News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP Fighter Rooster: యూ ట్యూబ్ వీడియోల్లో చూసి కోళ్లు కొనడానికి ఏపీ వచ్చిన థాయ్ లాండ్ వాసి

AP Fighter Rooster: ఏపీకి చెందిన ఓ పందెం కోడిని థాయ్ లాడ్ వాసులు 3 లక్షల రూపాయలు వెచ్చించి మరీ కొనుగోలు చేశారు.

FOLLOW US: 
Share:

AP Fighter Rooster: సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు ఏపీ వాసుల్లో వచ్చే ఆనందమే వేరు. రకరకాల పిండి వంటలు, కొత్త బట్టలు, కోడి పందేలు, అల్లుళ్ల రాక, భోగి మంటలు, ఆట పాటలు... అబ్బో ఒక్కటేమిటి సవాలక్ష సంబరాలతో పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే ఈ సంబురాల వీడియోలు చూడడం అంటే చాలా మందికి ఇష్టం. నెట్టింట ఏపీ సంక్రాంతి సంబురాలకు సంబంధించిన అనేక వీడియోలు ఉంటాయి. అయితే ఇలా వీడియోలు చూసిన కొంత మంది థాయ్ లాండ్ వాసులు.. తాజాగా ఏపీలోని ఏలూరుకు వచ్చారు. ముఖ్యంగా కోడి పందాలాకు సంబంధించిన వీడియోలను చూసి  వాటిని కొనుగోలు చేయాలనుకున్నారు. అక్కడి ప్రజలను అడిగి మరి ఓ పందెం కోడి పిల్లలను.. అత్యధిక ధరకు కొనుగోలు చేశారు. 3 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కోడి పిల్లను వెంట తీసుకెళ్లారు. 

27 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్న పందెం కోడి

ఈ ఏడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరిలోని గణపవరంలో జరిగిన కోడి పందాల్లో ఓ పందెం కోడి రూ.27 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంది. థాయ్ రూస్టర్ ప్రేమికులు ఫేస్‌బుక్‌లో కోడి పందాలను చూసి దానిని సొంతం చేసుకోవాలని అనుకున్నారు. ఆ కోడి యజమాని రత్తయ్యను ఆ కోడిని అమ్మాలని కోరారు. కోడి కోసం వారు 3 రోజుల పాటు అతనిని వేడుకున్నా, రత్తయ్య దాన్ని అమ్మేందుకు ఒప్పుకోలేదు. చివరకు తమ దేశంలో జాతిని అభివృద్ధి చేసేందుకు మరో కోడిని ఎంపిక చేసి రూ.3 లక్షలకు కొనుగోలు చేశారు.

40 ఎకరాల భూమిలో 500 కోళ్ల పెంపకం

27 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్న కోడి కోసం థాయ్ గ్రూప్  తనను ఎంతగానో బతిమాలినట్లు రత్తయ్య చెప్పారు. కానీ తనకు అదృష్టాన్ని తెచ్చి పెట్టిన ఆ కోడిని ప్రాణం పోయినా అమ్మనని అంటున్నారు. అలాగే వియత్నాం, మెక్సికో, కెనడా, యూఎస్‌ఏ, థాయ్‌లాండ్‌ వంటి దేశాలకు చెందిన వారు కోళ్ల కొనుగోలు కోసం ఫేస్‌బుక్‌ ద్వారా తరచూ సంప్రదిస్తున్నారని చెప్పారు. ఇటీవల వియత్నాంకు చెందిన ఓ సమూహం తన వద్ద నుంచి మొత్తం 40 పందెం కోళ్లను కొనుగోలు చేసింది. 40 ఎకరాల భూమిలో దాదాపు 500 పందెం కోళ్లను రత్తయ్య పెంచుతున్నట్లు వివరించారు. 

Published at : 31 Jul 2023 10:00 AM (IST) Tags: AP News Latest Viral News Fighter Rooster Fighter Rooster Selling Three Lakh Worth Rooster

ఇవి కూడా చూడండి

AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

AP High Court: ఎస్‌ఐ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు - 'ఎత్తు' విషయంలో ఏమందంటే?

AP High Court: ఎస్‌ఐ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు - 'ఎత్తు' విషయంలో ఏమందంటే?

Nara Lokesh: ఆ తమ్ముడ్ని నేను చదివిస్తా, విద్యార్థి ఆవేదన విని స్పందించిన లోకేష్

Nara Lokesh: ఆ తమ్ముడ్ని నేను చదివిస్తా, విద్యార్థి ఆవేదన విని స్పందించిన లోకేష్

Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Nara Lokesh Yuvagalam Resumed: రాజమండ్రి చేరుకున్న నారా లోకేష్, ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే యువగళం పున:ప్రారంభం

Nara Lokesh Yuvagalam Resumed: రాజమండ్రి చేరుకున్న నారా లోకేష్, ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే యువగళం పున:ప్రారంభం

టాప్ స్టోరీస్

LPG Cylinder Price Today: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెరిగిన గ్యాస్ రేట్లు, ఎల్‌పీజీ సిలిండర్‌ మరింత భారం

LPG Cylinder Price Today: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెరిగిన గ్యాస్ రేట్లు, ఎల్‌పీజీ సిలిండర్‌ మరింత భారం

Animal Review - ‘యానిమల్’ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్

Animal Review - ‘యానిమల్’ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!