చంద్రబాబు ఆందోళన ఇప్పుడు అర్థమవుతుంది- భువనేశ్వరి ఎమోషనల్ ట్వీట్
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారామె. తల్లివర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు
తెలుగు దేశం పార్టీ నాయకులపై, కార్యకర్తలపై పెడుతున్న కేసులు ఆవేదన కలిగిస్తున్నాయని చంద్రబాబు సతీమణి భవనేశ్వరి అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారామె. తల్లివర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.
భుననేశ్వరి ఏమన్నారంటే..."తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా? ఇదేమి చట్టం... ఇదెక్కడి న్యాయం? కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి నన్ను ఎంతో బాధించింది. వ్యవస్థల నిర్వీర్యం అని చంద్రబాబు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసేవారో ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది. కుటుంబ వ్యవహారాలను, వ్యక్తిగత హక్కులను, సంప్రదాయాలను రాజకీయాలతో ముడి పెట్టవద్దని ఉన్నతాధికారులను కోరుతున్నాను." అని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా? ఇదేమి చట్టం... ఇదెక్కడి న్యాయం? కొల్లు రవీంద్ర గారి పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి నన్ను ఎంతో… pic.twitter.com/syGf26aUtm
— Nara Bhuvaneswari (@ManagingTrustee) October 18, 2023
రెండు రోజుల నుంచి కొల్లు రవీంద్రను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. మొన్న సాయంత్రవరకు గృహనిర్బంధం చేసిన అధికారులు సాయంత్రానికి తమతో తీసుకెళ్లారు. వేకువ జాము వరకు వివిధ ప్రాంతాల్లో తిప్పి తర్వాత ఇంట్లో దించేశారు. అప్పటి నుంచి ఆయన్ని బయటకు రాకుండా నిర్బంధించారు. తల్లి వర్ధంతి కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. ఇదే విషయంపై పోలీసులు కొల్లు రవీంద్ర వాగ్వాదానికి దిగారు.
ఒక్క కొల్లు రవీంద్రనే కాదు చాలా మంది నాయకులను గృహనిర్బంధంలో ఉంచారు. అయ్యన్నపాత్రుడిని నిన్న గృహనిర్బందం చేశారు. ఆయన ఇంటికి ఎవరూ రాకుండా ఆయన ఎటువైపు వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. దీనిపై అయ్యన్నపాత్రుడు కూడా సీరియస్ అయ్యారు.
భవనేశ్వరికి సంఘీభావం చెప్పేవారికి హెచ్చరిక
చంద్రబాబుకి మద్దతుగా, రాజమండ్రిలో ఉన్న తనతో సమావేశమై మనోధైర్యాన్ని ఇచ్చేందుకు వస్తున్న వారిని బెదిరించడాన్ని కూడా భవనేశ్వరి తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావయాత్ర చేపడితే తప్పేముందన్నారు. పార్టీ కార్యకర్తలు తమ బిడ్డల్లాంటి వాళ్ళన్నారు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏంటి నిలదీశారు. ప్రజలు, మద్దతుదారులు తనను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కెక్కడిదని ప్రశ్నించారు.
చంద్రబాబుగారికి మద్దతుగా, రాజమండ్రిలో ఉన్న నన్ను కలిసి నాకు మనోధైర్యాన్నిఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావయాత్ర చేపడితే అందులో తప్పేముంది? పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వాళ్ళు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏంటి? ప్రజలు,… pic.twitter.com/oyz8Sj1OY6
— Nara Bhuvaneswari (@ManagingTrustee) October 17, 2023