Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !
Konaseema District Name Change: పరిపాలనా సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26కు పెంచగా.. కొన్ని జిల్లాల పేర్లపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పేరు మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Konaseema District Name Change: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పరిపాలనా సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26కు పెంచగా.. కొన్ని జిల్లాల పేర్లపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పేరు మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ జిల్లా పేరును డా.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. కోనసీమ జిల్లా పేరు మార్పుపై త్వరలోనే ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఇటీవల ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లా (Konaseema District)ను అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ జిల్లా పేరును డా బీఆర్.అంబేడ్కర్ జిల్లాగా మార్చాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను సైతం కొన్ని సంఘాల నేతలు కలిసి విన్నవించారు. ఈ నేపథ్యంలో కొనసీమ జిల్లా పేరును డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Dr BR Ambedkar Konaseema)గా నామకరణం చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును డా.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కోనసీమ జిల్లా పేరు మార్పుపై త్వరలోనే ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.#YSJagan #Konaseema #APNewDistricts pic.twitter.com/tDxtGhTBNP
— ABP Desam (@ABPDesam) May 18, 2022
తుది నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలు, కేంద్రాలు ఇలా ఉన్నాయి..
1) జిల్లా పేరు: శ్రీకాకుళం జిల్లా కేంద్రం : శ్రీకాకుళం
2) జిల్లా పేరు: విజయనగరం జిల్లా కేంద్రం: విజయనగరం
3) జిల్లా పేరు: మన్యం జిల్లా కేంద్రం: పార్వతీపురం
4) జిల్లా పేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం: పాడేరు
5) జిల్లా పేరు: విశాఖపట్నం జిల్లా కేంద్రం: విశాఖపట్నం
6) జిల్లా పేరు: అనకాపల్లి జిల్లా కేంద్రం: అనకాపల్లి
7) జిల్లా పేరు: కాకినాడ జిల్లా కేంద్రం: కాకినాడ
8) జిల్లా పేరు: కోనసీమ జిల్లా కేంద్రం: అమలాపురం
9) జిల్లా పేరు: తూర్పుగోదావరి జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
10) జిల్లా పేరు: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం: భీమవరం
11) జిల్లా పేరు: ఏలూరు జిల్లా కేంద్రం: ఏలూరు
12) జిల్లా పేరు: కృష్ణా జిల్లా కేంద్రం: మచిలీపట్నం
13) జిల్లా పేరు: ఎన్టీఆర్ జిల్లా జిల్లా కేంద్రం: విజయవాడ
14) జిల్లా పేరు: గుంటూరు జిల్లా కేంద్రం: గుంటూరు
15) జిల్లా పేరు: బాపట్ల జిల్లా కేంద్రం: బాపట్ల
16) జిల్లా పేరు: పల్నాడు జిల్లా కేంద్రం: నరసరావుపేట
17) జిల్లా పేరు: ప్రకాశం జిల్లా కేంద్రం: ఒంగోలు
18) జిల్లా పేరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం: నెల్లూరు
19) జిల్లా పేరు: కర్నూలు జిల్లా కేంద్రం: కర్నూలు
20) జిల్లా పేరు: నంద్యాల జిల్లా కేంద్రం: నంద్యాల
21) జిల్లా పేరు: అనంతపురం జిల్లా కేంద్రం: అనంతపురం
22) జిల్లా పేరు: శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం: పుట్టపర్తి
23) జిల్లా పేరు: వైఎస్సార్ కడప జిల్లా కేంద్రం: కడప
24) జిల్లా పేరు: అన్నమయ్య జిల్లా కేంద్రం: రాయచోటి
25) జిల్లా పేరు: చిత్తూరు జిల్లా కేంద్రం: చిత్తూరు
26) జిల్లా పేరు: తిరుపతి జిల్లా కేంద్రం: తిరుపతి
Also Read: AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత