అన్వేషించండి
Advertisement
Yanam St Anns Catholic Church: ఫ్రెంచి వారు నిర్మించిన ఈ చర్చి సంకల్ప సిద్ధికి పెట్టింది పేరు - చాలా కథ ఉంది
Christmas 2024 | కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఫ్రెంచి వారు నిర్మించిన సెయింట్ ఆన్స్ కేథలిక్ చర్చి చాలా స్పెషల్. అన్ని మతాలవారు ఇక్కడికి వెళ్లి ప్రార్థనాలు చేస్తుంటారు. అందుకు పెద్ద కారణం ఉంది.
French St Anns Catholic Church : సాధారణంగా చర్చికి క్రైస్తవులే వెళ్తుంటారు.. కానీ కుల మతాలకు అతీతంగా అన్నివర్గాలు వెళ్లిమరీ ప్రార్ధన చేసే ఆలయం ఒకటి ఉందని మీకు తెలుసా... దీనికి కారణం అక్కడ ప్రార్ధనలు చేస్తే తమ సంకల్పం నెరవేరుతుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం.. కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరి యానాంలో సెయింట్ ఆన్స్ రోమన్ కాథలిక్ చర్చి కేవలం విశ్వాసపరంగానే ప్రత్యేకమైనది కాదు.. అత్యంత పురాతన చర్చిల్లో ఇది ఒకటి.
ఫ్రెంచి వారు నిర్మించిన చర్చ్
ఫ్రెంచ్ పాలకుల స్మారక చిహ్నంగా ఈ క్యాథలిక్ చర్చి అని చెబుతారు. ఫ్రెంచ్ వర్తకులు ఫ్రెంచ్ ఎన్‌క్లేవ్‌గా యానాం ఉన్నందున 1750 సంవత్సరంలో ఇక్కడ నీలిమందు కర్మాగారాన్ని నిర్మించారని, ఈక్రమంలోనే ఫ్రెంచ్‌వారు ఈచర్చిని తొలినాళ్లలో 1768లో నిర్మించారు. అయితే అది 1768లో వచ్చిన తుపాను కారణంగా కూలిపోగా ఫాధర్ మిచెల్ లెక్నామ్ 1846లో పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తిచేశారని చెబుతుంటారు. ఈ చర్చికి సంబంధించి చాలా నిర్మాణ, అలంకార సామాగ్రి ఫ్రాన్స్ నుంచి తెప్పించారు. చర్చి నిర్మాణం యూరోపియన్ గోథిక్ శైలిలో నిర్మాణం చేపట్టినట్లు కనిపిస్తుంది. ఆ తరువాత ఫ్రెంచి వర్తకులు ఇక్కడే ప్రార్ధనలు చేసుకునేవారు. ఆ సమయంలోనే ఒక బావిని తవ్వించి అదే నీటిని సేవించేవారు. ఆ బావి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండగా, ప్రస్తుతం నీళ్లు చేదుకునేందుకు బావి వద్దకు వచ్చిన సమరయ స్త్రీతో తానిచ్చు జీవజలం గురించి యేసు చెబుతున్న వృత్తాంతం అద్భుతంగా చిత్రీకరించారు.
కొండ గుడిని నిర్మించిన ఇంజినీర్ భార్య
ఈ చర్చి వెనుక భాగంలో కొండగుడి కూడా ఉంటుంది. దీని వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది.. 1943 సంవత్సరంలో విలియం బి.అగస్టస్ అనే ఓడ భారీ తుపాను కారణంగా ఇసుక ద్వీపంలో కూరుకుపోయిందని, 1000 టన్నుల బరువున్న ఓడను కదిలించేందుకు మానవశక్తిని ప్రయోగించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో అక్కడే ఏడాది పాటు నిలిచిపోయింది. దీంతో అమెరికా నుంచి ఈహెచ్ స్విన్ అనే ఇంజనీర్‌ను నియమించారు. ఆయన ప్రయత్నాలు ఫలించకపోగా ఓడ గురించి మేరీ మాతను ఆరాధించడంతో అకస్మాత్తుగా ఓడ ఇసుక ద్వీపం నుంచి కదలడంతో ఇంజనీర్, ఆయన భార్య యానాంలో కొండ గుడిని నిర్మించారని స్థానికంగా చెబుతుంటారు. ఈ చర్చి వెనుక కొండగుడిలో కూడా ఈ ఇతివృత్తాన్ని పొందుపరిచారు.
ప్రస్తుతం ఈ చర్చి పుదుచ్చేరి ప్రభుత్వ టూరిజంలో ముఖ్యమైన లొకేషన్‌గా ఉంది.. పూర్వం నుంచి సభ్యులుగా ఉన్న వారు ఈచర్చి అభివృద్ధికి ఇప్పటికీ విరాళాలు ఇస్తున్నారు.. చర్చి ఆవరణలో యేసు జీవించిన కాలంలో ఆయనతో నడిచిన 12 మంది శిష్యుల విగ్రహాలు చాలా సహజంగా కనిపిస్తుంటాయి..మనసు పొరలలో ఉన్న సంకల్పాన్ని కార్యరూపం చేసుకునేందుకు చాలా మంది ఈ చర్చిలోకి వచ్చి ప్రార్ధిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు..
యానాం సెయింట్ అన్స్ చర్చికి ఎలా వెళ్లాలంటే...
యానాం సెయింట్ అన్స్ క్యాథలిక్ చర్చికి చేరుకోవాలంటే అమలాపురం నుంచి కానీ, కాకినాడ లేదా రామచంద్రపురం నుంచి చేరుకోవచ్చు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి 32 కిలోమీటర్లు దూరం.. అటు కాకినాడ నుంచి చేరుకోవాలంటే 31 కిలోమీటర్లు ప్రయాణిస్తే యానాం చేరుకోవచ్చు.. బస్సులు, ప్రయివేటు వాహనాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి.. టెంపుల్ టూరిజం చేసే వాళ్లు రామచంద్రపురం మండల పరిధిలో ఉన్న ద్రాక్షారామం నుంచి కూడా యానాం ఈజీగా చేరుకోవచ్చు.
రామచంద్రపురం నుంచి యానాంకు కోటిపల్లి యానాం ఏటిగట్టు రోడ్డు మార్గం ద్వారా కానీ, ద్వారపూడి యానాం రోడ్డు ద్వారా కానీ కేవలం 22 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తే చేరుకోవచ్చు. యానాంలో సెయింట్ ఆన్స్ కేథలిక్ చర్చితోపాటు దరియాలతిప్పలోని ఐఫీల్ టవర్, ఇంకా పలు చూడదగ్గ ప్రదేశాలు ఉండడం వల్ల అవికూడా ఈ చర్చికి కేవలం మూడు నాలుగు కిలోమీటర్లు దూరంలోనే కనిపిస్తాయి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
హైదరాబాద్
ఇండియా
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion