అన్వేషించండి

Anantha babu: ఏలేరు కాలువలో దొరికిన ఓ యువతి మృతదేహంతో అనంతబాబుకు లింక్‌- టీడీపీ ఎమ్మెల్యే శిరీష్ సంచలన ఆరోపణలు

Konaseema News: అనంత‌బాబు అకృత్యాలు అంతే లేద‌ని రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే శిరీష దేవి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. మ‌రో ప‌క్క మీడియాలో చూపిస్తున్న దాంట్లో వాస్త‌వంలేద‌న్నారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.

Rampachodavaram MLA Sirisha Devi: రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలకు ఎంతో మంది అమాయక మహిళలు బలైపోయారని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆడవాళ్ల జీవితాలను నాశనం చేశారని, అతనికి భయపడి మహిళలు భయపడిపోతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికడం, కాలేజీ సీటు కావాలన్నా, బదిలీలు చేయాలన్నా మహిళల్ని రకరకాలుగా లైంగికంగా వేధించేవాడన్నారు. 

మార్ఫింగ్‌ అంటూ మభ్యపెట్టే ప్రయత్నం .
రంపచోడవరంలోని ఆమె క్యాంపు కార్యాలయంలోమీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే శిరీష దేవి అనంతబాబుపై మండిపడ్డారు. రంపచోడవరం కేంద్రంగా ఎమ్మెల్సీ అనంతరబాబు అకృత్యాలకు కొన్ని రోజుల క్రితం బయటకు వచ్చిన వీడియో సాక్ష్యమని ఎమ్మెల్యే శిరీష దేవి అన్నారు. పైగా ఆ వీడియోలో ఉన్నది తాను కాదని మార్ఫింగ్‌ చేశారని... తప్పుడుప్రచారం చేస్తున్నారని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఆ వీడియోలో మెడపైన ఉన్న చైను, చేతికి ఉన్న ఉంగరాలు ఆయనవి కావా అని ప్రశ్నించారు.

న్యూడ్‌ వీడియో ముమ్మాటికీ వాస్తవమే అని, గత పదేళ్లుగా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు శిరీష. బాధిత మహిళ ధైర్యం చేసి ఆ వీడియో బయటపెట్టిందన్నారు. ఈ వీడియో వ్యవహారంలో విచారణ చేపట్టి అనంతబాబును వెంటనే అరెస్ట్‌ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. 

మహిళలకు ఇచ్చేవిలువ ఇదేనా జగన్మోహన్‌ రెడ్డి.. 
ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్సీలు తప్పుడు వ్యవహారాలు బయటకు వస్తుంటే జగన్మోహన్‌ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు శిరీష. ఎమ్మెల్సీలకు శిక్ష వేయించలేవా అని నిలదీశారు. మహిళల పక్షపాతిని అని చెప్పుకునే జగన్మోహన్‌ రెడ్డి వీళ్లకు ఏ శిక్షవేస్తావు అని అడిగారు. మొన్ననే ఒక ఎమ్మెల్సీ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య పిల్లల్ని వదిలేశారని, ఇప్పుడు అనంతబాబు బాగోతం బట్టబయలైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

దళిత యువకుడి హత్య వెనుక అక్రమ సంబంధం 
కాకినాడకు చెందిన తన కారు డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య వెనుక అనంతబాబు ఓ మహిళతో పెట్టుకున్న అక్రమ సంబంధం వ్యవహారమేనని ఎమ్మెల్యే శిరీష దేవి ఆరోపించారు. దళితుడ్ని చంపి డోర్‌ డెలివరీ చేసింది కూడా మహిళ కోసమే అన్నారు. దీని వెనుక 12 మంది అనుచరులు ఉన్నారని అ్నారు. కేసు నుంచి వారిని తప్పించారన్నారన్నారు. అనంతబాబు, మహిళ అక్రమ సంబంధం విషయం డ్రైవర్‌కు తెలియడంతో ఎక్కడ బయటపెడతాడో అని కాకినాడ తీసుకువెళ్లి చంపేశారన్నారు. సుబ్రహ్మణ్యం కేసులో సీబీఐ ఎంక్వైరీ వేయాలన్నారు. 

ఇటీవలే తిమ్మాపురం వద్ద ఏలేరు కాలువలో ఓ యువతిని తల, మొండెం వేరు చేసి చంపేసిన ఉదంతం బయటపడిందని, హత్యకు గురైన ఆ అమ్మాయి కూడా అనంతబాబు బాధితురాలేమోనని అనుమానం వస్తుందన్నారు. ఇతను ప్రత్యక్షంగా ప్రమేయం లేకున్నా ఇతను వెనుకున్న 12 మంది అనుచరులే చంపివేశారేమోనని అనుమానంగా ఉందన్నారు అటవీసంపద దోచుకున్న వ్యక్తి అనంతబాబు అని, మహిళలను టార్గెట్‌ చేసి వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న అనంతబాబు, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

ఆ వీడియోలు మార్ఫింగ్‌ చేసినవే: ఎమ్మెల్సీ అనంతబాబు
రెండు రోజులుగా టీవీ ఛానెళ్లు, సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న వీడియోలు తనవి కావని, అవి మార్ఫింగ్‌ చేసిన ఫేక్‌ వీడియోలు అని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అన్నారు. తనను అప్రతిష్టపాలు చేయాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బయటకు వచ్చిన న్యూడ్‌ వీడియో నేపథ్యంలో ఎమ్మెల్సీ అనంతాబు ఓ వీడియోను బయకు వదిలారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న వీడియోను అసభ్య ఫేక్‌ వీడియోలు జోడిరచి అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గతంలో తనకు ఈవీడియోలు పంపించి డబ్బులు డిమాండ్‌ చేశారని, దీనిపై స్థానిక పోలీసుకుల ఫిర్యాదు చేశానన్నారు. 

Also Read: విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన - పోక్సో కేసు నమోదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! ఐదుగురు దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! ఐదుగురు దుర్మరణం
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! ఐదుగురు దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! ఐదుగురు దుర్మరణం
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Roja: నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా  ఇక ఫీల్డులోకి వస్తారా ?
నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా ఇక ఫీల్డులోకి వస్తారా ?
Mathu vadalara 2 OTT: ‘మత్తువదలరా 2‘ ఓటీటీ ఫార్ట్ నర్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
‘మత్తువదలరా 2‘ ఓటీటీ ఫార్ట్ నర్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
Embed widget