారులను సస్పెండ్ చేశారని... అంతేకానీ ఓట్లను తొలగించారని కాదని సజ్జల చెప్పుకొచ్చారు. 

గతంలో జరిగిన తప్పుల్ని సరి చేస్తున్నామన్న సజ్జల                              

టీడీపీ గతంలో చేసిన తప్పులను తాము సరి చేస్తున్నామని సజ్జల చెప్పారు.  గతంలో వ్యవస్థలను మేనేజ్‌ చేసి ఓటర్ల జాబితాలో అక్రమాలు చేశారన్నారు.  వైఎస్సార్‌సీపీ ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరిస్తోంది. టీడీపీకి తెలిసిందల్లా అడ్డదారులు తొక్కడమే. టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారు.. ఆయన తన విద్యలను అఖిల భారత స్థాయిలోనూ ప్రదర్శించారని విమర్శఇంచారు.   టీడీపీలో గతంలో అన్యాయంగా తొలగించిన ఓట్లను చేర్పించాం. ఉరవకొండలో అక్రమాలంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. గతంలో  ఓ యాప్ ను తయారు చేసి  టీడీపీ కార్యకర్తల చేతిలో పెట్టి వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించారని సజ్జల ఆరోపించారు.       

చంద్రబాబు మాటలకు పురందేశ్వరి వత్తాసు పలుకుతున్నారన్నసజ్జల                                                           

వైసీపీ అనుకూలం అనుకున్న వారందరి ఓట్లనూ  తొలగించారు. ఎంతో పోరాటం చేసి మళ్ళీ కొంతవరకు మా ఓట్లను చేర్పించుకోగలిగామని..తెలిపారు.  లక్షన్ కమిషనర్‌ని చంద్రబాబు అప్పట్లో బెదిరించారు. అలాంటి పనులు మేము చేయాల్సిన పని మాకు లేదు. ఇంత సంక్షేమ కార్యక్రమాలు చేసే మేము భయపడాల్సిన పనిలేదన్నారు.   చంద్రబాబు  మాటలకు  పురందేశ్వరి  వత్తాసు  పలుకుతున్నారని  విమర్శించారు.    

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Letter to Revanth Reddy: పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Mudragada Padmanabham Funeral Chaos: ముద్రగడ అంత్యక్రియల్లో గందరగోళం - గన్ సెల్యూట్ ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
ముద్రగడ అంత్యక్రియల్లో గందరగోళం - గన్ సెల్యూట్ ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
Chandra Babu Comments:
"సముద్రంలోకి వెళ్లే జలాలు వాడుకుంటే సంపద సృష్టి జరిగినట్టే! నదుల అనుసంధానంతో కరవు పరార్‌" ముఖ్యమంత్రి చంద్రబాబు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Embed widget