News
News
వీడియోలు ఆటలు
X

YSRCP News : 3 ఎమ్మెల్సీలతో సీఎం అయినట్లుగా చంద్రబాబు పగటి కలలు - ప్రజలు జగన్ వెంటే ఉన్నారన్న సజ్జల !

ప్రజలు జగన్ వెంటే ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు మళ్లీ సీఎం అవ్వరన్నారు.

FOLLOW US: 
Share:

Sajjala :      సీఎం జగన్‌ అట్టడుగు వర్గాలను అభివృద్ధిలోకి తెస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేక కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడురు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  జీరో మార్కులు సంపాదించుకున్న చంద్రబాబు జగన్‌కు 100 మార్కులు ఎందుకు రాలేదు? అని ప్రశ్నిస్తున్నారని..  3 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినందుకే 2024 అసెంబ్లీ ఎన్నికలు గెలిచి సీఎం అయినట్లుగా చంద్రబాబు ఫీల్‌ అవుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మోసానికి, వెన్నుపోటుకు ట్రేడ్‌ మార్క్‌  అని.. చెప్పిన మాటపై నిలబడటం, చెప్పని హామీలను కూడా అమలుచేయటం జగన్‌ ట్రేడ్‌ మార్క్‌ అన్నారు.                        

రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో అభివృద్ధివైపు తీసుకువెళ్లడానికి సీఎం జగన్‌ కృషిచేస్తున్నారని.. రాష్ట్రంలో అవినీతికి స్థానం ఉండకూడదని, పాలన పూర్తి పారదర్శకంగా ఉండాలని జగన్‌ భావిస్తారని సజ్జల తెలిపారు. చంద్రబాబును ఎప్పుడెప్పుడు సీఎం చేద్దామా అని ఎల్లోమీడియా ఉవ్విళ్లూరుతోందని మండిపడ్డారు.  అందుకు అనుగుణంగానే చంద్రబాబుకు ఎలివేషన్లు ఇస్తూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారని ారోపించారు.  చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో ఎల్లోమీడియాతో విపరీతంగా ప్రచారం చేయించుకుంటారు.. ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రజలను అభివృద్ధి అనే భ్రమలో ఉంచి తన కోటరీలోని  నాయకులకు మాత్రమే లబ్ధి చేకూర్చే వారన్నారు. చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడు ఫలానా ప్రాజెక్టు కట్టాను అని చెప్పుకోవడానికి ఏదీలేదన్నారు.                    

సీఎం జగన్‌ శాచురేషన్‌ మోడ్‌లో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని..   చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టిడ్కో ఇళ్లు ఎందుకు పూర్తిచేయలేదని సజ్జల ప్రశఅనించారు.   ఇప్పుడు సీఎం జగన్‌ చంద్రబాబు పెట్టిన రూ.8,000 కోట్లు బకాయిలు చెల్లించి, అసంపూర్తిగా వదిలేసిన టిడ్కో ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తుంటే వాటిముందు సెల్ఫీలు తీసుకుని బిల్డప్‌ ఇస్తున్నాడని ఆరోపించారు.  చంద్రబాబు చేపట్టిన అమరావతి నిర్మాణం ఒక రియల్‌ ఎస్టేట్‌ స్కాం అన్నారు.  చంద్రబాబుకు చేసింది చెప్పుకోవటానికి ఏమీలేదని విమర్శించారు.  2024 ఎన్నికల్లో సింగిల్‌గా పోటీచేస్తానని చెప్పే దమ్ములేదన్నారు. 

 చంద్రబాబుకు తెలిసినన్ని టక్కుటమార విద్యలు మాకు తెలియదని..  టీడీపీ, ఎల్లోమీడియా మళ్లీ తోడేళ్ల మందలా ప్రజల మీదపడబోతున్నాయన్నారు.  ఆ దుష్టశక్తుల ప్రభావం ప్రజలపై పడకుండా ప్రభుత్వం ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తు చేశారు.  టీడీపీ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదన్నారు.  2014–19 మధ్య టీడీపీ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు ఎప్పటికీ గుర్తుండాలని సజ్జల తెలిపారు.  అప్పుడే చంద్రబాబు మళ్లీ సీఎం కాకూడదు అనే స్పృహ ఉంటుందన్నారు.  సీఎం జగన్‌ నాయకత్వం రాష్ట్రానికి శాశ్వతంగా ఉండాలనే బడుగు, బలహీన వర్గాల విశ్వాసం 2024 ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించాలన్నారు.  వైఎస్సార్సీపీ చేపట్టిన మిస్డ్‌కాల్‌ ప్రోగ్రామ్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అయిందని... సీఎం వైఎస్‌ జగన్‌ బడుగు, బలహీన వర్గాలను ప్రోత్సహిస్తూ మెజారిటీ పదవులు ఇచ్చారని తెలిపారు.  

Published at : 12 Apr 2023 04:47 PM (IST) Tags: Sajjala Ramakrishna Reddy CM Jagan AP Govt

సంబంధిత కథనాలు

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

Coromandel Train Accident : ఒడిశా ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు

Coromandel Train Accident : ఒడిశా  ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

టాప్ స్టోరీస్

Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదం ఎలా జరిగింది? సమాచార లోపమే ప్రాణాలు తీసిందా?

Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదం ఎలా జరిగింది? సమాచార లోపమే ప్రాణాలు తీసిందా?

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Hyderabad Metro News: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ - టాయిలెట్లు వాడితే డబ్బులు చెల్లించాల్సిందేనట!

Hyderabad Metro News: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ - టాయిలెట్లు వాడితే డబ్బులు చెల్లించాల్సిందేనట!

Adipurush Movie: తెలుగులో ఆ తప్పులేంటి? 'ఆదిపురుష్' దర్శకుడిపై నెటిజెన్స్ సెటైర్లు

Adipurush Movie: తెలుగులో ఆ తప్పులేంటి? 'ఆదిపురుష్' దర్శకుడిపై నెటిజెన్స్ సెటైర్లు