By: ABP Desam | Updated at : 09 May 2022 02:38 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం (Picture Credit: vijayasaireddy.com)
ఏపీలో మూడేళ్ల పాలనను అధికార పార్టీ ఇంటింటికీ చేరవేసే కార్యక్రమాన్ని బుధవారం (మే 11) నుంచి ప్రారంభించనుంది. సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన ప్రయోజనంతో పాటు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ప్రజలకు వివరించనున్నారు. ఇలా గడపగడపకూ వెళ్లి ప్రభుత్వం చేసిన పనులను వివరించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
గడపగడపకూ వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు ఒక్కో సచివాలయం పరిధిలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ప్రతి ఇంటి గడపకూ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లు వెళ్లనున్నారు. ఆ ఇంట్లోని వాళ్లకు తాము మూడేళ్లలో అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు వివరించనున్నారు. భవిష్యత్తులోనూ తమకు తోడుగా ఉండాలని కోరనున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జ్‌లు తమను ఆశీర్వదించాల అడగనున్నారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో సుమారు 80 వరకూ సచివాలయాలు ఉంటాయి. నెలలో 20 రోజులు గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం సాగనుంది. ఈ కార్యక్రమం పూర్తి కావడానికి 8 నుంచి 9 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
గత నెల 27న నిర్వహించిన సమావేశంలో గడపగడపకూ వైఎస్ఆర్ కార్యక్రమం గురించి చర్చ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించి విజయవంతం చేయాలని సీఎం జగన్ సూచించారు. బాధ్యతను ప్రాంతీయ సమన్వయకర్తలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులకు అప్పగించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను జిల్లా అధ్యక్షులు, మంత్రులు, రీజినల్ కో ఆర్డినేటర్లు సమన్వయం చేయనున్నారు. రోజూ ఈ కార్యక్రమాన్ని సమీక్షించే బాధ్యతను ప్రాంతీయ సమన్వయకర్తల కో ఆర్డినేటర్, వైఎస్సార్‌పీపీ నేత వి.విజయసాయిరెడ్డికి సీఎం జగన్ అప్పగించారు.
ఈ కార్యక్రమం జరుగుతున్న తీరును తాను కూడా క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతానని సీఎం గతంలోనే తెలిపారు. సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమం ముగిసేలోపే బూత్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో 50 శాతం మహిళలే ఉంటారు. మొత్తానికి పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలనేది సీఎం జగన్ లక్ష్యంగా ఉంది.
గతంలో గడపగడపకు వైఎస్ఆర్ ఇలా
పలమనేరు నియోజకవర్గం YSRCP కో ఆర్డినటర్ డా.వెంకటే గౌడ గారి ఆధ్వర్యంలో పందివారిపల్లి గ్రామంలో మొదలైన గడప గడపకు వై యస్ ఆర్ సి పి కార్యక్రమం.https://t.co/FADk7MWDcf#ysrcp #ysjagan #politician #palamaneru #gadapagadapaku #leader pic.twitter.com/BWjW5hNW30
— N Venkate Gowda (@VenkateGowdaMLA) August 23, 2018
పలమనేరు నియోజకవర్గం YSRCP కో ఆర్డినటర్ డా.వెంకటే గౌడ గారి ఆధ్వర్యంలో బేరుపల్లి గ్రామంలో మొదలైన గడప గడపకు వై యస్ ఆర్ సి పి కార్యక్రమం.https://t.co/FADk7MF2kH#ysrcp #ysjagan #politician #gadapagadapaku #palamaneru pic.twitter.com/4yHF0VFbSk
— N Venkate Gowda (@VenkateGowdaMLA) August 22, 2018
Nara Lokesh : ముందస్తు బెయిల్ కోసం నారా లోకేష్ - ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో హైకోర్టులో పిటిషన్
Palaniswami in Vijayawada: ఏపీలో తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి - విజయవాడ దుర్గమ్మ దర్శనం
Undavalli Arunkumar: స్కిల్ స్కామ్‌లో ఉండవల్లి పిల్ వేరే బెంచ్‌కు - ‘నాట్ బిఫోర్ మి’ అన్న న్యాయమూర్తి
Nara Bhuvaneshwari: రాజమండ్రిలో చర్చికి భువనేశ్వరి, బ్రహ్మణి - చంద్రబాబు కోసం ప్రత్యేక ప్రార్థనలు
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో
Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?
Tiger 3 Teaser : 'టైగర్ 3'లో సల్మాన్ ఖాన్ దేశభక్తుడా? దేశ ద్రోహిగా మారాడా?
Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
/body>