ఆయ్.. మా గోదారోళ్ళు ఇంతేనండీ.. 365 రకాల వంటలు.. కాబోయే మనవడికి, అల్లుడు గారికి మర్యాదలు మామూలుగా లేవుగా!
30 రకాల కూరలు, వివిధ రకాల పిండి వంటలు, 100 రకాల స్వీట్స్, 19 రకాల హాట్ పదార్థాలు, 15 రకాల ఐస్ క్రీం రకాలు, 35 రకాల డ్రింకులు, 35 రకాల బిస్కెట్లు, 15 రకాల కేకులు వడ్డించారు.
ఆతిథ్యానికి కేరాఫ్ అడ్రస్ అయిన ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సరదాలే వేరు. పండగ వచ్చిందంటే చాలు ఇంటికి వచ్చే అల్లుళ్లకు రకరకాల వంటలతో వడ్డించి మర్యాదలతో ముంచెత్తుతారు. కొత్త అల్లుళ్లయితే ఇక ఆ మర్యాదలే వేరు. ఈ సంక్రాంతికి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మనవరాలికి కాబోయే భర్తకు ఓ తాతయ్య ఇచ్చిన విందు అందరినీ ఆకర్షించింది. తమ మనవరాలికి కాబోయే భర్తను సంక్రాంతికి ఇంటికి భోజనానికి ఆహ్వానించి ఏకంగా 365 రకాల వంటకాలతో ఆతిథ్యం ఇచ్చారు.
వాటిలో అన్నం, పులిహార, పులావు, దద్దోజనం వంటి సంప్రదాయ వంటకాలతో పాటు, 30 రకాల కూరలు, వివిధ రకాల పిండి వంటలు, 100 రకాల స్వీట్స్, 19 రకాల హాట్ పదార్థాలు, 15 రకాల ఐస్ క్రీం రకాలు, 35 రకాల డ్రింకులు, 35 రకాల బిస్కెట్లు, 15 రకాల కేకులు ఉన్నాయి. నరసాపురానికి చెందిన ఆచంట గోవింద్ - నాగమణి దంపతులు తమ కూతురు అత్యం మాధవి, వెంకటేశ్వరరావు దంపతుల ఏకైక కుమార్తె కుందవికి తణుకుకి చెందిన ఎన్నారై తుమ్మలపల్లి సాయి కృష్ణతో వివాహం నిశ్చయం చేసుకున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా కాబోయే నూతన వదువువరులను గోవింద్ తన నివాసానికి భోజనానికి పిలిచి ఏకంగా 365 రకాల వంటకాలతో ఆతిథ్యం ఇచ్చారు. వీటిలో అన్నీ వెజిటేరియన్ పదార్థాలు, వంటకాలు మాత్రమే ఉన్నాయి. అత్తమామలు, తాత అమ్మమ్మలు 365 రకాల వంటకాలను కాబోయే అల్లుడికి దగ్గరుండి తినిపించారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ.. ‘‘మొత్తం 365 వంటకాలతో భోజనాలు పెట్టాం. మా మనవడు గారు ఉబ్బితబ్బిబ్బైపోయి.. నోట మాట రావట్లేదు’’ అని చెప్పుకొచ్చారు.
మరో అల్లుడికి ఘనమైన ఆతిథ్యం
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణానికి చెందిన మానే నాగేశ్వరరావు అనంతలక్ష్మి దంపతుల కుమార్తె యశోద సాయి. ఆ అమ్మాయికి ఇటీవల కృష్ణాజిల్లా లక్ష్మీ పురానికి చెందిన పులగం త్రిమూర్తులు - నాగ కుమారి దంపతుల కుమారుడు వినయ్ కుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఇద్దరూ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వివాహం తర్వాత తొలి సంక్రాంతి కావడంతో అల్లుడు వినయ్ కుమార్, వియ్యపురాలు నాగ కుమారిని సంక్రాంతి పండుగకు ఆహ్వానించారు.
కనుమ పురస్కరించుకుని అల్లుడికి నాగేశ్వర రావు దంపతులు 365 రకాలు ఆహార పదార్థాలు సమకూర్చి విందు ఇచ్చారు. వీటిలో ప్రధానంగా 40 రకాలు గుమగుమలాడే గరం మసాలా మాంసాహారం కూరలు తయారు చేయడంతో పాటు 140 పిండి వంటలు, పండ్లు, ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్‌లు, వివిధ రకాల స్నాక్స్‌తో విందు భోజనం వడ్డించారు. కుటుంబం మొత్తం అల్లుడికి కొసరి కొసరి వడ్డించారు. వీరి ఆతిథ్యం వియ్యాలవారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
Also Read: School Holidays: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. సెలవులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేశ్