అన్వేషించండి

దోసలు వేసినంత ఈజీగా చోరీలు - పట్టుకున్న పిగన్నవరం పోలీసులు

జల్సాలకు అలవాటు పడి మోటారు సైకిళ్లు దొంగిలించి అమ్మేయడం ప్రవృత్తిగా చేసుకున్నదొంగ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఆరునెలల వ్యవధిలో ఏకంగా రూ.11 లక్షల బైక్లు కొట్టేసిన ఘరానా దొంగను అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.

కంటికి ఇంపుగా కనపడితే ఇక ఆ బైక్‌ గాయాబ్‌.. తాళం వేసి ఉన్నా అవేమీ మనోడి చేతివాటం ముందు పని చేయవు. ఎంతటి లాక్‌నైనా అవలీలగా తీసేసి దర్జాగా బండి నడుపుకుంటూ జారుకునే నేర్పరి. గడచిన ఆరునెలల వ్యవధిలో ఏకంగా రూ.11 లక్షల విలువైన మోటారు సైకిళ్లు కొట్టేసి అమ్మేసుకున్న ఘనుడు.

కేవలం జల్సాలకు అలవాటు పడి మోటారు సైకిళ్లే దొంగిలించి అమ్మేయడం ప్రవృత్తిగా చేసుకున్న ఘరానా దొంగ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 27కు పైగా బైక్‌ దొంగతనాలకు పాల్పడి వాటిని విక్రయించిన సొమ్ముతో జల్సాలు చేస్తున్న వ్యక్తి పోలీసులకు చిక్కాడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం వై.కొత్తపల్లికు చెందిన కేశవరపు సుబ్రహ్మణ్యం(సుబ్బు) స్థానికంగా ఓ కాఫీ హోటల్‌లో పనిచేస్తుంటాడు. ప్రవృత్తిగా కంటికి కనిపించిన మోటారు సైకిల్‌ను కొట్టేయడం, ఆ తరువాత వాటిని అమ్మేయడం చేస్తుంటాడు. అంబాజీపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు మోటారు సైకిళ్లు దొంగతనం చేశాడు. పి.గన్నవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 4, నగరంలో 1, రాజోలులో 4, పాలకొల్లులో 1 ఇలా 14 మోటారు సైకిళ్లు దొంగతనానికి పాల్పడ్డాడు. మరో 13 మోటారు సైకిళ్లు గుర్తించవలసి ఉందన్నారు. ఈ బైక్‌లు విలువ రూ.11లక్షలు వరకు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు.

కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతూ..
కంటికి కనిపించిన బైక్‌లను చాకచక్యంగా కొట్టేసి కొన్ని బైక్‌లను యధాతధంగా అమ్మేసి, మరికొన్ని బైక్‌లను విడిభాగాలుగా విడగొట్టి అమ్మేస్తాడు. అమ్మితే వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు ఘరానా దొంగ కేశవరపు సుబ్రహ్మణ్యం అలియాస్‌ సుబ్బు. ఇతన్ని పి.గన్నవరం సీఐ డి.ప్రశాంత్‌కుమార్‌, స్థానిక ఎస్సై ఏ.చైతన్యకుమార్‌ నిఘా పెట్టి పట్టుకున్నారు. నిందితుడు మాచవరం గ్యాస్‌ గొడౌన్‌ వద్ద తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. ఘరానా దొంగను చాకచక్యంగా పట్టుకున్న సీఐ, ఎస్సై, సిబ్బందిని డీఎస్పీ అభినందించి రివార్డుకు సిఫారసు చేశారు. 

ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్‌..
నాలుగేళ్లుగా ఓ మైనర్‌ బాలికను ప్రేమిస్తున్నానని, నమ్మించి అత్యాచారం చేశాడన్న ఫిర్యాదుపై రాజోలు మండలం ములికిపల్లికి చెందిన ముసునూరి వరప్రసాద్‌పై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ కేవీ రమణ తెలిపారు. నిందితుడు ప్రసాద్‌ పి.గన్నవరంలోని తన బంధువుల ఇంటికి వచ్చినప్పుడు ఇదే ప్రాంతానికి చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడని, అప్పటినుంచి ఇప్పటివరకు బాలికకు మాయమాటలు చెబుతూ పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి మాట ఎత్తేసరికి మొహం చాటేశాడని చెప్పారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితునిపై ఫోక్సో, అత్యాచారాల చట్టంకింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు డీఎస్పీ కేవీ రమణ తెలిపారు. నిందితున్ని అరెస్ట్‌చేసి అమలాపురం కోర్టులో ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget