అన్వేషించండి

Janasena MLA Car Attack: జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి, స్పందించిన నేత ఏమన్నారంటే

Attack On Polavaram MLA Chirri Balaraju Car | జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కొందరు గుర్తుతెలియని దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనం వెనుక వైపు అద్దాలు ధ్వంసమయ్యాయి.

Attack On MLA Chirri Balaraju Car:  జీలుగుమిల్లి: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల సమీపంలో జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై దాడి జరిగింది. కొందరు గుర్తుతెలియని దుండగులు ఎమ్మెల్యే బాలరాజును లక్ష్యంగా చేసుకుని ఆయన వాహనంపై దాడికి పాల్పడ్డారు. అయితే దాడి జరిగిన సమయంలో వాహనంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లు పోలీసులు తెలిపారు.
 
ఎమ్మెల్యే బాలరాజు కారుపై దాడి పోలవరం నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. అయితే దాడి జరిగిన సమయంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారులో లేరని జీలుగుమిల్లి పోలీసులు తెలిపారు. జనసేన ఎమ్మెల్యే ఇంటి నుంచి కారు జీలుగుమిల్లి వైపు వెళ్తుండగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కియా కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో కారులో ముగ్గురు ఉన్నారని సమాచారం. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Janasena MLA Car Attack: జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి, స్పందించిన నేత ఏమన్నారంటే
 
క్షేమంగా ఉన్నాను, ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే
తన కారుపై జరిగిన దాడిపై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పందించారు. దాడి జరిగిన సమయంలో తాను వాహనంలో లేనని, నాయకులు, కార్యకర్తలు ఎవరూ దీనిపై ఆందోళన చెందకూడదున్నారు. బర్రింకలపాడు నుంచి జీలుగుమిల్లి వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు తన కారుపై రాళ్ల దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే తెలిపారు. ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడ్డా, పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఎమ్మెల్యే కారు పై జరిగిన దాడి జరిగిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు. 
 
ఆఫీసులో పబ్జీ ఆడుతున్న ఉద్యోగిని పట్టుకున్న ఎమ్మెల్యే 
జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సోమవారం ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆఫీసులో విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి మొబైల్‌లో పబ్జీ గేమ్ ఆడుతున్నట్లు గమనించారు. ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని పోలవరం ఎమ్మెల్యే ఉన్నతాధికారులను ఆదేశించారు. కన్నాపూరం ITDA ఆఫీసుని  ఎమ్మెల్యే తనిఖీ చేయగా.. ఆయన రాకతో అక్కడి ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎలాంటి సెక్యూరిటీ, సాధారణ వ్యక్తిలా, ముఖానికి మాస్కు ధరించి రావడంతో ఉద్యోగులు ఆయనను గుర్తుపట్టలేదు. D. Y. E. O  సెక్షన్ O. S - సాయి కుమార్ విధుల్లో ఉండి దర్జాగా పబ్జీ ఆడటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటవి ఉద్యోగులు ప్రజలకు అవసరం లేదని, చర్యలకు అధికారులను ఆదేశించారు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Honor Killing Case: పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
Yanamala Rama Krishnudu: టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
Mahesh Babu: మహేష్ బాబు సినిమాకు రెండు వేర్వేరు క్లైమాక్స్‌లు.. షాక్‌లో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్, ఎందుకో తెలుసా?
మహేష్ బాబు సినిమాకు రెండు వేర్వేరు క్లైమాక్స్‌లు.. షాక్‌లో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్, ఎందుకో తెలుసా?
Rohit Kohli Bonding: రోహిత్‌కు హగ్ ఇచ్చి అనుష్క శర్మ  కంగ్రాట్స్.. కోహ్లీతో హిట్ మ్యాన్ దాండియా.. సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్
రోహిత్‌కు హగ్ ఇచ్చి అనుష్క శర్మ కంగ్రాట్స్.. కోహ్లీతో హిట్ మ్యాన్ దాండియా.. వీడియోలు వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడాRohit Sharma Champions Trophy 2025 | 9నెలల్లో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మInd vs Nz Champions Trophy 2025 Final | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Honor Killing Case: పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
Yanamala Rama Krishnudu: టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
Mahesh Babu: మహేష్ బాబు సినిమాకు రెండు వేర్వేరు క్లైమాక్స్‌లు.. షాక్‌లో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్, ఎందుకో తెలుసా?
మహేష్ బాబు సినిమాకు రెండు వేర్వేరు క్లైమాక్స్‌లు.. షాక్‌లో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్, ఎందుకో తెలుసా?
Rohit Kohli Bonding: రోహిత్‌కు హగ్ ఇచ్చి అనుష్క శర్మ  కంగ్రాట్స్.. కోహ్లీతో హిట్ మ్యాన్ దాండియా.. సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్
రోహిత్‌కు హగ్ ఇచ్చి అనుష్క శర్మ కంగ్రాట్స్.. కోహ్లీతో హిట్ మ్యాన్ దాండియా.. వీడియోలు వైరల్
Gopichand 33 Movie: 'ఘాజీ' మూవీ డైరెక్టర్‌తో గోపీచంద్ కొత్త  సినిమా - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసిందోచ్.. పవర్ ఫుల్ పీరియాడిక్ డ్రామాగా..
'ఘాజీ' మూవీ డైరెక్టర్‌తో గోపీచంద్ కొత్త సినిమా - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసిందోచ్.. పవర్ ఫుల్ పీరియాడిక్ డ్రామాగా..
Bone Health Alert : ఎముకల బలహీనతను సూచించే సంకేతాలు ఇవే.. జాగ్రత్త బోన్స్ విరిగిపోతాయట
ఎముకల బలహీనతను సూచించే సంకేతాలు ఇవే.. జాగ్రత్త బోన్స్ విరిగిపోతాయట
Tax Relief: దిగిరానున్న ధరలు, తగ్గనున్న పన్ను మోతలు! - తీపికబురు చెప్పిన నిర్మలమ్మ
దిగిరానున్న ధరలు, తగ్గనున్న పన్ను మోతలు! - తీపికబురు చెప్పిన నిర్మలమ్మ
HomeTown Web Series Teaser: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'హోమ్ టౌన్' వెబ్ సిరీస్ - ఈ టౌన్‌లో లవ్, ఫ్రెండ్‌‍షిప్ అన్నీ ఉంటాయ్.. ఆకట్టుకుంటోన్న టీజర్!
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'హోమ్ టౌన్' వెబ్ సిరీస్ - 100కి 116 మార్కులెలా వచ్చాయ్‌రా.. నవ్వులు పూయిస్తోన్న టీజర్!
Embed widget