అన్వేషించండి

Mahanadu News Live Updates: రాజమండ్రిలో మహానాడు కోలాహలం- భారీగా చేరుకుంటున్న తెలుగుదేశం ప్రతినిధులు, శ్రేణులు

Mahanadu News Live Updates: రాజమండ్రిలో జరిగే మహానాడుకు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఈ పేజ్‌ను ఫాలో అవ్వండి.

LIVE

Key Events
Mahanadu News Live Updates: రాజమండ్రిలో మహానాడు కోలాహలం- భారీగా చేరుకుంటున్న తెలుగుదేశం ప్రతినిధులు, శ్రేణులు

Background

 Mahanadu News Live Updates:  రాజమండ్రి వేమగిరి వద్ద తెలుగుదేశం పార్టీ చేపట్టిన మహానాడు కార్యక్రమం సర్వాంగ సుంద‌రంగా, అంగరంగ వైభవంగా, కనీవినీ ఎరుగని రీతిలో ముస్తాబు చేసింది టీడీపీ. ఈసారి ప్రతినిధుల సభ, బహిరంగ సభ వేర్వేరుగా ఏర్పాటు చేశారు. మహానాడు తొలిరోజు ప్రతినిధుల సభ ఉంటుంది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ నుంచి ముఖ్యనాయకులు, ప్రతినిధులు హాజరవుతారు. ప్రతినిధుల సభకు 15,000 మందిని ఆహ్వానించారు. 

నాలుగేళ్లలో జగన్ రాష్ట్రంలో చేస్తున్న విధ్వంసకర విధానాలను ప్రజలకు తెలియజేస్తామంటున్నారు టీడీపీ శ్రేణులు. నూటికీ నూరు శాతం టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమాతో ఉన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఏవిధంగా గాడిలోకి పెట్టాలి, పెట్టుబడులు పెట్టేందుకు ఎటువంటి నమ్మకాన్ని ఇవ్వాలని ప్రధానమైన ఉద్దేశ్యంతో మొదటి రోజు సభ జరుగుతుందన్నారు. 

అయిదు వింగ్‌లుగా తీసుకుని టీడీపీ బ్యాక్‌బోన్‌గా ఉన్నటువంటి బీసీల గురించి, దీంతోపాటు ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు సంక్షేమం గురించి, యువత, మహిళలు, రైతులు గురించి ప్రత్యేక దృష్టిసారించినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. వీటిపై ప్రత్యేక తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు. 

మ్యానిఫెస్టో విడుదల లేనట్లేనా..
టీడీపీ ఎన్నికల మ్యానిఫేస్టో ఎలా ఉండబోతుందో అధినేత చంద్రబాబు వివరించే ఛాన్స్ ఉందంటున్నారు టీడీపీ నాయకులు. రాబోయే విజయదశమి రోజున మ్యానిఫెస్టో ముసాయిదా విడుదల చేసి ప్రజల ముందు ఉంచుతారని చెబుతున్నారు. ప్రజల అభిప్రాయం తీసుకుని ఎన్నికల మ్యానిఫెస్టోను రూపకల్పన చేయబోతున్నారు. ప్రసంగికులు విషయంలో కూడా పాత కొత్త కలయికతో అవకాశం కల్పించనున్నారు. 

తెలుగుదేశం పార్టీ మహానాడు ఫెయిల్‌ అవ్వాలని ప్రభుత్వం అడుగడుగునా అనేక ఆటంకాలు సృష్టిస్తోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బస్సులు ఇవ్వడం లేదని, ప్రైవేటు వాళ్లు ఇస్తామంటే భయపెడుతున్నారన్నారు. ఆటోవాళ్ల మీద కేసులు పెడుతున్నారన్నారు. అందుబాటులో ఏ వాహనాలుంటే వాటిపై రావాలని లేకుండా కాలినడకన అయినా తరలిరావాలన్నారు. 

రాజమండ్రి సిటీ అంతా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలు కట్టుకుంటే రాత్రికి రాత్రి జగన్మోహన్‌రెడ్డి బ్లేడ్‌ బ్యాచ్‌ ఆటంకాలు సృష్టిస్తుందన్నారు అచ్చెన్న. ప్రజాస్వామ్యంలో పోలీసుల పాత్ర చాలా కీలకమని, జడ్‌ఫ్లస్‌ సెక్యూరిటీ కలిగిన చంద్రబాబు వస్తున్న సభకు ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా బందోబస్తు నిర్వహించాలని కోరారు. తాను డీజీపీకు లేఖ రాశానని, జిల్లా ఎస్పీనీ పార్టీ నాయకులు కలిశారని తెలిపారు. 

శుక్రవారం సాయంత్రం పొలిట్‌ బ్యూరో సమావేశం జరిగింది. రెండు రోజుల పాటు జరగనున్న మహానాడులో తీసుకోబోతున్న నిర్ణయాలు, ప్రవేశపెడుతున్న తీర్మానాలపై చర్చించారు. ఆమోదం తెలిపారు. 

