అన్వేషించండి

Chandrababu Diet Plan: చంద్రబాబు ఏం తింటారు, ఆయన డైట్ ప్లాన్ ఏంటో తెలుసా?

Chandrababu Diet Plan: చంద్రబాబు నాయుడు ఏం తింటారు.. ఆయన డైట్ ప్లాన్ ఏంటంటే..

Chandrababu Diet Plan: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మితాహారి. కానీ ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులతో పాటు పలు సందర్భాల్లో స్వయంగా ఆయనే మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ వయస్సులోనూ ఇంత యాక్టివ్ గా ఎలా ఉన్నారని, పాదయాత్రలు, పర్యటనలైనా ఎలా చేయగలుగుతున్నారని, మీ ఆరోగ్య రహస్యం ఏమిటని పలు సందర్భాల్లో చంద్రబాబుకు ఎదురైన ప్రశ్నలపై ఆయన స్పందిస్తూ డైట్ ప్లాన్ గురించి చెప్పారు.

తాను బతకడానికి మాత్రమే ఆహారం తీసుకుంటానని, తినడం కోసం బతకనని కూడా అన్నారు. రోజూ ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం.. ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తున్నాం అనేది ఎప్పుడూ లెక్క వేసుకుంటారు. అది మాత్రమే తింటా, ఇది అస్సలే తినను అనే కట్టుబాట్లు ఏవీ లేకుండా.. ఏది ఆరోగ్యానికి మంచిదైతే, ఏ కాలంలో ఏది అందుబాటులో ఉంటే వాటిని తీసుకుంటారు. ఏది తీసుకున్నా మితంగా మాత్రమే తింటారు. 

పలు సందర్భాల్లో చంద్రబాబు చెప్పిన డైట్ ప్లాన్ ఏంటంటే..

  • ఉదయం: ఇడ్లీ, జొన్న ఇడ్లీ, ఓట్ ఉప్మా, 2 దోశలు, కొద్దిగా చట్నీ, 2 ఎగ్ వైట్‌లు
    అల్పాహారానికి భోజనానికి మధ్య ఒక చిన్న పండు
  • మధ్యాహ్నం: రాగి, జొన్న, సజ్జ, 2 లేదా 3 వెజిటెబుల్ కూరలు, కొద్దిగా పెరుగు
    లంచ్ కు ఈవినింగ్ స్నాక్స్‌కు మధ్య కొన్ని డ్రై ఫ్రూట్స్
  • సాయంత్రం: సూప్, స్నాక్స్, ఎగ్ వైట్
  • రాత్రి: గ్లాసు పాలు మాత్రమే, మరీ ఆకలి వేస్తే ఒక చిన్న పండు
  • రోజూ 6 గంటలపాటు నిద్ర

తీసుకునే ఆహారంతో వచ్చే కేలరీలు, చేసే వ్యాయామంతో కరిగిపోయే కేలరీలు.. శరీరానికి అవసరమయ్యేవి ఎన్నో రోజూ లెక్క వేసుకుని అందుకు అనుగుణంగా వ్యాయామంలో మార్పులు చేసుకుంటారు.

చంద్రబాబుకు ఇంటి ఆహారానికి కోర్టు అనుమతి

ఇవీ ఆయన ఆహార నియమాలు.. మెడిసిన్స్ విషయానికొస్తే.. ప్రజల మధ్యకు వచ్చినప్పుడు కూడా ఆయన అప్పుడప్పుడు మధ్యలో మందులు వేసుకుంటుంటారు.  ఆ మందుల్ని కూడా ఇంటి నుంచి తెప్పించి ఇవ్వాలని జైలు అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇంటినుంచి వచ్చే ఆహరాన్ని అనుమతించాలని చెప్పింది.

చంద్రబాబు వ్యక్తిగత వైద్యులు కూడా యాత్రల్లో ఎప్పుడూ ఆయన వెంట ఉంటారు. ఆహార నియమాలు, వేళకు కచ్చితంగా మందులు తీసుకోవడంతో ఆయన ఈ వయసులో కూడా యాక్టివ్ గా ఉంటారని అంటారు. అందుకే అలుపెరగకుండా వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు. ప్రజల్ని కలుస్తుంటారు. సమకాలీన రాజకీయాల్లో ఆ వయసులో అంత యాక్టివ్ గా ఉండే నేతల్లో చంద్రబాబు మొదటి స్థానంలో ఉంటారనడం అతిశయోక్తి కాదు. అధికారంలేనప్పుడు కూడా ఆయన కుంగిపోలేదు. తిరిగి అధికారం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ నాయకుల్ని శ్రేణుల్ని ఉత్సాహపరుస్తూ 2024 ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.  

హౌస్ రిమాండ్ కు అనుమతించాలని చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో పూర్తిభద్రత ఉంటుందని అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేసిన వాదనలతో జడ్జి ఏకీభవించారు. సోమవారం ఉదయం నుంచి ఈ తీర్పుపై నెలకొన్న ఉత్కంఠకు మంగళవారం సాయంత్రానికి తెరపడింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
Weather Updates: 24 గంటల్లో మరో అల్పపీడనం, ఏపీలో 3 రోజులపాటు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
24 గంటల్లో మరో అల్పపీడనం, ఏపీలో 3 రోజులపాటు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
Weather Updates: 24 గంటల్లో మరో అల్పపీడనం, ఏపీలో 3 రోజులపాటు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
24 గంటల్లో మరో అల్పపీడనం, ఏపీలో 3 రోజులపాటు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Embed widget