అన్వేషించండి

Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన

AP Elections 2024: చంద్రబాబు నాయుడు సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన సంగతి తెలిసిందే. దానికి ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Sajjala Ramakrishna Reddy Counters Chandrababu Naidu: పులివెందులో నామినేషన్ సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్రంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికార విపక్ష నేతలు ఒకరిపై మరొకరు కౌంటర్ ఎటాక్ లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణా రెడ్డి కూడా స్పందించారు. తొలుత గురువారం (ఏప్రిల్ 25) జరిగిన అక్కడి బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వివేకా హత్య కేసుతో పాటు తనకు వ్యతిరేకంగా మారిన తన చెల్లెళ్లు షర్మిల, సునీతపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఓ రకంగా తన చెల్లెళ్లు ఇంత కాలం తనపై వ్యతిరేకంగా చేస్తూ వస్తున్న దుష్ర్పచారానికి సీఎం కౌంటర్ ఇచ్చారు. వైఎస్ షర్మిల పసుపు చీర కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్లిందని జగన్ అన్నారు. పసుపు చీర కట్టుకుని వైఎస్ వ్యతిరేకులు చేసే కుట్రలో భాగమైన వీళ్లా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులు అని మండిపడ్డారు. వివేకా కేసులో అవినాష్‌ రెడ్డి ఏ తప్పు చేయలేదని తాను నమ్మాను కాబట్టే టికెట్‌ ఇచ్చానని అన్నారు.

అయితే, షర్మిలపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా.. మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా? ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం?’’ అని చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. అటు నారా లోకేశ్ కూడా ఎక్స్ ద్వారా జగన్ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు.

తాజాగా చంద్రబాబు స్పందించిన తీరుపైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘‘వైఎస్ జగన్ రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే.. చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే చంద్రబాబు మీరు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోంది. మీరు పెట్టిన ట్వీట్ చూస్తే చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది’’ అని సజ్జల రామక్రిష్ణా రెడ్డి పోస్ట్ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

KRMB Letter: శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల అసలు అనుమతుల వివరాలివ్వండి.. తెలంగాణ, ఏపీలకు కేఆర్‌ఎంబీ లేఖ
శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల అసలు అనుమతుల వివరాలివ్వండి.. తెలంగాణ, ఏపీలకు కేఆర్‌ఎంబీ లేఖ
ఈ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం.. మత్స్యకారులకు హెచ్చరిక
ఈ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం.. మత్స్యకారులకు హెచ్చరిక
Father Name Rule: ప్రభుత్వ రికార్డుల్లో తండ్రి పేరు తప్పనిసరి నిబంధన తొలగించాలి.. ఏపీ బాలల హక్కుల కమిషన్ డిమాండ్
ప్రభుత్వ రికార్డుల్లో తండ్రి పేరు తప్పనిసరి నిబంధన తొలగించాలి.. ఏపీ బాలల హక్కుల కమిషన్ డిమాండ్
MPP ZP Schedule: ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Tragedy Story: బిడ్డను నదిలో పారేయాలని చెబితే గుండె బద్దలైంది.. సోనియా గాంధీ ఆత్మకథలో విషాదం
బిడ్డను నదిలో పారేయాలని చెబితే గుండె బద్దలైంది.. సోనియా గాంధీ ఆత్మకథలో విషాదం
MPP ZP Schedule: ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
This Week OTT Web Series : ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
Pawan Anna Konidela Divorce : పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
Mahesh Kumar Goud: భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
Cashews For Health : జీడిపప్పు ఎవరు తింటే మంచిది? ఎవరు తినకపోవడమే మంచిది?
జీడిపప్పు ఎవరు తింటే మంచిది? ఎవరు తినకపోవడమే మంచిది?
Gill, Iyer Swap: వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
Embed widget