రెండో రోజు భారీ బహిరంగ సభ నిర్వహించున్నారు. దీనికి ఏపీ, తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు 15లక్షల మంది జనాభా తరలివస్తారని అంచనా వేస్తున్నారు. దీని కోసం ప్రతీ కార్యకర్త ఒక వాలంటీర్‌గా మారి సేవలందిస్తారన్నారు అచ్చెన్న. మహానాడు అయ్యాక బాదుడే బాదుడేతోపాటు మరిన్ని సరికొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల సంఖారావంపూరిస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.  

మహానాడుపై అధికార పార్టీ వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది టీడీపీ. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు రాకుండా అడ్డుపడుతోందని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సు, స్కూల్ బస్సులు ఇవ్వకుండా చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించిన జనం రాజమండ్రి వచ్చితీరుతారన్నారాయన. 
మహానాడుకు తరలి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక భోజన ఏర్పాటు చేశారు. తొలి రోజు యాభై వేల మంది వస్తారని అంచనాతో వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్ర వరకు ఎప్పుడు వచ్చినా తినేలా వంటకాలు రెడీ అవుతున్నాయి. గోదావరి వంటకాలు రెండు రోజుల పాటు అతిథులను మైమరిపింపజేయనున్నాయి. 

13:17 PM (IST)  •  27 May 2023

రేపే తొలి మ్యానిఫెస్టో విడుదల చేస్తాం- మహానాడులో చంద్రబాబు ప్రకటన 

రాజమండ్రి వేదికగా జరుగుతున్న మహానాడులో మాట్లాడిన చంద్రబాాబు మేనిఫెస్టోపై కీలక ప్రకటన చేశారు. రేపు ప్రకటించబోతున్నట్టు వెల్లడించారు.  సంక్షేమం, అభివృద్ధి ప్లస్ ఇదే స్ఫూర్తితో మ్యానిఫెస్టో తీసుకొస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 

12:21 PM (IST)  •  27 May 2023

టీడీపీ కార్యకర్తల భవిష్యత్‌కు నాదీ బాధ్యత: చంద్రబాబు

పార్టీని తమ భుజాలపై మోస్తున్న కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. అందుకే అధికారంలోకి వచ్చినా, ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలను ఉన్నతస్థానంలో ఉంచుతామన్నారు. భవిష్యత్‌ కార్యకర్తలను ఆదుకునే బాధ్యత తీసుకుంటాను అన్నారు. సంపద సృష్టించడం తెలుసిన పార్టీ తెలుగుదేశం. సంపద పేదలకు పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంక్షేమం ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తమ పాలనలో వందల కొద్ది సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. 

12:07 PM (IST)  •  27 May 2023

ఆ ఏడు బంగ్లాల సంగతి ఏంటీ ? జగన్‌కు అచ్చెన్న ప్రశ్నల వర్షం

ఏడాది కాలంలో చనిపోయిన టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలకు సంతాపం తెలియజేశారు. అనంతరం మాట్లాడిన పార్టీ ఏపీ  అధ్యక్షుడు అచ్చెన్న... జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్సలు చేశారు. సీఎం జగన్ పచ్చి మోసగాడని ధ్వజమెత్తారు. అబద్దాల కోరు అని ఆరోపించారు. దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎం పేద అరుపులు అరుస్తున్నాడని విమర్శించారు. జగన్ అఫిడవిట్‌లో ఏముందో చెప్పగలవా అని సవాల్ చేశారు. దోపిడీదారుడైన జగన్ వద్ద 510 కోట్లు ఉన్నాయని తెలిపారు అచ్చెన్న. 

2004లో ఇల్లు తాకట్టు పెట్టిన వ్యక్తికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయా చెప్పాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. ఊరుకో బంగ్లా ఉన్న జగన్ పేదవాడా అని నిలదీశారు. పులివెందుల, ఇడుపులపాయ, లోటస్‌ పాండ్, అమరావతి, చెన్నై, బెంగళూరులో ఉన్న వాటి గురించి చెప్పాలన్నారు. 

11:56 AM (IST)  •  27 May 2023

ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రారంభించిన చంద్రబాబు

రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడులో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.. చిత్తూరు జిల్లా కౌంటర్‌లో ప్రతినిధిగా పేరు నమోదు చేసుకున్నారు.  వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మహానాడును లాంఛనంగా ప్రారంభించిన చంద్రబాబునాయుడు

11:32 AM (IST)  •  27 May 2023

ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించి మహానాడు కార్యక్రమాలు ప్రారంభించిన చంద్రబాబు

రాజమండ్రిలోని వేమగిరి వేదికగా మహాానాడు సంబరంగా ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ప్రతినిధులు తరలి వచ్చారు. కార్యకర్తల కోలాహలంతో గోదావరి తీరం పసుపువర్ణం సంతరించుకుంది. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget