Somu Veerraju: పొత్తులపై మేం క్లారిటీగానే ఉన్నాం, ఆ విషయాన్ని మాత్రం పవన్ నోటి వెంట వినండి: సోము వీర్రాజు

Janasena And TDP Alliance: బీజేపీ, జనసేన పొత్తు గురించి అందరికీ తెలుసునని, అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీతో కలిసి వెళ్తారా అని సోము వీర్రాజును మీడియా అడిగింది.

FOLLOW US: 

BJP AP Chief Somu Veerraju Interesting comments on Janasena And TDP Alliance :ఏపీలో గత కొన్నిరోజులుగా పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాపిక్ రాజకీయ పొత్తులు. ఎన్నికలకు ఏ పార్టీలు, ఎవరితో కలిసి వెళ్తాయనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీకి వెళ్తామని అధికార వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు. పొత్తుల విషయంపై తాము క్లారిటీగానే ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. అయితే జనసేన, టీడీపీ కలుస్తాయా, లేదా అనేది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను అడగాలని, ఆయన నోటి వెంటే ఆ మాట వినాలన్నారు.

పవన్ కళ్యాణ్‌ను అడగండీ.. 
నంద్యాల జిల్లాలో పర్యటించిన సందర్భంగా, అధికార వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని, కలిసే ఉండాలని పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఏలూరులో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. బీజేపీ, జనసేన పొత్తు గురించి అందరికీ తెలుసునని, అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీతో కలిసి వెళ్తారా అని సోము వీర్రాజును మీడియా అడిగింది. టీడీపీతో జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్‌ను అడగాలన్నారు. మేం, జనసేన కలిసే ఉన్నామని, తమ మధ్య పొత్తు ఉందని క్లారిటీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమన్నారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకున్నా, అది ప్రజల ప్రయోజనాల కోసమే అన్నారు.

బీజేపీ డిమాండ్‌తోనే రీపోస్టుమార్టం..
శ్రీ సత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని మరణించిన కేసు (B Pharmacy Student Death Case)లో అనుమానంతో రీపోస్టుమార్టం చేయాలని బీజేపీ డిమాండ్ చేసిందన్నారు. దాని ఫలితంగానే రీపోస్టుమార్టం జరిపించి పోలీసులు నిజాలు వెల్లడించారని గుర్తుచేశారు. ఇదే విషయంపై తమ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మరికొందరు నేతలతో కలిసి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారని చెప్పారు. ప్రధాన నిందితుడు సాధిక్‌తో పాటు అతడికి సహకరించిన కుటుంబసభ్యులు, మరికొందరిపై సైతం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు. నేడు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ నిందితుడు సాధిక్‌ను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం అత్యాచారం సెక్షన్ కూడా కేసులో చేర్చినట్లు చెప్పడంతో తమ అనుమానాలే నిజమయ్యాయని, తేజస్విని కుటుంబసభ్యులు, బంధువులు చెబుతున్నారు.

Also Read: B Pharmacy Student Case: బీఫార్మసీ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు అరెస్ట్, ప్రేమ పేరుతో నమ్మించి శారీరకంగా కలిశాడు, చివరికి విషాదం

Also Read: YSRCP News: మే 11 నుంచి ‘గడప గడపకూ వైఎస్ఆర్’, పూర్తి వివరాలు ఇవీ

Published at : 09 May 2022 01:54 PM (IST) Tags: BJP tdp janasena Chandrababu somu veerraju

సంబంధిత కథనాలు

Konaseema Name Change: అట్టుడుకుతున్న కోనసీమ, జిల్లా పేరు మార్చవద్దని ఆందోళన ఉధృతం - పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మాహత్యాయత్నం

Konaseema Name Change: అట్టుడుకుతున్న కోనసీమ, జిల్లా పేరు మార్చవద్దని ఆందోళన ఉధృతం - పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మాహత్యాయత్నం

East Godavari News : ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్

East Godavari News :  ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్

Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !

Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !

Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి

Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి

Amalapuram Celebrations: తొలిసారి థామస్ కప్ నెగ్గిన భారత్, ఏపీలోని అమలాపురంలో సంబరాలు - ఎందుకంటే !

Amalapuram Celebrations: తొలిసారి థామస్ కప్ నెగ్గిన భారత్, ఏపీలోని అమలాపురంలో సంబరాలు - ఎందుకంటే !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!

Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!

Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !

Complaint On Avanti Srinivas :

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్