Konaseema District: అంబేద్కర్ జిల్లాలో ఉప్పెన స్టోరీ - ఇక్కడ విలన్ మాత్రం మహిళ
AP News: ఓ యువతితో యువకుడు గత మూడు నెలల నుండి అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. ఈ మధ్య కాలంలో తనను పట్టించుకోవడం లేదనే అక్కసుతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.

Nakka Rameshwaram News: వివాహాతర సంబంధం కొంప ముంచింది. ఓ యువతి యువకుడి అంగాన్ని కోసేసింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా నక్కా రామేశ్వరంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో అల్లవరం మండలం నక్కా రామేశ్వరం గ్రామంలో తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న చెక్కా చిన్న సత్యనారాయణ అనే వివాహితుడు నిర్లక్ష్యం చేస్తున్నాడన్నా అగ్రహాంతో అతని అంగాన్ని యువతి బ్లేడుతో కోసేసింది.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యువతితో సత్యనారాయణ అనే వ్యక్తి గత మూడు నెలల నుండి అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఆమెతో దూరంగా ఉండి ఆమె ఫోన్లు ఎత్తకుండా, కలవకుండా ఉన్నందున నిన్న ఆమె తనతో అక్రమ సంబంధం కలిగి ఉన్న చెక్క చిన్న నారాయణను ఒకసారి రమ్మని మాట్లాడాలని చెప్పి మంచి మాటలతో రప్పించుకుని రాత్రి 11.30 గంటలకు ఆమెతో అతను కలిసి ఉన్న సమయంలో అదును చూసి ఒక బ్లేడుతో అతని అంగాన్ని కోసి వేసింది. అది సగం వరకు తెగి ఉన్నందున వెంటనే అతణ్ని హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

